ETV Bharat / offbeat

జులై 4న "కాశీ, అయోధ్య, బైద్యనాథ్‌" క్షేత్రాలకు 'ప్రత్యేక రైలు' - రూ.16 వేలు కడితే చాలు!

ఐఆర్​సీటీసీ సూపర్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరకే ప్రముఖ పుణ్యక్షేత్రాలను వీక్షించే ఛాన్స్!

Hyderabad to Kashi Tour
Hyderabad to Kashi Tour (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 28, 2026 at 11:55 AM IST

4 Min Read
Choose ETV Bharat

Hyderabad to Kashi Tour : దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను చూసి రావాలని చాలా మందికి ఉంటుంది. అయితే, ఎలా వెళ్లాలో తెలియక కొంతమంది, ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయేమోనని మరికొందరు పుణ్యక్షేత్రాలను సందర్శించలేకపోతుంటారు. అలాంటివారందరి కోసం భారత రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఒక సూపర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని ద్వారా తక్కువ ధరకే దేశంలోనే కొన్ని ఫేమస్ దేవాలయాలను వీక్షించొచ్చు. మరి, ఈ టూర్ ప్యాకేజీ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టికెట్ ధర ఎంత? ఏయే ప్రాంతాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

"అయోధ్య - కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్‌ధామ్‌"(AYODHYA- KASHI: PUNYA KSHETRA YATRA WITH BAIDYANATH DHAM) పేరిట ఐఆర్​సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక పర్యాటక రైలులో ఈ టూర్​ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్‌ క్షేత్రాల్లోని వివిధ ఆలయాలను సందర్శించవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్లుగా ఈ పర్యటన కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల గుండా ఈ ప్రత్యేక పర్యాటక రైలు నడుస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులు ఆయా స్టేషన్లలో ట్రైన్ ఎక్కొచ్చు, దిగొచ్చు.

యాత్ర కొనసాగనుందిలా..

డే 1 :

మొదటి రోజున మధ్యాహ్నం రెండు గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలు స్టార్ట్ అవుతుంది. చర్లపల్లి, కాజీపేట, వరంగల్​, ఖమ్మం, విజయవాడ మీదుగా గుడివాడ వరకు ప్రయాణిస్తుంది.

డే 2 :

సెకండ్ డే మార్నింగ్ 12 గంటల 25 నిమిషాలకు భీమవరం జంక్షన్​కు చేరుకుంటుంది. ఆ తర్వాత తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.

డే 3 :

థర్డ్ డే ఉదయం 8 గంటలకు గయ రైల్వే స్టేషన్​కు రీచ్​ అవుతారు. అనంతరం ముందుగానే బుక్​ చేసిన హోటల్​లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం భోజనం తర్వాత విష్ణుపాద దేవాలయాన్ని విజిట్ చేస్తారు. అదే హోటల్​లో ఆ రోజు రాత్రి డిన్నర్, స్టే ఉంటుంది.

డే 4 :

నాలుగోరోజు మార్నింగ్ టిఫెన్ తర్వాత వారణాసికి స్టార్ట్ అవుతారు. ఒంటి గంటకు బనారస్ రైల్వే స్టేషన్​కు రీచ్ అవుతారు. అనంతరం సారనాథ్​కు బయలుదేరి అక్కడి హోటల్​లో చెక్ ఇన్​ అవుతారు. ఆ రాత్రికి​ అక్కడే బస, డిన్నర్ ఉంటుంది.

డే 5 :

ఐదో రోజు ఉదయం హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత 'కాశీనాథుని పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల' విజిటింగ్ ఉంటుంది. ఈవెనింగ్ గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వారణాసిలోనే ఆ రోజు రాత్రి బస ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్​న్యూస్! - ఒక్క ట్రైన్​లోనే తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం!

డే 6 :

ఆరో రోజు ఎర్లీ మార్నింగ్ హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి అయోధ్యకు పయనమవుతారు. ఆ రోజు 12 గంటలకు అయోధ్యకు చేరుకుని ప్రముఖ దర్శనీయ ప్రాంతాలను విజిట్ చేస్తారు. శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరుతారు.

డే 7 :

ఏడో రోజు మార్నింగ్ 5 గంటలకు ప్రయాగ్‌రాజ్‌ రీచ్ అవుతారు. అక్కడ త్రివేణి సంగమం, మరికొన్ని ప్రదేశాలను విజిట్ చేసి జసిదిహ్ జంక్షన్ రైల్వే స్టేషన్​కు వెళ్తారు.

డే 8 :

ఎనిమిదో రోజు ఉదయం జసిదిహ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్నాక అక్కడి హోటల్​లో చెక్ ఇన్ అయ్యి రెడీ అవుతారు. ఆ తర్వాత బాబా బైద్యనాథ్ ఆలయాన్ని దర్శించుకుని నైట్ 7 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్ అవుతారు.

డే 9 :

తొమ్మిదో రోజు విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం వరకు భారత్ గౌరవ్ రైలు ప్రయాణిస్తుంది.

డే 10 :

పదో రోజు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, చర్లపల్లి ప్రాంతాల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్‌ చేరుకోవటంతో ఈ యాత్ర ముగుస్తుంది.

టికెట్ ధరలు చూస్తే..

  • స్లీపర్ కోచ్ : టికెట్‌ ధర (స్లీపర్‌ కోచ్‌) పెద్దలకు రూ.16,400, 5-11 ఏళ్లలోపు పిల్లలకు రూ.15,300గా నిర్ణయించారు.
  • థర్డ్‌ ఏసీ కోచ్‌ : ఈ కోచ్​లో ప్రయాణించాలనుకునేవారు పెద్దలు రూ.25,500, పిల్లలకు రూ.24,200 చెల్లించాల్సి ఉంటుంది.
  • సెకండ్ ఏసీ : ఇందులో అయితే పెద్దలకు రూ.33,200, పిల్లలకు రూ.31,500 నిర్ణయించారు

ప్యాకేజీలో ఏమేం ఉంటాయంటే?

  • మీరు ఎంచుకున్న​ ప్యాకేజీని బట్టి ట్రైన్​లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ జర్నీ ఉంటుంది.
  • అలాగే, ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం ఉంటుంది.
  • మార్నింగ్ కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, భోజనం ఇందులోనే అందిస్తారు.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
  • ప్యాకేజీలో లేని ప్రాంతాలను చూడాలన్నా, గైడ్‌ని నియమించుకోవాలన్నా యాత్రికులే చూసుకోవాలి.
  • ప్రస్తుతం భారత్ గౌరవ్​ రైలులో కొనసాగే ఈ టూర్ జులై 4, 2026న అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టికెట్లు బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి. లేదా 76709 00698, 76709 00482, 76709 00689, 92810 30714 నంబర్లను సంప్రదించవచ్చు.

"తిరుపతి టూర్ షెడ్యూల్" - పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ప్లాన్ ఇది!

"హైదరాబాద్ టు తిరుపతి" - గుంటూరు వెళ్లకుండానే నల్లగొండ, కడప మీదుగా నయా ట్రైన్!