ETV Bharat / offbeat

హోటల్ స్టైల్ "దొండకాయ వేపుడు" - నిమిషాల్లోనే రెడీ!

నోరూరించే దొండకాయ ఫ్రై - పిల్లలు భలే ఇష్టంగా తింటారు!

Dondakaya Vepudu
Dondakaya Vepudu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 4:33 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tindora Fry Prepare : దొండకాయతో కర్రీ, ఫ్రై, పచ్చడి లాంటివి చేస్తుంటారు. అందుకే మీకోసం ఇవాళ ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే హోటల్ స్టైల్ దొండకాయ వేపుడు. ఎంతో టేస్టీగా, మరెంతో స్పైసీగా ఉండే దీనిని పిల్లలు కూడా ఇష్టపడతారు. తయారు చేసుకోవడం​ కూడా ఈజీ. అంతేకాక తక్కువ పదార్థాలతో ఇన్​స్టంట్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ కూర, కొద్దిగా నెయ్యి వేసి తింటే ఆహా అనాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూసేయండి.

కమ్మని "కొబ్బరి కారం పొడి" - కర్రీస్​ బోర్ కొడితే ఇదొక్కటి చాలు!

Dondakaya Vepudu
దొండకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • దొండకాయలు - పావు కిలో (250 గ్రాములు)
  • ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
  • తాలింపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి - 5
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉల్లిపాయలు - 2
  • ఉప్పు - ఒకటిన్నర టీ స్పూన్
  • పసుపు - అర టీ స్పూన్
  • ధనియాలు - 1 టీ స్పూన్
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • ఎండుకొబ్బరి పొడి - ఒకటిన్నర టీ స్పూన్
  • నువ్వులు - ఒకటిన్నర టీ స్పూన్
  • పుట్నాలు - 2 టేబుల్ స్పూన్లు
  • కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • కొత్తిమీర - కొద్దిగా
  • జీడిపప్పు - 10
Dondakaya Vepudu
వెల్లుల్లి (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా పావు కిలో దొండకాయలను కడిగి పొడవుగా, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే రెండు ఉల్లిపాయలను తరిగి ఉంచాలి.
  • ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్​లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత పది జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి. అనంతరం వీటిని ప్లేట్​లో వేయాలి.
Dondakaya Vepudu
జీలకర్ర, కారం, పసుపు (Getty Images)
  • ఇదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఐదు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి వేగనివ్వాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
  • ఆనియన్స్ మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. అనంతరం మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించాలి.
Dondakaya Vepudu
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • మరోవైపు పొడి కోసం మిక్సీజార్​లో ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒకటిన్నర టీ స్పూన్ ఎండుకొబ్బరి పొడి వేయాలి. అలాగే ఒకటిన్నర టీ స్పూన్ నువ్వులు, రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం, ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టాలి.
  • దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే వేయించిన జీడిపప్పు, చివరన కొత్తిమీర యాడ్ చేసి బాగా కలపాలి.
Dondakaya Vepudu
జీడిపప్పు (Getty Images)
  • ఇక అంతే నోరూరించే హోటల్ స్టైల్ దొండకాయ వేపుడు మీ ముందుంటుంది!
  • వేడివేడి అన్నంలో దొండకాయ వేపుడు వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు. అలాగే పప్పు, సాంబార్​లో సైడ్ డిష్​గా అద్దిరిపోతుంది.

ఘుమఘుమలాడే "హైదరాబాదీ చికెన్ కుర్మా" - ఎన్నడూ తినని టేస్ట్​ని ఎంజాయ్ చేస్తారు!

నిమిషాల్లోనే రెడీ చేసుకునే "మినపప్పు అన్నం" - టేస్ట్ అమోఘం!