ETV Bharat / offbeat

పూజల వేళ దుస్తులపై 'పసుపు, కుంకుమ' మరకలా? - ఇలా ఉతికితే ఈజీగా మాయం!

బట్టలపై పసుపు మరకలు ఎంతకీ పోవట్లేదా? - ఈ టిప్స్​తో సూపర్ రిజల్ట్ అంటున్న నిపుణులు!

Turmeric Stain Removal from Clothes
దుస్తులపై మరకలు (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 24, 2026 at 3:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Turmeric Stain Removal from Clothes : ప్రస్తుతం శ్రావణ మాస పూజలు, వ్రతాల సందడి నడుస్తోంది. ఈ వేడుకల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, పూజా కార్యక్రమాల్లో వాడే పసుపు, కుంకుమ, గంధం వంటివి దుస్తులకు అంటుకుని మరకలు ఏర్పడుతుంటాయి. అయితే, ఈ మరకలు నార్మల్​గా ఉతికితే అంత ఈజీగా తొలగిపోవు. దాంతో చాలా మంది ఈ మొండి మరకలు తొలగించడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మీకూ ఇలాంటి సమస్యే ఉందా? అయితే ఓసారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. దుస్తులపై పడిన పసుపు, గంధం మరకలు ఈజీగా తొలగిపోయి మునుపటిలా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. మరి, ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బేకింగ్ సోడాతో మరకలు మాయం :

దుస్తులకు పసుపు అంటినప్పుడు కడిగితే ఆ మరక మరింతగా విస్తరిస్తుంది. సబ్బు పెడితే అది ఎర్రగా మారతుంది. ఈ రెండూ తలనొప్పి తెచ్చేవే. అందుకే, బట్టలకు అంటుకున్న పసుపు మరకలను జాగ్రత్తగా శుభ్రం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా పసుపు అంటిన ప్రాంతాన్ని వాటర్​తో కడగాలి. అయితే, వేడి నీళ్లు సమస్యలను మరింత జటిలం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, చల్లటి నీళ్లు వాడడమే మేలు అంటున్నారు.

అనంతరం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని, దానికి తగినన్ని నీళ్లు కలిపి మందమైన పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని ముందుగా కడిగిన క్లాత్​పై మరక ఉన్నచోట రాయాలి. అలా రాసిన తర్వాత ఆ క్లాత్​ను 20 నిమిషాలు పక్కనుంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ఉతికేస్తే సరి. పసుపు మరక ఈజీగా తొలగిపోతుందంటున్నారు నిపుణులు. ఒకవేళ మరక ఇంకా కనిపిస్తే మళ్లీ ఈ ప్రక్రియను పునరావృతం చేయాలని చెబుతున్నారు.

వాన నీటి కోసం ఇంట్లో ఈ 'ఫిల్టర్​' ఉంటే - విద్యుత్తు, నీటి బిల్లులు ఆదా!

లిక్విడ్ డిష్​వాష్ :

పసుపు మరకలు అంటిన దుస్తులను చల్లటి నీటితో కడిగాక, మరక ఉన్న చోట లిక్విడ్ డిష్​వాష్​ని వేసి, వేళ్లతో బాగా రుద్దాలి. అలా రుద్దాక దాన్ని 10 నిమిషాలు పక్కనపెట్టేయాలి. అనంతరం నీటితో కడిగితే సరి మంచి ఫలితం ఉంటుందంటున్నారు. లేదంటే నీళ్లతో కడిగిన తర్వాత ఆ బట్టలను నేరుగా ఎండలోనైనా పెట్టొచ్చట. పసుపులోని కర్‌క్యుమిన్‌ రేడియేషన్‌కి గురవుతుంది. దాంతో పసుపు పిగ్మెంటేషన్‌ మాయమవుతుందంటున్నారు నిపుణులు.

గంధం మరకలు తొలగించుకోండిలా!

కొన్నిసార్లు దుస్తులపై అంటుకున్న గంధం మరకలు అంత సింపుల్​గా తొలగిపోవు. అలాంటి టైమ్​లో ఈ లిక్విడ్ డిష్​వాష్ చిట్కా చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముందుగా గంధం మరకలు అంటిన దుస్తులను చల్లటి నీటితో కడిగాక, మరక ఉన్న చోట లిక్విడ్ డిష్​వాష్​ని వేసి, వేళ్లతో బాగా రుద్దాలి. అలా రుద్దాక దాన్ని 10 నిమిషాలు పక్కనపెట్టి ఆపై వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.

ఇలా చేసినా మంచి రిజల్ట్!

దుస్తులపై గంధం మరక అంటిన చోట నిమ్మచెక్కతో రుద్ది చూడండి. లేదంటే కొన్ని నీళ్లకి వెనిగర్‌ చేర్చి, ఆ నీళ్లతో కడిగినా ఫలితం ఉంటుందంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇలా చేసినా మంచి రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు. గంధం, కుంకుమ మరకలు అంటిన దుస్తులను కాసేపు పచ్చిపాలల్లో నానబెట్టి, తరవాత ఉతికితే సరి ఆ మరకలు ఈజీగా పోతాయంటున్నారు నిపుణులు. మరి, మీరు ఓసారి ప్రయత్నించి చూడండి.

'మొబైల్' వర్షంలో తడిసిందా? - నిపుణులు సూచిస్తున్న సింపుల్ టిప్స్ మీ కోసం!

యువత పెళ్లికి భయపడడానికి కారణాలివే! - సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!