ETV Bharat / offbeat

ఇడ్లీ, దోసెల్లోకి "ఘీ కారం పొడి" - కమ్మగా, కారంగా అద్భుతంగా ఉంటుంది!

ఘుమఘుమలాడే కారం పొడి - ఇడ్లీ, దోసె, వడ, అన్నంలోకి కూడా తినేయొచ్చు!

ghee_karam_podi
ghee_karam_podi (ETV Bahrat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 10:14 AM IST

2 Min Read
Choose ETV Bharat

Ghee karam podi : ఘీ కారం దోసె, ఘీ కారం ఇడ్లీ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్​ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీ, దోసె, వడల్లో కారం పొడితో పాటు నెయ్యి వేసి ఇస్తుంటారు. ఇడ్లీ, దోసెల కమ్మదనంతో పాటు ఘుమఘుమలాడే కారం పొడికి తోడు నెయ్యి వేసుకుంటే రుచి, వాసన అద్దిరిపోతుంది. అయితే, నెయ్యి స్వచ్ఛమైనది వాడుకుంటేనే బాగుంటుంది. ఇపుడు మార్కెట్లో ఉన్న వాటిల్లో సగానికి పైగా కల్తీ నెయ్యి అని తెలుస్తోంది. ఇక కారం పొడి స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన పదార్థాలు ఉపయోగించి ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి.

"కారం పొడులు" మీకు ఇష్టమా? - ఇలాంటి "పుదీనా కారం పొడి" సింపుల్​గా చేసేయండి!

ghee_karam_podi
ghee_karam_podi (GettyImages)

కావల్సిన పదార్థాలు :

  • ఎండు మిర్చి - 60 గ్రాములు
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ధనియాలు - 35 గ్రాములు
  • జీలకర్ర - 1 స్పూన్
  • పసుపు - పావు స్పూన్
  • ఇంగువ - పావు స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి పాయలు - 12
  • నెయ్యి - 1 స్పూన్
ghee_karam_podi
ghee_karam_podi (GettyImages)

తయారీ విధానం :

  • ముందుగా 50 గ్రాముల ఎండు మిర్చి దుమ్ము, ధూళి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని సగానికి తుంచుకోవాలి. ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని తుంచి పెట్టుకున్న ఎండు మిర్చిని సన్నటి మంటపై వేయించాలి. మంట హై ఫ్లేమ్​లో పెడితే ఎండు మిర్చి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లో ఫ్లేమ్​లో కలుపుతూ వేయించాలి. మిర్చి ఎంత బాగా వేయిస్తే కారం పొడి కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఒక వేళ మిర్చి మాడగొట్టారా? కారం టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకే సన్నటి మంటపైనే వేయించాలి.
ghee_karam_podi
ghee_karam_podi (GettyImages)
  • ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకుని అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 35 గ్రాముల ధనియాలు వేసుకుని వేయించాలి. సన్నటి మంటపై కలుపుతూ 1 స్పూన్ జీలకర్ర కలిపి వేయించి పక్కకు తీసుకోవాలి. చల్లారిన తర్వాత వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రను మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి.
ghee_karam_podi
ghee_karam_podi (GettyImages)
  • ఆ తర్వాత 12వెల్లుల్లి పాయలు పొట్టు తీయకుండానే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంతే! ఈ కారం పొడి రెడీ అయినట్టే! ఆ తర్వాత గాజు సీసాలో భద్రం చేసుకుంటే చాలు! 2 నెలలైనా సరే కారం పొడి ఘుమఘుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం పొడిని దోసెలు వేసుకునే టైంలో వాడుకోవాలి. మీరు పదార్థాలు వేయించే టైంలో నూనెకు బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు. దోసె వేయగానే కారం పొడి చల్లుకుని, 1 స్పూన్ నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఘీ కారం దోసె రెడీ.

టిఫిన్ సెంటర్ స్టైల్ "చట్నీ" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

పల్లెటూరు "కాకా హోటల్ చట్నీ రెసిపీ" సీక్రెట్ ఇదే! - ఇడ్లీ, దోసెల్లోకి ఇది కమ్మగా ఉంటుంది!