ETV Bharat / offbeat

న్యూ ఇయర్​ వేడుకల్లో "సింపుల్ స్వీట్" ట్రై చేయండి - ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి!

పెళ్లి భోజనాల్లో వడ్డించే బ్రెడ్ స్వీట్ - ఇలా చేశారంటే 10నిమిషాల్లో రెడీ!

simple_and_easy_sweet_recipe
simple_and_easy_sweet_recipe (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 3:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

Simple and Easy Sweet Recipe : పెళ్లి భోజనాల్లో వడ్డించే బ్రెడ్ హల్వా రుచి చూడని వారుండరు. కాస్త క్రీమీగా, క్రంచీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ల తయారీతో పోలిస్తే ఈ బ్రెడ్ స్వీట్ తయారీ చాలా సింపుల్. కొత్త వాళ్లే కాదు పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన కొలతల్లో ట్రై చేసి చూడండి మౌత్ వాటరింగ్ బ్రెడ్ స్వీట్ ఆస్వాదించవచ్చు.

జ్యూసీ, స్పైసీ "మటన్ లివర్​ ఫ్రై" - ఈ 31st పార్టీకి పర్ఫెక్ట్ కాంబినేషన్​!

simple_and_easy_sweet_recipe
simple_and_easy_sweet_recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • బ్రెడ్ ముక్కలు - 10
  • నూనె - డీప్ ఫ్రై కోసం
  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  • జీడిపప్పు - 10
  • కిస్ మిస్ - 15
  • బాదం - 8
  • పిస్తా - 8
  • పంచదార - 1 కప్పు
  • కాచి చల్లార్చిన పాలు - పావు కప్పు
simple_and_easy_sweet_recipe
simple_and_easy_sweet_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా ఫ్రెష్ బ్రెడ్ 8 పీసులు తీసుకోవాలి. వాటికి చుట్టూ ఉండే గోధుమ రంగు లేయర్ కట్ చేసుకుని ఒక్కో బ్రెడ్ మరీ చిన్నగా, పెద్దగా కాకుండా ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె పోసుకుని మీడియం ఫ్లేమ్​లో బ్రెడ్ ముక్కలు దోరగా వేయించాలి.
simple_and_easy_sweet_recipe
simple_and_easy_sweet_recipe (Getty images)
  • మంట తక్కువైతే బ్రెడ్ ముక్కలు నూనె ఎక్కువగా పీలుస్తాయి. అదే మంట తక్కువైతే మాడిపోతాయి. అందుకే లో టు మీడియం ఫ్లేమ్​లో వేయించాలి. బ్రెడ్ పీసెస్ అన్నింటినీ విడతల వారీగా వేయించి పక్కన ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించాలి. వాటిని పక్కన పెట్టుకుని మళ్లీ అదే కడాయిలో 1 కప్పు పంచదార వేసుకోవాలి. అందులోకి 1 కప్పు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్​లో కరిగించుకోవాలి.
simple_and_easy_sweet_recipe
simple_and_easy_sweet_recipe (Getty images)
  • పాకం కాస్త అతుక్కుపోయే వరకు వచ్చేలా ఉడికించాలి. మరీ తీగ పాకం కాకుండా కాస్త తక్కువగా వచ్చే వరకు మంట పెట్టాలి. ఇపుడు రంగు కావాలనుకుంటే కుంకుమ పువ్వు లేదా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని కలపాలి. బ్రెడ్ పీసులు దోరగా వేయించాం కాబట్టి ఫుడ్ కలర్ అవసరం ఉండదు.
simple_and_easy_sweet_recipe
simple_and_easy_sweet_recipe (Getty images)
  • పాకం వచ్చిన తర్వాత మంట కాస్త తగ్గించుకోవాలి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను పాకంలో వేసుకుని అవి పాకం మొత్తం పీల్చుకునే వరకు మూత పెట్టేయాలి. ఆ తర్వాత కాస్త మ్యాష్ చేసుకుని పావు కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఆ తర్వాత మంట కట్టేసి కలపాలి. బ్రెడ్ పీసులు మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగానే ముక్కలు తగిలేలా చూసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ కూడా వేసుకుని కలపాలి.

బార్లీతో పసందైన "తల్బినా" - నిమిషాల్లోనే రెడీ - టేస్ట్ అమోఘం!

"న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ ఫ్రై" - రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇంట్లోనే, ఈజీగా!