ETV Bharat / offbeat

కొత్త "స్కూల్​ బ్యాగ్​, షూస్"​ కొనాల్సిన పనిలేదు! - పాతవే ఇలా మెరిసిపోతాయి!

- మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం - కొత్త స్కూల్​ బ్యాగ్​, షూస్​ కావాలని మారం చేస్తున్న పిల్లలకు ఈ విషయాలు చెప్పండి!

How to Reuse Old School Bags and Shoes
How to Reuse Old School Bags and Shoes (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2026 at 9:21 AM IST

3 Min Read
Choose ETV Bharat

How to Reuse Old School Bags and Shoes : సమ్మర్​ హాలిడేస్​ ముగింపు దశకు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇక కొత్త అకడమిక్​ ఇయర్​ అంటే అన్నీ కొత్తవి కావాలని పిల్లలు మారం చేస్తుంటారు. కొత్త బ్యాగ్, షూస్, పెన్సిల్‌ బాక్స్, యూనిఫాం కావాలంటూ అడుగుతుంటారు. ఇక పెద్దలు కూడా పిల్లలు అడిగారు కదా అని డబ్బులు ఉన్నా, లేకపోయినా కొనుగోలు చేస్తుంటారు. అయితే, ప్రతిసారీ కొత్తవి కొనే బదులు ఉన్నవాటినే కొత్తగా చేసి వాడుకుంటే ఎంత బాగుంటుందో కదా! దీని వల్ల డబ్బులు సేవ్​ అవుతాయి. ఎందుకంటే బ్యాగులు, షూస్​ సహా చదువుకోవడానికి అవసరమయ్యే వాటిని కొనాలంటే ఒకరికే వేలల్లో ఉంటుంది. అదే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే పరిస్థితి మరింత దారుణం. అందుకే ఉన్న వాటినే కొత్తగా మెరిపిస్తే ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. మరి, వాటిని ఎలా మెరిపించాలో ఈ స్టోరీలో చూద్దాం.

స్కూల్​ బ్యాగ్స్​: గత సంవత్సరం ఉపయోగించిన స్కూల్​ బ్యాగ్, లంచ్​ బ్యాగ్​ బాగానే ఉన్నా కొత్తవి కావాలని మారం చేసే పిల్లలు ఎంతో మంది. అందుకు వాళ్లు చెప్పే కారణాలు కూడా వింతగా ఉంటాయి. బ్యాగ్​లో బుక్స్​కు స్పేస్​ సరిపోవడం లేదు, పొట్టిగా అయ్యింది, కలర్​ నచ్చలేదు అంటూ ఎన్నో సాకులు చెబుతారు. ఈ ఒక్కసారికి వాడమని చెప్పినా అస్సలు వినరు. దీంతో పిల్లలకు నచ్చ చెప్పలేక పేరెంట్స్​ బ్యాగ్స్​ కొనిస్తుంటారు. అయితే పాత స్కూల్​ బ్యాగ్‌ పాడవకుండా సరిగ్గానే ఉంటే దానినే ఉపయోగించడం మంచిదంటున్నారు. అందుకు దాన్ని నీట్​గా క్లీన్​ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త బ్యాగ్​ కొనాలంటే అయ్యే ఖర్చుసహా వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలను పిల్లలకు వివరిస్తే అర్థం చేసుకుంటారని అంటున్నారు. అంతగా వాడటానికి వీలు కానీ పక్షంలో కొనడం సబబు అని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే బ్యాగ్​ క్లీన్​ చేయడానికి వాషింగ్​ సోడా పనికొస్తుందని చెబుతున్నారు. అందుకోసం ఓ బకెట్​లో సగానికి పైగా వాటర్​ నింపి, అందులోకి 2 టీస్పూన్ల వాషింగ్​ సోడా, డిటర్జెంట్​ పౌడర్​ వేసి బాగా కలపాలి. ఆ నీటిలో స్కూల్​ బ్యాగ్​ను ఉంచి సుమారు 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్మూత్​ బ్రష్​ లేదా స్క్రబ్బర్​ సాయంతో క్లీన్​ చేసి బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకుంటే మురికి పోయి కొత్త వాటిలా మెరిసిపోతాయంటున్నారు. ఇక వాటికి కీ చైన్లు తగిలిస్తే మరింత కొత్తగా ఉంటాయని చెబుతున్నారు.

షూస్​: యూనిఫాం కింద వేసుకునే షూస్​ విషయంలో కూడా పిల్లలు మొండి చేస్తుంటారు. "మా ఫ్రెండ్స్​ కొత్తవి కొనుకున్నారు.. నాకూ కొత్తవి కావాలి" అని మారం చేస్తుంటారు. షూస్​ ఎంత మంచిగా, కొత్తగా ఉన్నా సరే వద్దంటే వద్దంటుంటారు. కాలు సైజ్​ పెరిగి షూస్‌ సరిపోకపోతే లేదా చిరిగిపోతే కొత్తవి కొనొచ్చు కానీ, పాతవి సరిగా ఉన్నా కొత్తవి కావాలంటే నో అని చెప్పడమే మంచిదంటున్నారు. దాని గురించి కూడా అర్థమయ్యేలా చెప్పాలంటున్నారు.

ఈ క్రమంలోనే షూస్​ను కొత్త వాటిలా మెరిపించడానికి కొన్ని టిప్స్​ ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. ఓ బకెట్​లో కొన్ని వాటర్​, డిటర్జెంట్​ లిక్విడ్​ తీసుకుని షూస్​ను కొద్దిసేపు నానబెట్టాలి. అరగంట తర్వాత బ్రష్​ సాయంతో క్లీన్​ చేసి బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా ఆరినాక పాలిష్​ చేస్తే కొత్త వాటిలా పర్ఫెక్ట్​గా ఉంటాయని చెబుతున్నారు.

యూనిఫాం: ప్రతీ అకడమిక్​ ఇయర్​కు కొత్త యూనిఫాం కావాలని మారాం చేసే పిల్లలు ఎంతో మంది. బటన్స్​ ఊడిపోయినా, కొంచెం లూజ్​ అయినా వెంటనే కొత్తవి కావాలంటుంటారు. అయితే యూనిఫాం పాతదైనా సరే ఎటువంటి డ్యామేజ్​ కాకుండా ఉంటే దానినే వాడాలంటున్నారు. ఈ విషయాన్ని పిల్లలకు అర్థం అయ్యేలా చెబితే ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఈ క్రమంలోనే యూనిఫారమ్​ను డిటర్జెంట్​తో నీట్​గా ఉతికి చక్కగా జాడించి ఎండలో ఆరబెట్టాలి. డ్రెస్​లు మంచిగా ఆరినాక తీసి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్​ చేసుకోవాలంటున్నారు. అంటే బటన్​ ఊడిపోతే కొత్తవి పెట్టడం, ఎక్కడైనా కుట్లు ఊడిపోతే స్టిచ్​ చేయడం వంటివి చేయాలంటున్నారు. ఆ తర్వాత నీట్​గా ఐరన్​ చేస్తే కొత్తదానిలానే కనిపిస్తుందని అంటున్నారు.

కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంక వేరేవి కూడా ఏమైనా పాతగా అయినట్లు అనిపిస్తే వాటినే కొత్తవాటిలా మెరిపిస్తే డబ్బులు సేవ్​ కావడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. మరి మీరూ ట్రై చేస్తారా?

వేసవిలో పిల్లలు ఎక్కువగా మొబైల్​ చూస్తున్నారా? - డేను ఇలా ప్లాన్​ చేస్తే ఫోన్ అస్సలు ముట్టుకోరు!

సెలవుల్లో సరదాగా - ఈ ఫన్​ యాక్టివిటీస్​ ట్రై చేయండి పిల్లలు!