సేమియాతో కరకరలాడే "పకోడీలు" - నిమిషాల్లోనే పర్ఫెక్ట్ స్నాక్ రెడీ!
సేమియాతో అద్దిరిపోయే రెసిపీ - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 11:34 AM IST
Sevai Pakoda Prepare in Telugu : పకోడీలను వివిధ రకాలుగా చేస్తుంటారు. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండటంతో అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి సేమియాతో వీటిని ట్రై చేశారంటే రుచి అద్దిరిపోతుంది. పైగా నిమిషాల్లోనే దీనిని తయారు చేయోచ్చు. కొత్తగా చేసే వారు కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేసేయోచ్చు. అంతేకాక ఆయిల్ కూడా తక్కువగా పీల్చుతాయి! ఇవి రెండుమూడు తిని టీ తాగితే ఆ టేస్ట్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ స్నాక్‌గా మారడం ఖాయం. మరి టేస్టీటేస్టీ వేడివేడి సేమియా పకోడీలు ఎలా తయారు చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
రోజూ అవే దోసెలు, ఇడ్లీలు ఏం తింటారు? - కాస్త వెరైటీగా "ఇడియప్పం" ట్రై చేయండి!

కావాల్సిన పదార్థాలు :
- సేమియా - ఒక కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- మైదాపిండి - 2 టేబుల్ స్పూన్లు
- శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
- కారం - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - కొద్దిగా
- ఉల్లిపాయలు - 2
- కొత్తిమీర - కొంచెం
- జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- పసుపు - అర టీ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కప్పు సేమియా, సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. సేమియా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచాలి.
- అలాగే రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.

- ఇంకోవైపు మిక్సింగ్ బౌల్లో ఉడికించిన సేమియా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేయాలి.
- ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలి. అలాగే ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బాగా మిక్స్ చేయాలి.

- మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పకోడీలా మాదిరిగా కడాయికి సరిపడా వేయాలి.
- ఆ తర్వాత పకోడీలను రెండు వైపులా టర్న్ చేస్తూ దోరగా ఫ్రై చేసి ప్లేట్లో వేయాలి.

- పకోడీలు ఎంత వేగితే అంత క్రిస్పీగా ఉంటాయి. అంతే సేమియాతో కరకరలాడే పకోడీలు తయారైనట్లే!
- ఈ పకోడీలను టమోటా, పుదీనా చట్నీ లేదా టమోటా సాస్ కలిపి తిన్నారంటే సూపర్‌గా ఉంటుంది.
అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!
జొన్నపిండితో "ఇడ్లీలు" - సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయి - ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు!

