ETV Bharat / offbeat

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే "ఓట్స్ ఆమ్లెట్" - సుతిమెత్తగా, వేడివేడిగా అదుర్స్!

ఓట్స్​తో ఇడ్లీ, దోసె, ఉప్మా రోటీన్ - ఇలా రుచికరమైన ఆమ్లెట్​ ట్రై చేయండి!

Oats Omelette
Oats Omelette (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 22, 2026 at 4:25 PM IST

2 Min Read
Choose ETV Bharat

Oats Omelette Prepare in Telugu : నేటి కాలంలో మెజార్టీ పీపుల్​ ఓట్స్​ను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. వీటితో ఇడ్లీ, దోసె, ఉప్మా అంటూ వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే ఈసారి కాస్త వెరైటీగా ఇలా ఆమ్లెట్ చేశారంటే అద్దిరిపోతుంది. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు తయారవుతుంది. ఈ పద్ధతిని పాటిస్తూ చేస్తే సూపర్​గా వస్తుంది. దీనిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. దీన్ని పప్పు, సాంబార్ రోటి పచ్చడి​తో సైడ్​ డిష్​గా మాత్రమే కాకుండా మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​, సాయంత్రం స్నాక్​గానూ కూడా పర్ఫెక్ట్​! మరి ఇక ఆలస్యం చేయకుండా ఓట్స్​ ఆమ్లెట్​ ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లంచ్​లోకి ఏం చేయాలో తోచనపుడు ఇలా ట్రై చేయండి - పిల్లలు, పెద్దలు టేస్టీగా తింటారు!

Oats Omelette
ఓట్స్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఓట్స్​ - 2 కప్పులు
  • ఎగ్స్ - 6
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయలు - 2
  • మిరియాల పొడి - అర టీ స్పూన్
  • క్యాప్సికం - 1
  • టమోటాలు - 2
  • క్యారెట్ - 1
  • పచ్చిమిర్చి - 4
  • ఆయిల్ - తగినంత
Oats Omelette
ఎగ్స్ (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక క్యాప్సికంను తరిగి ఉంచాలి. అలాగే మిక్సీజార్​లో రెండు కప్పుల ఓట్స్ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి.
  • అనంతరం మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడి, సరిపడా నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.
Oats Omelette
ఉల్లిపాయ తరుగు (Getty Images)
  • పదిహేను నిమిషాల అనంతరం ఓట్స్ పిండిలో తరిగి ఉంచిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్ యాడ్ చేసి బాగా కలపాలి.
  • అలాగే ఇంకో గిన్నెలో ఆరు ఎగ్స్​ను పగలగొట్టి వేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా బీట్ చేయాలి.
  • ఆ తర్వాత ఓట్స్​ పిండిలో ఎగ్​ మిశ్రమం వేసి మిక్స్ చేయాలి.
Oats Omelette
టమోటా ముక్కలు (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసె పాన్​ పెట్టాలి. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసి పిండి మిశ్రమాన్ని ఆమ్లెట్​లా కాస్త మందగా వేయాలి. ఆ తర్వాత మూతపెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
  • అనంతరం ఆమ్లెట్​ను మరోవైపు టర్న్ చేస్తూ ఉడకనివ్వాలి. రెండు వైపులా ఉడికిన తర్వాత ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
  • అంతే వేడివేడి ఓట్స్ ఆమ్లెట్ మీ ముందుంటుంది!
Oats Omelette
పచ్చిమిర్చి (Getty Images)
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది!
  • మీరు ఈ రెసిపీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే ఓట్స్​, ఎగ్స్​తో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

మండే ఎండల్లో ఒంటికి చలువ చేసే "జొన్న అంబలి" - నోటికి రుచిగా, పొట్టకి హాయిగా!

ఘుమఘుమలాడే "ఫిష్ కుర్మా" - ఈ పద్ధతిలో చేస్తే జిందగీ ఖుష్ అయిపోద్ది!