ETV Bharat / offbeat

రాగిపిండితో నోరూరించే "కట్​లెట్స్​" - పిల్లలకు ఇలా చేసి సర్​ప్రైజ్ ఇవ్వండి!

రాగిపిండితో సరికొత్త రెసిపీ - టీ టైమ్​కు పర్ఫెక్ట్​ స్నాక్​!

Ragi Cutlets
Ragi Cutlets (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 1, 2026 at 11:57 AM IST

2 Min Read
Choose ETV Bharat

Ragi Cutlets Making in Telugu : రాగిపిండితో ఇడ్లీ, దోసె, పొంగనాలు, జావ అంటూ వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. మరి దీనితో స్నాక్స్​ చేయోచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని అనుసరిస్తూ ఓసారి ఇలా రాగి కట్​లెట్స్​ చేశారంటే అద్దిరిపోతుంది. వీటిని నిమిషాల్లోనే సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైతో పాటు ఎలాంటి మసాలాలు, కారం లేకుండా నోటికి కొత్త రుచినిస్తాయి.

కొత్తగా చేసేవారు కూడా ఈ స్టెప్స్​ పాటిస్తూ ఈజీగా చేయోచ్చు. ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీకి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాక పిల్లలు, పెద్దలకు ఫేవరెట్​ స్నాక్​గా మారుతుంది. మరి క్రిస్పీ,టేస్టీ రాగి కట్​లెట్స్​ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

బ్రేక్​ఫాస్ట్​లోకి, సాయంత్రం స్నాక్ కోసం - మీల్​మేకర్​తో కరకరలాడించండి!

Ragi Cutlets
రాగిపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • రాగిపిండి - 2 కప్పులు
  • కీరదోసకాయలు - 2
  • బీట్​రూట్ - 2
  • క్యారెట్ - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - కొద్దిగా
Ragi Cutlets
క్యారెట్ తురుము (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా రెండు క్యారెట్, రెండు బీట్​రూట్​, రెండు కీరదోసకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి. ఆ తర్వాత గ్రేటర్​తో సన్నగా తురుముకోవాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల రాగిపిండి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్​, బీట్​రూట్​, కీరదోసకాయల తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు యాడ్​ చేసి మెత్తని ముద్దలా కలిపి పక్కనుంచాలి.
Ragi Cutlets
కీరదోసకాయలు (Getty Images)
  • అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్​లో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతితో రౌండ్ షేప్​లో చిన్న చిన్న కట్​లెట్స్​లా చేసి పాన్​లో వేయాలి.
  • ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లో ఉంచి కట్​లెట్స్​ను రెండు వైపులా టర్న్​ చేస్తూ చక్కగా కాల్చుకోవాలి. ఇవి సరిగ్గా కాలాక ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
Ragi Cutlets
బీట్​రూట్​ (Getty Images)
  • అంతే వేడివేడి రాగి కట్​లెట్స్​ రెడీ అయినట్లే!
  • ఈ కట్​లెట్స్​ను టమోటా కెచప్​తో తింటే సూపర్ అనాల్సిందే!
Ragi Cutlets
నెయ్యి (Getty Images)
  • మరి మీకు ఈ రెసిపీ నచ్చితే రెగ్యులర్ స్నాక్ రెసిపీలకు బదులుగా ఓసారి ఇలా కట్​లెట్స్​ ట్రై చేసి మీ పిల్లలకు సర్​ప్రైజ్ ఇవ్వండి.
  • మీరు ఈ కట్​లెట్స్​ను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే రాగిపిండితో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

ఆంధ్రా స్టైల్ "పాలకూర పప్పు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

సొరకాయ పొట్టుతో "పచ్చడి" - ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు!