పసందైన "బాదం లడ్డూలు" - కమ్మగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!
ఆహా అనిపించే స్వీట్ రెసిపీ - అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 2:22 PM IST
Almond Laddu Prepare in Telugu : మెజార్టీ పీపుల్‌కి ఫేవరెట్ స్వీట్ రెసిపీల్లో లడ్డూలు ఒకటి! ఇక ముఖ్యంగా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి తియ్యగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. వీటిని వివిధ రకాల పదార్థాలతో చేస్తుంటారు. మరి మీరు ఎప్పుడైనా బాదం లడ్డూలు తిన్నారా? లేదంటే మాత్రం ఓసారి ఇలా ట్రై చేశారంటే సూపర్‌గా వస్తాయి. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. అంతేకాక పాకం పట్టాల్సిన పనిలేదు. మరి ఈ బాదం లడ్డూలు ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
పుల్లగా, కమ్మగా "మెంతి ఆకు, టమోటా పచ్చడి" - వారం రోజులు నిల్వ ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు :
- బాదం - 2 కప్పులు
- పుచ్చకాయ గింజలు - 4 టేబుల్ స్పూన్లు
- ఎండుకొబ్బరి పొడి - 4 టేబుల్ స్పూన్లు
- గుమ్మడి గింజలు - 4 టేబుల్ స్పూన్లు
- కాజు - 4 టేబుల్ స్పూన్లు
- గసగసాలు - 4 టేబుల్ స్పూన్లు
- బొంబాయి రవ్వ - 4 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - సరిపడా
- గోధుమపిండి - 2 కప్పులు
- బెల్లం తురము - మూడు కప్పులు
- శనగపిండి - ఒక కప్పు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్

తయారీ విధానం :
- ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు కప్పుల బాదం వేయాలి. ఇప్పుడు మంటను లో ప్లేమ్‌లో ఉంచి కలుపుతూ దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అనంతరం వీటిని మిక్సీజార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి.
- ఇదే పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజలు, నాలుగు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు వేయాలి. అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి పొడి, నాలుగు టేబుల్ స్పూన్ల గసగసాలు, నాలుగు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

- అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయాలి.
- రవ్వ చక్కగా వేగిన తర్వాత రెండు కప్పుల గోధుమపిండి, కప్పు శనగపిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ కలపాలి. ఈ మిశ్రమం గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గోధుమపిండిశనగపిండి మిశ్రమం, గ్రైండ్ చేకున్న బాదం పొడి, మూడు కప్పుల బెల్లం తరుము వేయాలి. ఇందులోనే పుచ్చకాయగుమ్మడిగింజల మిశ్రమం, ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి.
- ఆ తర్వాత చేతికి నెయ్యి రాసి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ కావాల్సిన పరిమాణంలో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.

- ఇలా పిండి మొత్తాన్ని లడ్డూలుగా చేసుకొని ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరి.
- ఎంతో టేస్టీటేస్టీ బాదం లడ్డూలు రెడీ అయినట్లే!
రంజాన్ స్పెషల్ "చికెన్ జహాపనా" - ఎన్నడూ తినని టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తారు!
రాయలసీమ స్టైల్ "పచ్చిమిర్చి పప్పు" - ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకుంటారు!

