ETV Bharat / offbeat

బీరకాయతో కరకరలాడే "బజ్జీలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

సాయంత్రానికి అద్దిరిపోయే స్నాక్ రెసిపీ - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Beerakaya Bajji
Beerakaya Bajji (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 28, 2025 at 11:26 AM IST

2 Min Read
Choose ETV Bharat

Beerakaya Bajji Recipe in Telugu : ఈవెనింగ్ టైమ్​లో అందరికీ వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎప్పుడూ చేసుకునే మిర్చీ బజ్జీలు, పకోడీ, పునుగులు, గారెలు కాకుండా ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అలాంటి వారికోసమే ఇవాళ ఓ స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాం. అదే నోరూరించే బీరకాయ బజ్జీలు. ఈ స్టెప్స్ పాటిస్తూ చేశారంటే క్రిస్పీగా, మంచి రుచికరంగా వస్తాయి. కొత్తగా చేసే వారు కూడా ఈ పద్ధతిలో చేస్తే తిన్నవారు వన్స్​మోర్ అంటారంతే.

అంతేకాక బీరకాయ తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు. రోజూ ఒకే రకమైన స్నాక్స్ తిని బోర్ కొట్టినవారికి ఇవి బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కూల్ వెదర్​లో హాట్​ హాట్​గా వీటిని తింటుంటే ఆ టేస్ట్ సూపర్​గా ఉంటుంది. అలాగే ఈ బజ్జీలు ఆయిల్​ను కూడా అంతగా పీల్చవు! చాలా తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి బీరకాయతో నోరూరించే ఈ బజ్జీలను ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలపై ఇప్పుడు ఓ లుక్కేయండి

ఘుమఘుమలాడే "రెడ్ చిల్లీ చికెన్ కర్రీ" - ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్​తో సరికొత్త రుచి!

Beerakaya Bajji
బీరకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బీరకాయలు - 3
  • శనగపిండి - 3 కప్పులు
  • బియ్యప్పిండి - పావు కప్పు
  • జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - అర టేబుల్ స్పూన్
  • వంటసోడా - పావు టీ స్పూన్
  • ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా
Beerakaya Bajji
కారం (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా మూడు బీరకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇంకోవైపు మిక్సింగ్ బౌల్లో మూడు కప్పుల శనగపిండి, పావు కప్పు బియ్యప్పిండి వేయాలి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్​ చేస్తూ పిండిని బాగా మిక్స్ చేయాలి.
Beerakaya Bajji
బియ్యప్పిండి (Getty Images)
  • మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయికి సరిపడా నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను తయారైన పిండిలో ఒక్కొక్కటిగా ముంచి కడాయిలో వేయాలి.
  • ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెండు వైపులా బజ్జీలను టర్న్ చేస్తూ దోరగా ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్​లో తీసి సర్వ్ చేసుకోవాలి.
Beerakaya Bajji
శనగపిండి (Getty Images)
  • అంతే కరకరలాడే బీరకాయ బజ్జీలు మీ ముందుంటాయి!
  • వేడివేడి ఈ బజ్జీలను ఏ చట్నీ లేకుండానే సింపుల్​గా తినేయోచ్చు. లేదంటే టమోటా, పుదీనా చట్నీలో కలిపి తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది.
Beerakaya Bajji
ఉప్పు (Getty Images)
  • ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేశారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ స్నాక్ అవుతుంది.
  • మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ట్రై చేయండి.

నిమిషాల్లోనే రెడీ చేసుకునే "మినపప్పు అన్నం" - టేస్ట్ అమోఘం!

నోటికి కొత్త రుచినిచ్చే రాజస్థానీ "మిర్చీ బజ్జీలు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!