నోరూరించే "క్యాప్సికం పచ్చడి" - వద్దన్న వారే ఇష్టంగా తింటారు!
క్యాప్సికంతో నిమిషాల్లో తయారయ్యే రెసీపీ - కూరలు పక్కన పెట్టి అన్నం మొత్తం చట్నీతోనే తినేస్తారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 3:10 PM IST
Capsicum Chutney Recipe : క్సాప్సికంతో చేసిన రెసిపీలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. మీ ఇంట్లోనూ క్యాప్సికం అంటే నో చెబుతున్నారా? అయితే ఓసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి. వద్దన్నవారే ఇష్టంగా తింటారు. ఇది అన్నంతో పాటు టిఫిన్స్‌లోకి చాలా రుచికరంగా ఉంటుంది. పైగా దీన్ని నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
"టమోటా పచ్చడి" ఫ్యాన్స్‌కి పండగే - పచ్చిమిర్చితో అద్భుతమైన చట్నీ మీకోసం!

కావాల్సిన పదార్థాలు :
- క్యాప్సికం - 4
- వెల్లుల్లి రెబ్బలు - 10
- చింతపండు - 30 గ్రాములు
- ఎండుమిర్చి - 16
- తాలింపు దినుసులు - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- పసుపు - 2 చిటికెడ్లు
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - చిటికెడు

తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా నాలుగు క్యాప్సికం తీసుకొని శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 12 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని తీసి ఓ ప్లేట్లో వేయాలి.

- ఇదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను వేసి వేగనివ్వాలి. అనంతరం మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం ముక్కలు మగ్గిన తర్వాత వీటిని ఓ గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత మిక్సీజార్‌లో వేయించిన ఎండుమిర్చి, క్యాప్సికం ముక్కలు, పది వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే 30 గ్రాముల చింతపండు, రెండు చిటికెడ్ల పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి.

- అనంతరం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు, నాలుగు ఎండుమిర్చి వేసి వేయించాలి.
- ఈ మిశ్రమం వేగాక కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ యాడ్ చేసి వేగనివ్వాలి.

- ఈ తాలింపును గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి.
- అంతే ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికం పచ్చడి సిద్ధంగా ఉంటుంది!
- నచ్చితే మీరూ ఓసారి ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
- మీరు ఈ పచ్చడిని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే క్యాప్సికంతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
వీకెండ్ స్పెషల్ "పటియాలా చికెన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ రుచికి ఫిదా!
టేస్టీ, యమ్మీ "దలియా" - ఈ స్వీట్‌తో ప్రతీ వేడుక సంతోషంగా జరుపుకోండి!

