ETV Bharat / offbeat

నువ్వులతో నోరూరించే "వంకాయ కూర" - ఇంటిల్లిపాదీ ఆహా ఏమి రుచి అంటారు!

వంకాయతో సూపర్ టేస్టీ "కర్రీ" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Vankaya Nuvvula Kura Recipe
Vankaya Nuvvula Kura Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 12:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vankaya Nuvvula Kura Recipe : రోజూ ఒకే రకమైన కూరలు తినాలంటే ఎవరికైనా బోరింగ్​గానే అనిపిస్తుంది. అందుకే, మీకోసం కూరగాయల్లో రాజుగా పిలుచుకునే వంకాయతో ఇప్పటివరకు ట్రై చేయని ఒక సూపర్ టేస్టీ రెసిపీని తీసుకొచ్చాం. అదే, నువ్వులతో నోరూరించే "వంకాయ కర్రీ". ఇది రెగ్యులర్​గా చేసుకునే వంకాయ కర్రీలతో పోల్చితే డిఫరెంట్​ టేస్ట్​తో భలే కమ్మగా ఉంటుంది. వంకాయ అంటే ఇష్టపడే వారూ దీన్ని మరింత ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినేస్తారు. పిల్లలకూ చాలా చాలా బాగా నచ్చుతుంది. పైగా, దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. బిగినర్స్ కూడా చాలా సింపుల్​గా ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఈ నోరూరించే వంకాయ నువ్వుల కూరను ఎలా రెడీ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - కేజీ
  • నువ్వులు - అర కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • ఎండుమిర్చి - 20
  • నూనె - అర కప్పు
  • ఆవాలు - ఒక చెంచా
  • జీలకర్ర - రెండు టీస్పూన్లు
  • కరివేపాకు - కొద్దిగా
  • పసుపు - ఒక టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
  • చింతపండు రసం - అర కప్పు
  • కారం - రుచికి తగినంత
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

నోరూరించే "చంద్రముఖి చికెన్ ఫ్రై" - తిన్నారంటే లక లక లక అనాల్సిందే!

తయారీ విధానం :

  • నయా స్టైల్​లో నోరూరించే ఈ వంకాయ కర్రీ కోసం ముందుగా తాజా పొడవాటి వంకాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి.
  • ఆపై ఒక్కో వంకాయను అంగుళం సైజ్​లో నిలువుగా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన ఉంచుకోవాలి.
  • నెక్ట్స్ స్టవ్ మీద కడాయిలో తెల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని ఎండుమిరపకాయలను వేసి లో ఫ్లేమ్​లో నువ్వులు చిటపటమనే వరకు కలుపుతూ బాగా వేయించాలి.
  • నువ్వుల మిశ్రమం మంచిగా వేగాక మిక్సీ జార్​లోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
  • అనంతరం కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్​లో అర కప్పు నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్​లో ఒకట్రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి.
  • ఆ తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాలపొడి వేసుకుని అవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
  • ఆపై స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లోనే ఉంచి వంకాయ ముక్కలు సాఫ్ట్​గా అయ్యేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
  • వంకాయ ముక్కలు సగం పైగా మగ్గాయనుకున్నాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు-ఎండుమిర్చి పేస్ట్​ను జత చేసి ఒకసారి అంతా కలిసేలా బాగా కలపాలి.
  • అనంతరం అర కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకుని మరోసారి కలిపి మూతపెట్టి సన్నని సెగ మీద నూనె సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక అర కప్పు పల్చని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అలాగే, రుచికి తగినంత కారం కూడా వేసుకుని కలిపి మూతపెట్టి సన్నని మంటపై ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకున్నాక చివర్లో కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని లైట్​గా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
  • అంతే, చూస్తుంటేనే నోరూరిపోయే కమ్మని "వంకాయ నువ్వుల కూర" సింపుల్​గా తయారవుతుంది!
  • మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ కూరలకు బదులుగా ఓసారి ఇలా వంకాయ కర్రీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ వావ్ టేస్ట్ అద్భుతమంటూ తృప్తిగా తినేస్తారు.

బండి మీద అమ్మే రుచితో కరకరలాడే "పకోడీ" - పిండి కలపడంలోనే అసలు సీక్రెట్!

పల్లీలు, టమాటాలతో కిర్రాక్​ "చట్నీ" - 10 నిమిషాల్లో రెడీ - అన్ని టిఫెన్స్​లోకి అదుర్స్​!