ETV Bharat / offbeat

పర్ఫెక్ట్​ రుచితో "కంది పొడి" - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

కందిపప్పు, పుట్నాలతో సింపుల్​గా చేసుకునే పొడి - కొత్తవాళ్లైనా సింపుల్​గా ఇలా చేసేయొచ్చు!

Kandi Podi
Kandi Podi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 16, 2025 at 5:13 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kandi Podi Making in Telugu : కొన్ని సార్లు కూరలు ఎంత రుచికరంగా చేసినా నోటికి చప్పగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది వివిధ రకాల పొడులను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అందుకే ఇండ్లలో కరివేపాకు, పల్లీలు, పుట్నాలతో పొడులను చేస్తారు. వీటిని రోజూ తిన్నా బోర్ కొడుతుంది. అలాంటి వారి కోసమే ఇవాళ ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే కంది పొడి. దీనిని ఈసారి ఈ కొలతలతో చేసి చూడండి మంచి ఫ్లేవర్​తో ఘుమఘుమలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. అంతేకాక ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు.

వేడివేడి అన్నంలో కంది పొడిని కాస్త నెయ్యి వేసుకుని తిన్నారంటే వారెవ్వా ఏమి రుచి అనాల్సిందే! ఇది అన్నంతో పాటు ఉప్మా, ఇడ్లీ వంటి టిఫిన్స్​లోకి చాలా కమ్మగా ఉంటుంది. పైగా దీని కోసం ఎక్కువ శ్రమించాల్సిన పని లేదు. అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. కొత్తగా చేసే వారు కూడా ఈ పద్ధతిని పాటిస్తూ చేశారంటే అద్దిరిపోతుంది. మరి ఈ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందామా?

సాయంత్రం వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి! - సింపుల్​గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు!

Kandi Podi
కందిపప్పు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఆయిల్ - 1 టీ స్పూన్
  • ఎండుమిర్చి - 10
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • మిరియాలు - 1 టీ స్పూన్
  • కందిపప్పు - అర కప్పు
  • పుట్నాలు - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఇంగువ - పావు టీ స్పూన్
Kandi Podi
ఎండుమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్​లో ఒక టీ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత 10 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 10 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి ఫ్రై చేసి ప్లేట్​లో వేయాలి.
  • ఇదే పాన్​లో అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలు, అర కప్పు కందిపప్పు యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఫ్రై చేయాలి. అలాగే అర కప్పు పుట్నాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్​లో వేసి చల్లారనివ్వాలి.
Kandi Podi
వెల్లుల్లి (Getty Images)
  • మరోవైపు మిక్సీజార్​లో వేయించిన ఎండుమిర్చి మిశ్రమం, కందిపప్పు పుట్నాల మిశ్రమం వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ ఇంగువ వేసి పొడిలాగా గ్రైండ్ చేయాలి.
  • ఇక అంతే నోరూరించే కంది పొడి మీ ముందుంటుంది!
Kandi Podi
పుట్నాలు (Getty Images)
  • అనంతరం కంది పొడిని గ్లాస్ జార్​లో వేసి నిల్వ చేసుకుంటే సరి.
  • వేడివేడి అన్నంలో కంది పొడి, కాస్త వేసి తిన్నారంటే ఆహా అనాల్సిందే. అలాగే టిఫిన్స్​లోకి సూపర్ కాంబినేషన్​!
Kandi Podi
మిరియాలు (Getty Images)
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంకోసారి చేయమని అడుగుతారు!
  • మీరు ఈ కంది పొడిని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే కందిపప్పు, పుట్నాలతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

చిక్కటి గ్రేవితో "మీల్ మేకర్ కర్రీ"- నాన్​వెజ్​ని మించిన టేస్ట్ కోసం ఇలా చేయండి!

కుక్కర్​లో నోరూరించే "సొరకాయ పప్పు" - అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్​!