ETV Bharat / offbeat

కమ్మని "మెంతికూర పెసరపప్పు" - నోటికి కొత్త రుచినిస్తుంది!

మెంతికూర, పెసరపప్పు కాంబోలో రెసిపీ - ఇలా చేస్తే అద్భుతంగా వస్తుంది!

Menthi Kura Pesara Pappu
Menthi Kura Pesara Pappu (ETV Abhiruchi)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 27, 2026 at 3:53 PM IST

2 Min Read
Choose ETV Bharat

Menthi Kura Pesara Pappu : ఆకుకూరలతో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అందుకే మీకోసం ఇవాళ మెంతికూరతో కమ్మగా ప్రిపేర్ చేసుకునే ఒక అద్భుతమైన రెసిపీని తీసుకొచ్చాం. అదే మెంతికూర పెసరపప్పు కర్రీ. ఈ పద్ధతిలో చేశారంటే చేదు లేకుండా భలే టేస్టీగా ఉంటుంది. పైగా దీని తయారీ కోసం ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. చాలా తక్కువ టైమ్​లో సులభంగా తయారు చేసుకోవచ్చు.లా చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాక మళ్లీమళ్లీ చేసి పెట్టమని అడుగుతారు. మరి ఈ రుచికరమైన పప్పు కర్రీని ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

వీకెండ్ స్పెషల్ "చింతచిగురు మటన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ రుచికి ఫిదా!

Menthi Kura Pesara Pappu
పెసరపప్పు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పెసరపప్పు - 2 కప్పులు
  • మెంతికూర - 2 కప్పులు
  • ఆయిల్ - 6 స్పూన్లు
  • ఉల్లిపాయ తరుగు - 2 కప్పులు
  • జీలకర్ర - 2 స్పూన్లు
  • వెల్లుల్లి తరుగు - 3 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 8
  • పసుపు - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
Menthi Kura Pesara Pappu
మెంతికూర (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం కావాల్సిన పరిమాణంలో మెంతికూరను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. అలాగే ఉల్లిపాయలు, ఎనిమిది పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో రెండు కప్పుల పెసరపప్పు, సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి.
Menthi Kura Pesara Pappu
పచ్చిమిర్చి (Getty Images)
  • అనంతరం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆరు స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర వేసి వేయించాలి. ఇది వేగాక కట్ చేసి పెట్టుకున్న రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, తరిగి ఉంచిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  • ఆనియన్స్ కాస్త రంగు మారిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు యాడ్ చేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమం చక్కగా ఫ్రై అయ్యాక రెండు కప్పుల మెంతికూర వేసి కలపాలి.
Menthi Kura Pesara Pappu
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేయాలి. అనంతరం మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉడికించాలి.
  • ఈ మిశ్రమం చక్కగా ఉడికి కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇక అంతే మెంతికూర పెసరపప్పు కర్రీ మీ ముందుంటుంది!
Menthi Kura Pesara Pappu
జీలకర్ర (Getty Images)
  • మీరు కూడా ఇంట్లో ఈ విధంగా చేసి ఇంటిల్లిపాదీకి ఓ కొత్త రెసిపీని పరిచయం చేయండి.
  • మీరు ఈ రెసిపీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే పెసరపప్పు, మెంతికూరతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

మండుటెండల్లో మజానిచ్చే "లెమన్​ పంచ్​" - ఒక్కో సిప్​ తాగుతుంటే ఆ కిక్కే వేరు!

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "రైస్​ ఖీర్​ పుడ్డింగ్" - సింపుల్​గా ఇంట్లోనే రెడీ!