చుక్క నూనె లేకుండా "దోశలు" - హెల్దీగా, టేస్టీగా!
- ఆరోగ్యకరమైన పద్ధతిలో ప్రిపేర్ చేయండి - అద్భుతమైన రుచినీ ఆస్వాదించొచ్చు

Published : October 29, 2025 at 5:16 PM IST
Dosa Without Oil : తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ జనం ఇష్టపడే రెసిపీల్లో దోశ ముందు వరసలో ఉంటుంది. పొద్దు పొద్దున్నే వేడి వేడిగా దోశలు వేసుకొని.. నచ్చిన పల్లీ, టమాటా, కొబ్బరి చట్నీ వేసుకొని మనసారా ఆస్వాదిస్తుంటే ఆ లెక్కే వేరు. అప్పుడే అనిపిస్తుంది ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అని!
అయితే, దోశ ఎంత రుచికరమైన రెసిపీ అయినప్పటికీ అందులో కూడా ఆయిల్ కాస్త కుమ్మరించాల్సి ఉంటుంది. హెల్దీగా ఉన్నవారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. అప్పటికే ఇబ్బంది పడేవారికి ఆయిల్ అంత మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. ఇలాంటి వారు ఎంతో ఇష్టమైన దోశ తినలేక నోరు కట్టేసుకుంటారు. అందుకే మీకోసం ఓ రెసిపీ ఉంది. చుక్క ఆయిల్ లేకుండానే ఈ దోశ తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కప్పు బియ్యం
- కప్పు అటుకులు
- కప్పు మరమరాలు
- 1/2 కప్పు ఇడ్లీ రవ్వ
- 2 టేబుల్ స్పూన్ల మినపప్పు
- స్పూన్ మెంతులు
- స్పూన్ మిరియాల పొడి
- 1/4 కప్పు కొత్తిమీర తరుగు
- 1 స్పూన్ అల్లం పచ్చిమిర్చి ముద్ద
- తగినంత ఉప్పు
గోధుమపిండితో సూపర్ టేస్టీ "ఎగ్ దోశ" - తక్కువ పదార్థాలతోనే అప్పటికప్పుడు రెడీ!
తయారీ విధానం :
- ముందుగా పొద్దున్నే బియ్యం, మినప్పప్పు ఒక బౌల్లో వేసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అవి మునిగే వరకు మంచి నీళ్లు పోసుకొని నానబెట్టాలి.
- రాత్రివేళ ఆ నీళ్లు వంపేసి, మెంతులు, కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి
- చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఇడ్లీరవ్వ వేసుకోవాలి. మొత్తం కలుపుకొని రాత్రంతా నాన బెట్టాలి.
- తెల్లవారిన తర్వాత ఐదారు పచ్చిమిర్చీ, రెండు ఇంచుల అల్లం రోట్లో వేసుకొని నూరుకోవాలి.
- ఈ మిర్చీ ముద్ద, మరమరాలు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి నానబెట్టిన పిండిలో వేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి.
- ఈ పిండిని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత స్టౌ మీద పెనం పెట్టి దోశలు వేసుకోవడమే!
- పెనం మీద దోశ వేసిన తర్వాత అది మొత్తం కవరయ్యేలా మూత పెట్టుకోవాలి. ఒక వైపు గోల్డెన్ కలర్లో కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని అదేవిధంగా కాల్చుకోవాలి.
- అయితే ఈ దోశలు రెగ్యులర్ దోశల మాదిరిగా మరీ పల్చగా కాకుండా, కాస్త మందంగానే వేసుకోవాలి.
- ఇందులోకి నచ్చిన పల్లీ చట్నీ లేదా మరే ఇతర చట్నీ వేసుకున్నా సరే అద్దిరిపోతుంది. ఇలా హెల్దీగా, టేస్టీగా దోశలు వేసుకొని ఆరగించొచ్చు. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా లాగిస్తారు.
కమ్మని "పుదీనా కొబ్బరి చట్నీ" - అన్ని టిఫెన్స్లోకి పర్ఫెక్ట్ - ఈజీగా చేసుకోవచ్చు!
కరకరలాడే "బ్రెడ్ వడలు" - ఇన్స్టంట్గా చేసుకోవచ్చు - టేస్ట్ కిర్రాక్ అంతే!

