ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "మంగళూరు ములక్కాడ కర్రీ" - వేడివేడి అన్నంలో తింటే అద్భుతమే!

మునక్కాయలతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఇష్టంగా తింటారు!

Mangalore Mulakkada Curry
Mangalore Mulakkada Curry (ETV Abhiruchi)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 1, 2026 at 11:07 AM IST

2 Min Read
Choose ETV Bharat

Mangalore Mulakkada Curry in Telugu : మునక్కాయలతో చేసిన రెసిపీలంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అందుకే వీటితో పప్పు, కూరలు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అందుకే మీకోసం ఇవాళ ఓకొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే మంగళూరు మునక్కాడ కర్రీ. ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేశారంటే అద్దిరిపోతుంది. ప్రిపరేషన్​ కూడా ఈజీ. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు తయారవుతుంది. వేడివేడి అన్నంలోకి కాస్త స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్​ చేస్తూ తింటారు. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్​ పాటిస్తూ సింపుల్​గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం​ చేయకుండా ఈ రెసిపీని చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

కాల్చిన టమోటాలు పచ్చిమిర్చితో "రసం" చేసుకోండి - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Mangalore Mulakkada Curry
మునక్కాడ ముక్కలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మునక్కాడ ముక్కలు - 1 కప్పు
  • బంగాళదుంప - 1
  • బెల్లం - 1 టీ స్పూన్
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1 టీ స్పూన్
  • మినపప్పు - 1 టీ స్పూన్
  • కరివేపాకు - కొంచెం
  • పసుపు - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చికొబ్బరి ముక్కలు - 1 కప్పు
  • జీలకర్ర - 2 టీ స్పూన్లు
  • ఎండుమిర్చి - 4
  • ధనియాలు - 2 టీ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 12
  • కొత్తిమీర - కొద్దిగా
Mangalore Mulakkada Curry
బంగాళదుంపలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కావాల్సిన పరిమాణంలో మునక్కాడలను, ఒక బంగాళదుంపను కడిగి పొట్టుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్​లో నీళ్లు పోయాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కప్పు మునక్కాడ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి మూతపెట్టి ఉడికించాలి.
Mangalore Mulakkada Curry
పచ్చికొబ్బరి (Getty Images)
  • ఇంకోవైపు మిక్సీజార్​లో కప్పు పచ్చికొబ్బరి ముక్కలు, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టాలి.
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పాన్​లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినపప్పు వేయాలి. అలాగే రెండు ఎండుమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ బెల్లం వేసి కలుపుతూ వేగనివ్వాలి.
Mangalore Mulakkada Curry
కరివేపాకు (Getty Images)
  • ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత ఉడికించిన మునక్కాడ,బంగాళదుంప ముక్కలు వేసి మగ్గించాలి. చివరన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే ఘుమఘుమలాడే మంగళూరు మునక్కాడ కర్రీ సిద్ధమైనట్లే!
Mangalore Mulakkada Curry
ఆవాలు, జీలకర్ర, పసుపు (Getty Images)
  • వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు.

రాగిపిండితో మృదువైన "ఇడ్లీలు" - పిండి రుబ్బకుండానే అప్పటికప్పుడు ప్రిపేర్​ చేసుకోవచ్చు!

న్యూ ఇయర్​ వేడుకల్లో "సింపుల్ స్వీట్" ట్రై చేయండి - ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి!