ETV Bharat / offbeat

రాయలసీమ స్పెషల్ "వెల్లుల్లి కారం పచ్చడి" - అన్నం, టిఫిన్స్​లోకి పర్ఫెక్ట్!

వెల్లుల్లితో సింపుల్​గా చేసుకునే పచ్చడి - ఎన్నడూ తినని టేస్ట్​ని ఎంజాయ్ చేస్తారు!

Vellulli Karam Pachadi
Vellulli Karam Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 2:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Red Chilli Garlic Chutney Making : కొందరు భోజనంలోకి కర్రీస్ ఎన్ని ఉన్నా పచ్చళ్లనే ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు. అందుకే ఇండ్లలో వివిధ రకాల పచ్చడి రెసిపీలు చేస్తుంటారు. ఇవి ఎంత ఇష్టమైనప్పటికీ ఎప్పుడూ ఒకేలా తినాలంటే ఎవరికైనా నచ్చదు. అందుకే ఈసారి కాస్త వెరైటీగా రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం పచ్చడి చేసి చూడండి. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేశారంటే ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. ఇది రైస్​లోకి మాత్రమే కాకుండా టిఫిన్స్​లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్​. అంతెేకాక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది! మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వెల్లుల్లి కారం పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.

'వావ్' అనిపించే "ఉలవల కారం పొడి" - ఇడ్లీ, దోసెలతో పాటు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

Vellulli Karam Pachadi
వెల్లుల్లి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లిపాయ - 1
  • ఆయిల్ - 6 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రాములు
  • ఎండుమిర్చి - 17
  • ఆవాలు - 1 టీ స్పూన్
  • మినపప్పు - 1 టీ స్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • దొడ్డు ఉప్పు - కొంచెం
  • చింతపండు - కొద్దిగా
Vellulli Karam Pachadi
కరివేపాకు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
  • ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చాక వంద గ్రాములు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి దోరగా వేయించాలి. వెల్లుల్లి వేగిన తర్వాత 15 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసి ఫ్రై చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీజార్​వేయాలి. ఇందులో కొద్దిగా దొడ్డు ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి.
Vellulli Karam Pachadi
ఎండుమిర్చి (Getty Images)
  • ఇదే కడాయిలో తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసి వేగనివ్వాలి.
  • ఇందులోనే రెండు ఎండుమిర్చి, ఆరు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేయాలి.
Vellulli Karam Pachadi
చింతపండు (Getty Images)
  • ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఆయిల్ పైకి తేలేంతవరకు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే టేస్టీ, స్పైసీ వెల్లుల్లి కారం పచ్చడి రెడీ అయినట్లే!
Vellulli Karam Pachadi
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • అనంతరం ఈ పచ్చడిని గ్లాస్​ జార్​లో వేసి ఫ్రిడ్జ్​లో పెడితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది!
  • వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసి తిన్నారంటే ఆహా అనాల్సిందే. అంతేకాక టిఫిన్స్​లోకి ఇది సూపర్ కాంబినేషన్​!

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "అరిసెలు" - ఈ సంక్రాంతికి ఇంట్లోనే తియ్యని వేడుక చేసుకోండి! !

అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!