ETV Bharat / offbeat

ఉల్లి, వెల్లుల్లి లేకుండానే "టమాటా చారు" - టేస్ట్ అదుర్స్! - కార్తికం వేళ సూపర్ ఆప్షన్!

కార్తికం స్పెషల్ ఘుమఘుమలాడే 'టమాటా రసం' - అప్పటికప్పుడు నిమిషాల్లోనే రెడీ!

Tomato Charu Recipe without Onion
Tomato Rasam Recipe without Onion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 31, 2025 at 1:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tomato Charu Recipe without Onion : ప్రస్తుతం పూజలు, వ్రతాలకు అత్యంత పవిత్రమైన కార్తిక మాసం నడుస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది చేసే పూజలతో పాటు ఆహారపు అలవాట్ల విషయంలోనూ కొన్ని ప్రత్యేకమైన నియమ నిష్ఠలను పాటిస్తుంటారు. అందులో భాగంగానే కార్తిక మాసంలో ఎక్కువ మంది ఉల్లి, వెల్లుల్లిని ఆహారంలోకి రానివ్వరు. అలాంటి వారికోసమే అవి వేయకుండానే మంచి రుచికరంగా చేసుకునే ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, నోరూరించే కమ్మని "టమాటా చారు". నార్మల్​గా ఇది అందరూ చేసుకునేదైనప్పటికీ ఉల్లి, వెల్లుల్లి వేయకుండా చేస్తే మంచి టేస్ట్ రాదనుకుంటారు చాలా మంది. కానీ, ఈ స్టైల్​లో చేశారంటే అవి లేకున్నా కూడా వేడివేడి అద్దిరిపోయే రుచినిస్తుంది. పైగా దీన్ని చాలా తక్కువ టైమ్​లో ఇన్​స్టంట్​గా రెడీ చేసుకోవచ్చు. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ రసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Tomato Rasam
టమాటాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • చింతపండు - రెండు చిన్న నిమ్మకాయలంత
  • టమాటాలు - ఆరు(మీడియం సైజ్​వి)
  • అల్లం - అంగుళం ముక్క
  • నూనె - రెండు టేబుల్​స్పూన్లు
  • మెంతులు - రెండు చిటికెళ్లు
  • మినప్పప్పు - ఒక టీస్పూన్
  • శనగపప్పు - ఒక టీస్పూన్
  • ఆవాలు - ఒక టీస్పూన్
  • జీలకర్ర - ఒక టీస్పూన్
  • ఇంగువ - అరటీస్పూన్
  • పచ్చిమిర్చి - నాలుగైదు
  • ఎండుమిర్చి - రెండు
  • పసుపు - అరటీస్పూన్
  • కారం - రెండు టీస్పూన్లు(తగినంత)
  • ఉప్పు - రుచికి తగినంత
  • ధనియాలపొడి - రెండు టీస్పూన్లు
  • సాంబార్ పౌడర్ - రెండు టీస్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

కార్తికం స్పెషల్: జిగురు లేకుండా కమ్మని "బెండకాయ ఫ్రై" - ఉల్లి, వెల్లుల్లి అవసరం లేదు!

Tomato Rasam
చింతపండు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ రసం రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడగాలి.
  • ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
  • చింతపండు నానేలోపు టమాటాలను శుభ్రంగా కడిగి పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అల్లం వేసుకుని మెత్తని గుజ్జులా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
  • అలాగే, నానబెట్టుకున్న చింతపండు నుంచి ఒకటిన్నర కప్పుల పరిమాణంలో రసం తీసుకుని రెడీగా ఉంచుకోవాలి.

అమ్మమ్మల పద్ధతిలో "వెల్లుల్లి రసం" - చల్లని వేళ వేడివేడి అన్నంలో అద్భుతమే!

Tomato Rasam
పోపుదినుసులు (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద చారు తయారీకి పాన్ పెట్టి నూనె వేసి హీట్ చేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యాక మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అన్నింటినీ దోరగా వేయించుకోవాలి.
  • అవి వేగాక అందులో ఇంగువ, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకుని తాలింపును మంచిగా ఫ్రై చేయాలి.
  • తర్వాత పసుపు వేసి కలిపి ఆపై ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును జత చేసి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • మిశ్రమం మొత్తం కలిసేలా కలిపాక అందులో రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాలపొడి, సాంబార్ పౌడర్ వేసుకుని అవన్నీ మంచిగా కలిసేలా మరోసారి బాగా కలుపుకోవాలి.
Tomato Rasam
ధనియాలు (Getty Images)
  • తర్వాత ఆ మిశ్రమంలో ముందుగా తీసి పెట్టుకున్న టమాటా రసం, చారుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపి మరిగించుకోవాలి.
  • ఆ మిశ్రమాన్ని మూడ్నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించుకున్నాక చివర్లో కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
  • అంతే, ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఘుమఘుమలాడే "టమాటా చారు" రెడీ అవుతుంది!
  • మరి, మీరు కార్తికంలో ఉల్లి, వెల్లుల్లి తినకుంటే ఓసారి ఇలా టమాటా చారు చేసుకోండి. వేడివేడి అన్నంలోకి కిర్రాక్​గా ఉంటుంది. ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది.
Tomato Rasam
కొత్తిమీర (Getty Images)

చింతపండు లేకుండానే కమ్మని "ఉసిరికాయ రసం" - అన్నం కడుపునిండా తినేస్తారు!