ETV Bharat / offbeat

జొన్నపిండితో "ఇడ్లీలు" - సూపర్​ సాఫ్ట్​గా ఉంటాయి - ఇన్​స్టంట్​గా చేసుకోవచ్చు!

పిండి రుబ్బకుండానే మృదువైన ఇడ్లీలు - ఏ చట్నీతో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి!

Jonna Idli
Jonna Idli (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 5:24 PM IST

2 Min Read
Choose ETV Bharat

Jonna Idli Making in Telugu : సాధారణంగా ఇడ్లీలు చేయాలంటే ముందురోజు పప్పులు నానబెట్టి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాత్రంతా పులియబెట్టి మరుసటి రోజు ఉదయం వీటిని చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు అంత టైమ్ ఉండదు. అలాంటప్పుడు ఇడ్లీలు ఎలా చేయాలని మదనపడుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా జొన్నపిండి, బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఇడ్లీలు ప్రిపేర్​ చేసుకోవచ్చు.

ఈ స్టెప్స్ పాటిస్తూ చేశారంటే ఎంతో మెత్తగా రుచికరంగా వస్తాయి. వీటిని చేయడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. నిమిషాల్లోనే వేడివేడిగా తయారు చేసుకోవచ్చు. కొత్తవారు కూడా ఈ పద్ధతిలో సింపుల్​గా చేయోచ్చు. ఇక పిల్లలు, పెద్దలైతే చట్నీ అవసరం లేకుండానే వీటిని ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

బంగాళదుంపతో కరకరలాడే "చెగోడీలు" - నూనె పీల్చకుండా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి!

Jonna Idli
జొన్నపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - అర కప్పు
  • జొన్నపిండి - ఒక కప్పు
  • వంటసోడా - పావు టీస్పూన్​
  • పెరుగు - ఒక కప్పు
  • నెయ్యి - సరిపడా
  • ఉప్పు - తగినంత
Jonna Idli
నెయ్యి (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా మిక్సింగ్​ బౌల్లో కప్పు జొన్న పిండి, కప్పు పెరుగు వేసి కలపాలి. ఆ తర్వాత అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు నీళ్లు యాడ్​ చేసి మిక్స్ చేయాలి. పిండిని ఇడ్లీ పిండిలా ఉండేలా కాస్త జారుగా కలిపి ఆపై మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరోసారి మిక్స్ చేయాలి. ఆపై ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వంటసోడా వేసి మిక్స్ చేసుకోవాలి.
Jonna Idli
పెరుగు (Getty Images)
  • అలాగే స్టవ్​ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్​ మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసి పిండిని వేయాలి.
  • ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్​ ఉంచి మూతపెట్టాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 12 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
Jonna Idli
బొంబాయి రవ్వ (Getty Images)
  • మూడు నిమిషాల తర్వాత ప్లేట్​లోకి సర్వ్ చేసి సాంబార్​, కారం పొడి లేదా మీకు నచ్చిన చట్నీతో తింటే సూపర్ అనాల్సిందే!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
  • ఈ జొన్న ఇడ్లీలను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే జొన్నపిండి, బొంబాయి రవ్వతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

చిక్కటి గ్రేవితో "సోయా కీమా కర్రీ"- ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకోవడం పక్కా!

ఘుమఘుమలాడే "మిరియాల తమలపాకు రసం" - కమ్మటి రుచితో కడుపునిండా తినేస్తారు!