ETV Bharat / offbeat

యమ్మీ యమ్మీగా టేస్టీ "మసాలా బ్రెడ్ టోస్ట్" - బ్రేక్​ఫాస్ట్, స్నాక్​గా సూపర్ ఛాయిస్!

- బ్రెడ్​తో అప్పటికప్పుడు చేసుకునే కిర్రాక్ రెసిపీ - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Masala Bread Toast Recipe
Masala Bread Toast Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 25, 2025 at 4:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Masala Bread Toast Recipe : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి మార్నింగ్ టిఫెన్స్ రెడీ చేసుకోవడానికి తగినంత సమయం ఉండదు. దాంతో ఎక్కువ మంది బ్రెడ్​తో చేసుకునే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అంటే, త్వరగా అయిపోతాయని బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఉప్మా వంటివి చేసుకుంటుంటారు. అవి మాత్రమే కాకుండా బ్రెడ్​ స్లైసులతో అప్పటికప్పుడు చేసుకునే మరో సూపర్ రెసిపీ ఉంది. అదే, యమ్మీ యమ్మీ "మసాలా బ్రెడ్ టోస్ట్".

ఇది ఆలూ స్టఫింగ్​తో సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని బ్రేక్​ఫాస్ట్​లోకి మాత్రమే కాకుండా ఈవెనింగ్ స్నాక్​గానూ రెడీ చేసుకోవచ్చు​. పిల్లలైతే ఈ బ్రెడ్ టోస్ట్​ను యమ్మీ యమ్మీగా లొట్టలేసుకుంటూ తింటారు. అలాగే, ఇడ్లీ, దోశ, బోండా, వడ, పూరీ మాదిరిగా ఈ రెసిపీకి ఎక్కువ టైమ్ పట్టదు. మరి, ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Masala Bread Toast Recipe
బ్రెడ్ స్లైసులు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఆరు - బ్రెడ్​ స్లైసులు
  • మూడు - బంగాళదుంపలు
  • అరకప్పు - సన్నని ఉల్లిపాయ ముక్కలు
  • రెండు టేబుల్ ​స్పూన్లు - సన్నని క్యాప్సికం తరుగు
  • రెండు టేబుల్​ స్పూన్లు - క్యారెట్ తురుము
  • ఒక చెంచా - పచ్చిమిర్చి తరుగు
  • పావు చెంచా - పసుపు
  • ఒక చెంచా - ఎండుమిర్చి గింజలు
  • అర చెంచా - అల్లం పేస్ట్
  • రుచికి తగినంత - ఉప్పు
  • ఒక చెంచా - ధనియాలపొడి
  • అరచెంచా - మిరియాలపొడి
  • రెండు టేబుల్​ స్పూన్లు - సన్నని కొత్తిమీర తరుగు
  • పావు కప్పు - బటర్(వెన్న)
  • పావు కప్పు - పాలు

గోధుమపిండితో సూపర్ టేస్టీ "ఎగ్ దోశ" - తక్కువ పదార్థాలతోనే అప్పటికప్పుడు రెడీ!

Masala Bread Toast Recipe
బంగాళదుంపలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం ముందుగా ఆలూ మసాలా స్టఫింగ్​ను సిద్ధం చేసుకోవాలి.
  • ఇందుకోసం మొదటగా స్టవ్ మీద ఒక గిన్నెలో బంగాళదుంపలను తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
  • అవి ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, క్యాప్సికం తరుగు, క్యారెట్ తురుమును రెడీ చేసుకుని పక్కనుంచాలి. అలాగే, కొత్తిమీరను సన్నగా తురిమి పెట్టుకోవాలి.
  • బంగాళదుంపలు మంచిగా ఉడికాక పొట్టు తొలగించి మెత్తగా మాష్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి.
Masala Bread Toast Recipe
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • తర్వాత అందులో వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, సన్నని పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తురుము, పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఎండుమిర్చి గింజలు వేసుకోవాలి.
  • అలాగే, అల్లం పేస్ట్, మిరియాలపొడి, ధనియాలపొడి, సన్నని కొత్తిమీర తరుగు ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్నాక మిశ్రమం మొత్తం కలిసేలా అన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ కలిపితే స్టఫింగ్ రెడీ అవుతుంది!

బ్రేక్​ఫాస్ట్​లోకి "మరమరాల చీలాలు" - పిల్లలైతే వద్దనకుండా తినేస్తారు!

Masala Bread Toast Recipe
మిరియాలు (Getty Images)
  • ఇప్పుడు ఒక బ్రెడ్‌స్లైసును తీసుకుని దానిపైన కాసిని పాలు రాసి ముందుగా రెడీ చేసుకున్న ఆలూ మసాలాను జామ్ తరహాలో స్లైసు మొత్తం చక్కగా పరవాలి.
  • ఆపై దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్​లో మిగిలిన స్లైసుల్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద దోశ పెనం పెట్టి కొద్దిగా బటర్ వేసుకోవాలి.
  • అది కరిగి కాస్త వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసును మసాలా పరిచిన వైపు పాన్​పై కాలే సైడ్ ఉంచి రెండో వైపు ఇంకొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి.
Masala Bread Toast Recipe
పాలు (Getty Images)
  • అది వన్ సైడ్(మసాలా సైడ్) మంచిగా కాలిన తర్వాత రెండో వైపునకు టర్న్ చేసి అటు వైపు కూడా చక్కగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇదేవిధంగా మిగిలిన బ్రెడ్​స్లైసులను దోశ తరహాలో రెండు వైపులా చక్కగా కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
  • అంతే, ఆలూ స్టఫింగ్​తో సూపర్ టేస్టీగా ఉండే "మసాలా బ్రెడ్ టోస్ట్" రెడీ అవుతుంది!
  • మరి, నచ్చితే మీరు రెగ్యులర్ బ్రేక్​ఫాస్ట్/స్నాక్ రెసిపీలకు బదులుగా ఓసారి దీన్ని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

అటుకులతో "పునుగులు" - పైన క్రిస్పీ, లోపల సాఫ్ట్​ - టమాటా చట్నీతో కిర్రాక్​!