ETV Bharat / offbeat

రసం తీసి "నిమ్మ తొక్కలు" పడేస్తున్నారా?- ఇలా వాడితే ఎన్నో బెనిఫిట్స్​!

-నిమ్మరసం తీసినాక పనికిరావని తొక్కలు డస్టబిన్​లో వేస్తున్నారా? - కానీ వాటితో కూడా ఎన్నో పనులు పూర్తి!

How to Use Lemon Peels
How to Use Lemon Peels (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2026 at 8:37 PM IST

3 Min Read
Choose ETV Bharat

How to Use Lemon Peels: నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నిమ్మలో శరీరానికి చాలా ఉపయోగకరమైన విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా బాగా తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా సమ్మర్​లో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ నీళ్లు తాగుతుంటారు. అయితే, సందర్భమేదైనా మెజార్టీ పీపుల్ నిమ్మకాయలు కోసి రసాన్ని తీసినప్పుడు వాటి తొక్కలను డస్ట్​బిన్​లో పడేస్తుంటారు. కానీ, మీకు తెలుసా? పనికి రావని బయటపడేసే నిమ్మ తొక్కలతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

  • కొన్ని పండ్లను కట్​ చేస్తున్నప్పుడు మరీ ముఖ్యంగా బీట్‌రూట్, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి ఫ్రూట్స్​ను కట్‌ చేస్తున్నప్పుడు చేతులు రంగు మారుతుంటాయి. దీంతో ఎంత రుద్దినా ఆ మరకలు ఓ పట్టాన పోవు. అయితే ఆ మరకలు పోయి చేతులు శుభ్రంగా ఉండాలంటే నిమ్మ తొక్కలతో రుద్దుకుంటే మంచి రిజల్ట్​ ఉంటుందని చెబుతున్నారు.
  • కిచెన్​ సింక్​ ముఖ్యంగా స్టీల్​ సింక్​ను ఉపయోగిస్తుంటే తొందరగా జిడ్డుగా మారుతుంది. ఇక ఈ జిడ్డును వదిలించాలంటే కాస్త కష్టపడాల్సిందే. అయితే జిడ్డుగా మారిన వంటింటి సింకును నిమ్మచెక్క, డిష్​వాష్​తో రుద్దితే ఈజీగా శుభ్రపడుతుందని.. దుర్వాసనలూ దూరమవుతాయని చెబుతున్నారు.
  • కాలం ఏదైనా చెమట వల్ల షూస్​ దుర్వాసన వస్తుంటాయి. అలాగని ప్రతిసారీ వాటిని శుభ్రం చేయలేం. అలా చేస్తే కొన్నిసార్లు బూట్లు పాడవుతుంటాయి. అలాంటప్పుడు నిమ్మతొక్కలు ఎఫెక్టివ్​గా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎండబెట్టిన నిమ్మచెక్కలని వాటిలో వేసి ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటుందని చెబుతున్నారు.
  • టవల్స్, దుస్తులపై పడిన కొన్ని మరకలు ఓ పట్టాన వదలవు. బాగా రుద్దితే దుస్తులు చిరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు నిమ్మ తొక్కలు, వంటసోడా మ్యాజిక్​ చేస్తాయని అంటున్నారు. ఒక బకెట్​లోకి నిమ్మ తొక్కలు, బేకింగ్ సోడా వేసి నీరు పోసి అందులో వాటిని కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత ఉతికితే ఫలితం ఉంటుందంటున్నారు.
  • కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి కట్​ చేయడానికి ఉపయోగించే చాపింగ్​ బోర్డ్ తొందరగా మురికిగా మారుతుంది. అదే విధంగా దుర్వాసన కూడా వస్తుంది. అయితే​ వాడేసిన నిమ్మచెక్కలని ఉప్పులో ముంచి వాటితో కాయగూరల బోర్డుని రుద్దితే అది శుభ్రపడుతుందని అంటున్నారు. అలాగే వాటిపై ఏవైనా మరకలున్నా అవి తొలగిపోయి.. మంచి సువాసన వస్తుందని చెబుతున్నారు.
  • హౌజ్​ క్లీనింగ్​తో పోలిస్తే బాత్‌రూమ్‌ క్లీనింగ్​ కాస్త కష్టమైన పనే. ఆ మరకలు ఓ పట్టాల వదలవు. అయితే టైల్స్‌పైన ఉన్న సబ్బు మరకలు, ట్యాప్‌లపైన ఉన్న జిడ్డు మరకలు పోవడానికి నిమ్మతొక్కలను వాడవచ్చని చెబుతున్నారు. అదే విధంగా కొద్దిగా వెనిగర్‌లో నిమ్మతొక్కలను వేసి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజున కాసిన్ని నీళ్లు కలిపి ఓ సీసాలో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసుకుంటూ క్లీన్​ చేసుకుంటే బాత్‌రూమ్‌ ఈజీగా శుభ్రం అవుతుందని అంటున్నారు.
  • నిమ్మలో సిట్రిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటి తొక్కలు క్లీనింగ్‌ ఏజెంట్‌గా మురికిని ఇట్టే మాయం చేస్తాయంటున్నారు. ఇందుకోసం.. గుప్పెడు నిమ్మ తొక్కలను తీసుకుని ఓ ప్లాస్టిక్‌ బాక్స్​లో వేయాలి. ఆపై ఇందులో ఆరు చెంచాల వైట్‌ వెనిగర్‌ వేసి బాగా కలిపి మూతపెట్టాలి. ఈ లిక్విడ్​ని రెండు లేదా మూడువారాలు నాననివ్వాలి. అనంతరం దీన్ని వడకట్టి సమపాళ్లలో నీటిని కలిపితే ఆల్‌పర్పస్‌ క్లీనర్‌ రెడీ అవుతుంది. లిక్విడ్​ని స్ప్రేబాటిల్లో నింపి తలుపులు, కిటికీలు, టీపాయి అద్దాలు, పొయ్యి చుట్టుపక్కల దిమ్మె, వంటింట్లోని సింక్‌ వంటివాటిపై స్ప్రేచేసి 10 నిమిషాల తర్వాత తుడిస్తే చాలు. మురికి తొలగిపోయి తళతళా మెరుస్తాయంటున్నారు.
  • రోజూ ఆహార పదార్థాలు వేడి చేసే క్రమంలో మైక్రోవేవ్​ ఓవెన్​లో కొన్ని అవశేషాలు ఉండిపోయి వేడికి ఎండిపోతాయి. వాటిని సాధారణంగా శుభ్రం చేయడం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు గుప్పెడు నిమ్మతొక్కల ముక్కలను వాటర్​ నింపిన బౌల్లో వేసి 5 నిమిషాల పాటు మైక్రోవేవ్‌లో ఉంచి వేడి చేయాలి. దీంతో నిమ్మరసం ఆవిరి లోపలంతా వ్యాప్తి చెందుతుంది. తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే సరిపోతుందని అంటున్నారు.