పచ్చి మిర్చితో "ఉసిరికాయ నువ్వుల పచ్చడి" - చూస్తేనే నోరూరిపోద్ది! - మూడు నెలలు నిల్వ!
- ఉసిరితో ఎన్నడూ ట్రై చేయని సరికొత్త పచ్చడి - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే!

Published : October 21, 2025 at 2:05 PM IST
Usirikaya Nuvvula Pachadi : కార్తికమాసం వస్తుందంటే చాలు ఉసిరికాయల సీజన్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ ఉసిరి వంటకాలకి రెడ్‌కార్పెట్ పరిచేస్తారు. ఇవి తినడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది రోటి పచ్చడి, ఉసిరి ఊరగాయ, ఆమ్లా రైతా, మురబ్బా అంటూ రకరకాల రెసిపీలను ప్రిపేర్ చేయడానికి సిద్ధమవుతుంటారు. అలాంటి వారికోసమే ఒక అద్దిరిపోయే రెసిపీని తీసుకొచ్చాం. అదే, నోరూరించే "ఉసిరికాయ నువ్వుల పచ్చడి".
పచ్చిమిర్చి కాంబోలో రెడీ అయ్యే ఈ పచ్చడి ఎన్నడూ తినని రుచిలో భలే అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అద్దిరిపోయే టేస్ట్‌నిస్తుంది. ఉసిరికాయ తినని పిల్లలు కూడా ఇలా పచ్చడి పెట్టారంటే లొట్టలేసుకుంటూ తింటారు. అలాగే, దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది! పైగా ఈ పచ్చడి తయారీకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. చాలా తక్కువ టైమ్‌లో ఎవరైనా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, ఈ సింపుల్ అండ్ హెల్దీ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- ఉసిరికాయలు - అరకిలో
- పచ్చిమిర్చి - 150 గ్రాములు
- నువ్వులు - 50 గ్రాములు
- జీలకర్ర - ఒక చెంచా
- ఆవాలు - ఒక చెంచా
- ఉప్పు - 100 గ్రాములు(రుచికి తగినంత)
- పసుపు - తగినంత
- మెంతులు - పావుచెంచా
- వెల్లుల్లిపాయ- ఒకటి
- ఇంగువ- పావుచెంచా
- నూనె- 200 గ్రాములు
ఎన్నడూ తినని రుచిలో "చిక్కుడుకాయ పచ్చడి" - పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది!

తయారీ విధానం :
- సూపర్ టేస్టీగా నోరూరించే ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా చేసి పొడి క్లాత్‌లో ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద చిన్న కడాయిలో జీలకర్ర, మెంతులు, ఆవాలు, తెల్ల నువ్వులను వేసి దోరగా వేయించాలి.
- అవి పొడి పొడిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.
- తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బల్ని విడి విడిగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి.
జొన్నరొట్టె చేయడం రానివారు - ఈ "కాయగూరల రొట్టెలు" చేసుకోండి!

- ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక నీట్‌గా తుడిచి పక్కన పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసి లో-ఫ్లేమ్ మీద ఎక్కడా పచ్చిలేకుండా చక్కగా మగ్గించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే నూనెలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలి.
- అవన్నీ వేసుకుని మగిస్తున్నప్పుడు గరిటెతో కలుపుతూ ఉంటే కాసేపటికి నూనె వేరవుతూ ఉంటుంది.

- అప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా జత చేసి మరో పదినిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- పచ్చడి మిశ్రమం మంచిగా మగ్గిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని దింపి చల్లారనివ్వాలి. తర్వాత జాడీ లేదా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, పచ్చికారంతో ఎంతో రుచికరంగా ఉండే "ఉసిరికాయ నువ్వుల పచ్చడి" రెడీ అవుతుంది!
- ఈ పచ్చడిని ఇలాగే బయట ఉంచితే నెలరోజులు నిల్వ ఉంటుంది. అదే, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినట్లయితే మూడునెలల వరకూ తాజాగా ఉంటుంది!

పండిన కాకరకాయలను పడేస్తున్నారా? - ఇలా "పచ్చడి" చేసుకుంటే సూపర్ టేస్ట్!

