ETV Bharat / offbeat

'హైదరాబాద్ టు మంగుళూరు ప్రత్యేక రైళ్లు' - మొత్తం 32 స్టేషన్లు, ఎక్కడెక్కడ ఆగుతుందంటే!

ఈ నెల 9నుంచి నవంబర్ 26 వరకు ప్రత్యేక రైళ్లు - ప్రతి బుధవారం నుంచి హైదరాబాద్​లో స్టార్ట్!

హైదరాబాద్ టు మంగుళూరు
hyderabad_to_mangalore_special_train (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 3, 2026 at 12:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad to Mangalore Special Train : హైదరాబాద్ - మంగుళూరు మధ్య 12 ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అధిక రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు ఈ నెల 9 నుంచి నవంబర్ 26 వరకు ప్రయాణించనున్నాయి. ప్రతి బుధవారం హైదరాబాద్ నుంచి మంగుళూరు, ప్రతి గురువారం మంగుళూరు నుంచి హైదరాబాద్ బయల్దేరనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, వికారాబాద్, సెడాం, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక, కృష్ణరాజపురం, బంగారపేట్, కుప్పం, సేలం, ఈ రోడ్, తిరుప్పూర్, పోదనూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, షోర్నూర్, తిరుర్, కోజికోడ్, వడక్కర, తలసేరి, కన్నూర్, పయనూర్, కన్హాగడ్, కాసర్​గోడ్ స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.

ట్రైన్ నంబర్ 07097 హైదరాబాద్ టు మంగుళూరు స్పెషల్ ఈ నెల 9న తొలి ప్రయాణం ప్రారంభం కానుంది. హైదరాబాద్​లో ఉదయం 4.20గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 9.30గంటలకు మంగుళూరు చేరుతుంది. ప్రయాణ సమయం దాదాపు 29గంటలు కాగా, 1500కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో 32స్టేషన్లలో ఆగుతుంది.

రైలు ప్రయాణం పెట్టుకున్నారా? - భారీగా రైళ్ల దారి మళ్లింపు, వేళల్లో మార్పులు!

బుధవారం ఉదయం 4.20గంటలకు హైదారాబాద్​లో ప్రారంభమై బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సెడాం, యాద్గిర్, కృష్ణా స్టేషన్ల మీదుగా 9.58గంటలకు మంత్రాలయం రోడ్ చేరుతుంది. మధ్యాహ్నం 12గంటలకు గుంతకల్, 1.13గంటలకు అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక, కృష్ణరాజపురం, బంగారపేట మీదుగా కుప్పం, సేలం, ఈ రోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్, షోర్నూర్, తిరూర్, కోజికోడ్, విడకర, తలస్సేరి, కన్నూర్, పయనూర్, కన్హాగడ్, కాసర్ గోడ్ మీదుగా ఉదయం 9గంటలకు మంగుళూరు చేరుకుంటుంది.

ట్రైన్ నంబర్ 07098 మంగుళూరు టు హైదరాబాద్ స్పెషల్ ఈ నెల 10వ తేదీన తొలి ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ రైలు సాయంత్ర 6.25గంటలకు గుంతకల్, 7.58గంటలకు మంత్రాలయం రోడ్, 8.53గంటలకు రాయచూర్, 9.40గంటలకు కృష్ణా, 10.28గంటలకు యాద్గిర్, 11.28గంటలకు సెడాం, అర్ధరాత్రి 12.50గంటలకు వికారాబాద్, 1.33గంటలకు లింగంపల్లి, 2గంటలకు బేగంపేట్, 4గంటలకు హైదరాబాద్ స్టేషన్ చేరుకుంటుంది.

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్ - ఆ తేదీల్లో 'చర్లపల్లి, తిరుచానూరు' మధ్య ప్రత్యేక రైళ్లు!

రెండ్రోజుల పాటు 'తిరుపతి-రక్సల్' రైలు రద్దు! - 'దక్షిణ మధ్య రైల్వే' కీలక ప్రకటన