ETV Bharat / offbeat

మార్కెట్లో వద్దు, స్వచ్ఛమైన "రాగి పిండి" ఇంట్లోనే - ఈ స్టెప్స్​ తో ఈజీగా!

- నిమిషాల్లోనే రాగి పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు - మూడు నెలల వరకు నిల్వ కూడా!

How to Make Ragi Flour
How to Make Ragi Flour (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : October 18, 2025 at 11:31 AM IST

2 Min Read
Choose ETV Bharat

How to Make Ragi Flour: నేటి రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే చాలా మంది జొన్నలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రాగులు, రాగి పిండితో సంగటి, జావ, ఇడ్లీలు, దోశలు, పాయసం ఇలా ఎన్నో రకాల హెల్దీ రెసిపీలు ట్రై చేస్తున్నారు. అయితే రాగి పిండి కావాలంటే మార్కెట్​కు వెళ్లడం, కావాల్సినంత తెచ్చుకోవడం పరిపాటి. ఈ క్రమంలోనే చాలా మంది దుకాణాదారులు రాగి పిండిలో చాలా మొత్తంలో మైదా లేదా గోధుమపిండిని కలుపుతుంటారు. దీంతో స్వచ్ఛమైన పిండి దొరకని పరిస్థితి నెలకొంది. అందుకే ఇంట్లోనే స్వచ్ఛంగా రాగి పిండి తయారు చేసుకోండి. మరి అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

Ragi Flour
రాగులు (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • రాగులు - 1 కేజీ
  • బార్లీ గింజలు - అర కేజీ
Barley
బార్లీ (Getty Images)

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి రాగులు తీసుకుని వాటర్​తో వీలైనన్ని సార్లు శుభ్రంగా వాష్​ చేయాలి. అంటే వాటర్​లో ఉన్నా సరే రాగులు కనపడేలా క్లీన్​ చేయాలి. ఇలా కావాలంటే సుమారు ఏడెనిమిది సార్లు నీటితో కడగాలి.
  • రాగులను శుభ్రంగా వాష్​ చేసిన తర్వాత సరిపడా వాటర్​ పోసి మూత పెట్టి సుమారు 8 గంటలు లేదా వీలైతే రాత్రంతా నానబెట్టాలి.
  • రాగులు నానిన తర్వాత ఆ నీటిని వంపేసి మరోసారి ఫ్రెష్​ వాటర్​ పోసి కడగాలి. ఇప్పుడు ఓ కాటన్​ క్లాత్​ను​ నీళ్లలో ముంచి గట్టిగా పిండాలి.
  • అనంతరం ఆ క్లాత్​ను జల్లి గిన్నెలో పరిచి నానబెట్టిన రాగులను క్లాత్​లోకి పోసుకుని క్లోజ్​ చేసి గట్టిగా పిండాలి.
  • ఆ తర్వాత రాగులతో సహా ఈ జల్లి గిన్నెను ఓ ఐదారు గంటల పాటు పక్కన పెట్టాలి.
  • అనంతరం ఆ మూటను ఓపెన్​ చేస్తే రాగులు మొలకలు రావడానికి సిద్ధంగా ఉంటాయి. అప్పుడు వాటిని క్లాత్​తో సహా బయటికి తీసి రెండు రోజుల పాటు ఫ్యాన్​ గాలికి ఆరబెట్టుకోవాలి.
Ragi Flour
రాగులు (Getty Images)
  • రాగుల్లో తడి అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత వేయించుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి రాగులు వేసి లో-ఫ్లేమ్​లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి.
  • రాగులు వేగిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే పాన్​లోకి బార్లీ గింజలు వేసి దోరగా వేయించి స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టాలి.
  • రాగులు, బార్లీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్​లోకి వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఈ పొడిని పిండి జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఇలానే రాగులు అన్నింటినీ గ్రైండ్​ చేసి జల్లించి తీసుకోవాలి.
  • ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఎయిర్​టైట్​ కంటైనర్​లోకి వేసుకుని స్టోర్​ చేసుకుంటే ఎంతో హెల్దీ ఇంకా స్వచ్ఛమైన రాగి పిండి రెడీ. ఇక ఈ పిండితో మీకు నచ్చిన రెసిపీలు చేసుకోవచ్చు.
Barley
బార్లీ (Getty Images)

చిట్కాలు:

  • రాగులను శుభ్రంగా కడగడం వల్ల అందులోని దుమ్ము, ధూళి పోయి పిండి పర్ఫెక్ట్​గా వస్తుంది.
  • రాగులను మొలకలు వచ్చే స్టేజ్​లోనే ఆరబెట్టకుండా, పూర్తిగా మొలకలు వచ్చిన తర్వాత అయినా ఆరబెట్టి పొడిలా చేసుకోవచ్చు. అయితే వీటిని ఎండలో ఆరబెట్టొద్దు.

నోరూరించే జ్యూసీ జ్యూసీ "బాదుషాలు" - డీప్ ఫ్రై లేకుండా 'పొంగనాల పాన్'​లో ఈజీగా చేసుకోండిలా!

"నాటుకోడి కూర" వండే అసలైన పద్ధతి ఇదే! - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చేస్తుంది!