ETV Bharat / offbeat

హైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ "రెడ్ చికెన్" - వీకెండ్ ఇలా చేస్తే ఇంట్లో పండగే!

- రెగ్యులర్ చికెన్ కర్రీలను మించిన టేస్ట్ - ఇంటిల్లిపాదీ ముక్క మిగల్చకుండా తినేస్తారు!

Red Chicken Curry
Red Chicken Curry (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 20, 2026 at 12:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad Wedding Special Red Chicken Curry : వీకెండ్​ వచ్చిందంటే ఫ్రెండ్స్​తో పార్టీలు, సరదా ముచ్చట్లతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే క్రమంలో ఇంటి దగ్గర ఉండేవాళ్లు ఫ్యామిలీతో రకరకాల రెసిపీలు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. అందులో ముఖ్యంగా నాన్​వెజ్ విషయానికొస్తే చికెన్​తో ఎప్పుడూ చేసుకునేవి కాకుండా కొత్త వాటిని ట్రై చేయాలని కోరుకుంటుంటారు. అందుకే, ఈ వీకెండ్ ఒక అద్దిరిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చాం. అదే, హైదరాబాదీ వెడ్డింగ్ స్పెషల్ "రెడ్ చికెన్". ఇది నార్మల్​గా చేసుకునే కర్రీల కంటే డిఫరెంట్​ టేస్ట్​తో చాలా చాలా బాగుంటుంది. అలాగే, ఒక్కసారి రుచి చూశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్ అనకమానరు. మరి, లేట్ చేయకుండా హైదరాబాద్ స్టైల్​లో అదరగొట్టే ఈ నయా స్టైల్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Red Chicken Curry
చికెన్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - కిలో
  • ఉప్పు - రుచికి తగినంత
  • నిమ్మకాయ - ఒకటి
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - మూడు టేబుల్​స్పూన్లు
  • పెరుగు - ఒకటిన్నర కప్పులు
  • టమాటాలు - నాలుగు
  • ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
  • షాజీరా - రెండు టీస్పూన్లు
  • వేయించిన జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు
  • కశ్మీరి చిల్లీ పౌడర్ - నాలుగు టీస్పూన్లు
  • కారం - రుచికి తగినంత
  • రెడ్ చిల్లీ సాస్ - నాలుగు టీస్పూన్లు
  • గ్రీన్ చిల్లీ సాస్ - రెండు టేబుల్​స్పూన్లు
  • టమాటా కెచప్ - మూడు టేబుల్​స్పూన్లు
  • వెనిగర్ - రెండు టేబుల్​స్పూన్లు
  • ఫ్రైడ్ ఆనియన్స్ - ఒక కప్పు
  • కొత్తిమీర తరుగు - ఒక కట్ట
  • నూనె - ఆరు టేబుల్​స్పూన్లు
  • నెయ్యి - నాలుగు టీస్పూన్లు
  • ఫ్రెష్ క్రీమ్ - నాలుగు టేబుల్​స్పూన్లు(ఆప్షనల్)
Red Chicken Curry
జీడిపప్పులు (Getty Images)

మసాలా పేస్ట్ కోసం :

  • బాదం - 20
  • పిస్తా పప్పులు - 20
  • జీడిపప్పు పలుకులు - 20
  • చిరోంజి సీడ్స్ - నాలుగు టీస్పూన్లు
  • దాల్చినచెక్క - అంగుళం ముక్క
  • యాలకులు - ఏడెనిమిది
  • లవంగాలు - నాలుగైదు
  • మిరియాలు - ఒక టీస్పూన్
  • పచ్చిమిర్చి - ఆరేడు

మీరు 'హలీమ్'​ ప్రియులా? - ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోండిలా

Red Chicken Curry
బాదం (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్​ను మారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకుని అందులో రుచికి తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, నిమ్మరసం పిండి అవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి.
  • ఆలోపు రెసిపీకి మంచి గ్రేవీనిచ్చే ఒక ప్రత్యేకమైన మసాలా పేస్ట్​ను రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్​లో బాదం, పిస్తా పప్పులు, జీడిపప్పు పలుకులు, చిరోంజి సీడ్స్ వేసి సన్నని సెగ మీద దోరగా వేయించాలి.
  • అవి లైట్​గా వేగాక యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, కారం గల పచ్చిమిర్చి వేసుకుని అన్నింటినీ బాగా వేయించుకోవాలి.
Red Chicken Curry
పెరుగు (Getty Images)
  • అవన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్​లోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
  • అలాగే, నాలుగు టమాటాలను ముక్కలుగా చేసి మిక్సీ గిన్నెలో వేసుకుని ప్యూరీలా చేసుకుని రెడీగా ఉంచాలి.
  • అనంతరం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్​లో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, మీగడ పెరుగు, టమాటా ప్యూరీ, షాజీరా, ధనియాలపొడి, వేయించిన జీలకర్రపొడి, కశ్మీరి చిల్లీ పౌడర్, రుచికి తగినంత కారం వేసుకోవాలి.
  • అలాగే, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, వెనిగర్, వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియ్స్, కొత్తిమీర తరుగు ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్నాక చేతితో చికెన్​ను పిండుతూ మసాలాలన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
Red Chicken Curry
టమాటాలు (Getty Images)
  • నెక్ట్స్ కలర్ కోసం మీకు నచ్చితే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని మరోసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
  • అలా కలిపిన తర్వాత చికెన్ మిశ్రమాన్ని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్​లో ఉంచాలి. ఫ్రిడ్జ్ లేనివారు నార్మల్​గా బయటే ఉంచినా పర్వాలేదు.
  • అనంతరం స్టవ్ మీద పాన్​ పెట్టి నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యాక రెండు గంటల పాటు పక్కనుంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్​లో 25 నుంచి 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
Red Chicken Curry
మసాలా దినుసులు (Getty Images)
  • ఇలా ఉడికించుకునే క్రమంలో ఒకవేళ మీకు గ్రేవీ మరీ చిక్కగా మారుతుందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి పలుచగా చేసుకోవచ్చు.
  • చికెన్ బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చివరగా మీకు నచ్చితే ఫ్రెష్ క్రీమ్ వేసుకుని కలిపి దింపేసుకుంటే చాలు.
  • అంతే, హైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్​లో ఘుమఘుమలాడే సూపర్ టేస్టీ "రెడ్ చికెన్ కర్రీ" రెడీ అవుతుంది!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ స్టైల్​లో చికెన్ కర్రీ వండి చూడండి. ఇంటిల్లిపాదీ టేస్ట్​కు ఫిదా అవుతారు!
Red Chicken Curry
కొత్తిమీర (Getty Images)

అదిరే టేస్ట్​కి కేరాఫ్ ఈ "గోంగూర మటన్" - ఇలా ప్రిపేర్ చేయండి!

కుక్కర్​లో కమ్మని "కోడిగుడ్డు పులుసు" - నిమిషాల్లోనే తయార్!