ETV Bharat / offbeat

పట్టు వస్త్రాలపై 'మరకలు' పడ్డాయా? - ఈ టిప్స్​తో ఈజీగా పోగొట్టొచ్చు!

-పట్టువస్త్రాలంటే పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టమే! - కానీ అనుకోకుండా పడిన మరకలను ఈ టిప్స్​తో తొలగించి కొత్త వాటిలా మెరిపించవచ్చట!

How to Remove Stains from Pattu Clothes
How to Remove Stains from Pattu Clothes (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : July 9, 2026 at 3:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

How to Remove Stains from Pattu Clothes: పట్టు వస్త్రాలు అంటే ఇష్టం లేనిది ఎవరికి. మరీ ముఖ్యంగా పట్టుచీరలను అమ్మాయిల నుంచి అమ్మల వరకూ ధరించి మురిసిపోతారు. ఇక పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయంలో వీటిని కట్టడం కంపల్సరీ. ఇక కొద్దిమంది అయితే పెద్దవారి జ్ఞాపకాలుగా భావించి భద్రపరుస్తుంటారు కూడా. అయితే అంత ఇష్టంగా ధరించే పట్టువస్త్రాలపై ఏదైనా మరక పడితే అల్లాడిపోతుంటారు. ఆ మరకను వదిలించేవరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని అంతగా ఫలితాన్ని ఇవ్వవు. అలాంటి సమయంలో కంగారు పడకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మరకలు ఈజీగా తొలగిపోతాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

తొందరొద్దు: పట్టు వస్త్రాలపై మరక పడగానే చాలా మంది కంగారులో గట్టిగా రుద్దేస్తుంటారు. అయితే ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా రుద్దడం వల్ల చీర దారాల్లోకి ఆ మరక మరింత లోతుగా వెళ్లిపోతుందంటున్నారు. కాబట్టి మరక అంటుకున్న ప్లేస్​ను టిష్యూ పేపర్‌తో సున్నితంగా అద్ది.. కుంకుడు రసంతో శుభ్రం చేస్తే మరక త్వరగా వదిలిపోతుందని అంటున్నారు.

నూనె పడితే: పట్టు వస్త్రాల మీద నూనె లేదా నెయ్యి వంటి మరకలు పడితే వెంటనే ఆ ప్రదేశంలో కొంచెం టాల్కమ్‌ పౌడర్‌ లేదా కార్న్‌ఫ్లోర్‌ చల్లమంటున్నారు. ఇవి నూనెను పీల్చుకుంటాయని చెబుతున్నారు. పావుగంట తర్వాత మెత్తటి బ్రష్‌తో ఆ పౌడర్‌ని దులిపితే చాలా వరకు మరక పోతుందని వివరిస్తున్నారు. ఒకవేళ ఇలా చేసినాక కూడా మరక ఉంటే, ఒక గిన్నెలో చల్లటి నీరు తీసుకుని, అందులో కొన్ని చుక్కల మైల్డ్‌ లిక్విడ్‌ సోప్‌ కలపాలి. అనంతరం ఒక మెత్తని కాటన్‌ వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి, మరక ఉన్న చోట చాలా మెల్లగా అద్దితే మరక పోతుందని చెబుతున్నారు. అయితే చల్లటి నీటి ప్లేస్​లో వేడి నీటిని అసలు వాడకూడదని చెబుతున్నారు. ఇది పట్టు నాణ్యతను దెబ్బతీస్తుందని వివరిస్తున్నారు.

మొండిమరకలకు: దుస్తులు మీద పడిన మొండిమరకలను తొలగించేందుకు చాలా మంది నిమ్మరసం, వెనిగర్‌ వంటి పదార్థాలు వాడుతుంటారు. అయితే వీటిని యూజ్​ చేయడానికి ముందుగా చీర లోపలి అంచున (ఎవరికీ కనిపించని చోట) ఒక చిన్న ప్యాచ్‌ టెస్ట్‌ చేయమని సలహా ఇస్తున్నారు. ప్యాచ్​ టెస్ట్​ సక్సెస్​ అయితే మరకలు ఉన్న చోట ఈ చిట్కా పాటించమని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు వీటిని వాడటం వల్ల దుస్తులు రంగు మారే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

టీ, కాఫీ మరకలు: ఒక్కోసారి అనుకోకుండా పట్టు చీరలపై టీ లేదా కాఫీ లాంటి మరకలు పడుతుంటాయి. అవి ఏవైనా సరే పడిన వెంటనే చల్లటి నీళ్లతో శుభ్రం చేయాలని నిపుణులు అంటున్నారు. చివరగా పట్టు చీరలు చాలా సున్నితమైనవని, పైన చెప్పిన చిట్కాలు ఇంట్లోనే చేయగలిగేవంటున్నారు. ఒకవేళ మరక చాలా పాతదిగా ఉన్నా లేదా చీర చాలా ఖరీదైనదిగా అనిపించినా, రిస్క్‌ తీసుకోవడం కంటే డ్రై క్లీనింగ్‌ చేయించడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

షూస్ తడిచిపోయాయా? - ఇలా చేస్తే త్వరగా ఆరిపోతాయ్!

మీ ఇంట్లో "వాషింగ్​ మెషీన్"​ ఉందా? -దుస్తులతో పాటు వీటిని ఉతకొచ్చు - కానీ!