కిర్రాక్ అనిపించే " బ్రెడ్ వడలు" - తింటే వదలరు!
వడలను ఈసారి ఇలా ట్రై చేయండి - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 11:18 AM IST
Instant Bread Vada Prepare in Telugu : బ్రెడ్‌ను ఉప్మా, హల్వా, ఆమ్లెట్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీనితో వడలు చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఓసారి ఈ విధంగా చేశారంటే నిమిషాల్లోనే క్రిస్పీటేస్టీ వడలు మీ ముందుంటాయి. వీటి తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడూ చేసుకోవచ్చు. కొత్తగా చేసే వారు కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ సింపుల్‌గా చేయొచ్చు. ఇవి చాలా రుచికరంగా ఉండి ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
రాగిపిండితో నోరూరించే "కట్లెట్స్" - పిల్లలకు ఇలా చేసి సర్ప్రైజ్ ఇవ్వండి!

కావాల్సిన పదార్థాలు :
- బ్రెడ్ స్లైస్‌లు - 16
- ఉల్లిపాయ తరుగు - 12 స్పూన్లు
- బియ్యప్పిండి - 8 స్పూన్లు
- పచ్చిమిర్చి తరుగు - 4 స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- బేకింగ్ సోడా - 2 చిటికెడ్లు
- అల్లం తరుగు - 6 స్పూన్లు
- కొత్తిమీర తరుగు - 4 స్పూన్లు
- ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లంను తరిగి ఉంచాలి.
- అలాగే 16 బ్రెడ్ స్లైస్‌లను తీసుకొని బ్రౌన్ కలర్లో ఉండే అంచులను కట్ చేసుకోవాలి. అనంతరం బ్రౌన్ పార్ట్ తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీజార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి.

- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడి, ఎనిమిది స్పూన్ల బియ్యప్పిండి, తరిగి ఉంచిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అదేవిధంగా ఆరు స్పూన్ల అల్లం తరుగు, నాలుగు స్పూన్ల కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, రెండు చిటికెడ్ల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి.
- అనంతరం కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి.

- పది నిమిషాల తర్వాత చేతిని తడి చేసి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల ఆకారంలో చేసి ప్లేట్లో వేయాలి.
- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన అనంతరం కడాయికి సరిపడా వడలను వేసి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.

- ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చిల్లుల గరిటెతో వడలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
- అంతే కరకరలాడే బ్రెడ్ వడలు మీ ముందుంటాయి!
- ఈ వడలను మీకు నచ్చిన చట్నీతో తింటే సూపర్ అనాల్సిందే!
- మరి మీకు ఈ రెసిపీ నచ్చితే మీరూ ఓసారి రెగ్యులర్‌గా చేసుకునేవిధంగా కాకుండా బ్రెడ్‌తో ఇలా వడలు ఓసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు.
మసాలా ఘాటుతో అద్దిరిపోయే "మటన్ దో ప్యాజా" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
కర్ణాటక స్పెషల్ "క్యాబేజీ కుర్మా" - ఒక్కసారి తిన్నారంటే అదరహో అనాల్సిందే!

