ETV Bharat / offbeat

చింతపండు లేకుండానే కమ్మని "ఉసిరికాయ రసం" - అన్నం కడుపునిండా తినేస్తారు!

-రెగ్యులర్ రసం రెసిపీలను మించిన టేస్ట్ - ఈ సీజన్​లో తప్పక ట్రై చేయాల్సిందే!

Usirikaya Rasam Recipe
Usirikaya Rasam Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 25, 2025 at 1:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

Usirikaya Rasam Recipe in Telugu : చలికాలం​లో విరివిగా లభించే వాటిల్లో ఒకటి ఉసిరి. ఇందులో విటమిన్ సి, ఈ, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉసిరితో వింటర్​లో వివిధ రకాల రెసిపీలు ట్రై చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ చేసుకునే పప్పు, పచ్చడి, పులిహోర వంటివే కాకుండా మీరు తప్పక ట్రై చేయాల్సిన మరో రెసిపీ ఉంది. అదే, ఘుమఘుమలాడే కమ్మని "ఉసిరికాయ రసం". చింతపండు అవసరం లేకుండానే ఈ రసం టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా, దీన్ని చాలా తక్కువ సమయంలో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అలాగే, రెగ్యులర్ రసం రెసిపీలు తిని బోర్ కొట్టిన వారికి ఇది సరికొత్త రుచినిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది! పిల్లలకూ ఈ ఉసిరి రసం చాలా బాగా నచ్చుతుంది. మరి, ఉసిరితో నోరూరించే ఈ రసాన్ని ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Usirikaya Rasam Recipe
ఉసిరికాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పావుకప్పు - కందిపప్పు
  • మూడు - ఉసిరికాయలు
  • రెండు - టమాటాలు
  • నాలుగు - పచ్చిమిర్చి
  • మూడు - కరివేపాకు రెబ్బలు
  • చిన్నముక్క - అల్లం
  • ఒకటిన్నర చెంచా - జీలకర్ర
  • ఒక చెంచా - మిరియాలు
  • ఒక చెంచా - ఆవాలు
  • నూనె - కొద్దిగా
  • చిటికెడు - ఇంగువ
  • పావుచెంచా - పసుపు
  • రుచికి తగినంత - ఉప్పు
  • రెండు టేబుల్​స్పూన్లు - సన్నని కొత్తిమీర తరుగు

సిసలైన "మిరియాల చారు"! - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోవాల్సిందే!

Usirikaya Rasam Recipe
కందిపప్పు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ రసం రెసిపీ కోసం ముందుగా ఉసిరికాయలను గింజలు తీసేసి ముక్కలుగా చేసుకుని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి.
  • ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన కందిపప్పును వేసి, సరిపడా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికేలోపు ఒక ప్రత్యేకమైన మసాలా పేస్ట్​ను సిద్ధం చేసుకోవాలి.
  • ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, టమాటా తరుగు, సగం కరివేపాకు, అల్లం, చెంచా జీలకర్ర, మిరియాలు, రెండు పచ్చిమిర్చిలను ముక్కలుగా తుంపి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే 'మసాలా పేస్ట్' రెడీ అవుతుంది!

కమ్మని "ఉసిరికాయ రోటి పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

Usirikaya Rasam Recipe
పచ్చిమిర్చి (Getty Images)
  • ఇప్పుడు కుక్కర్​లో మంచిగా ఉడికిన పప్పును అందులోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి గరిటె లేదా పప్పుగుత్తితో మెత్తగా మాష్ చేసుకుని పక్కనుంచాలి.
  • అనంతరం స్టవ్ మీద రసం తయారీకి కడాయిని పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మిగిలిన జీలకర్ర, ఇంగువ వేసి ఆవాలు చిటపటమనేవరకు వేయించాలి.
  • అవి వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి తరుగును వేసి ఫ్రై చేయాలి. ఇవి కూడా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రత్యేకమైన మసాలా పేస్ట్​ను జత చేసి పచ్చివాసన పోయేంత వరకు అయిదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
Usirikaya Rasam Recipe
కరివేపాకు (Getty Images)
  • ఆ తర్వాత అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలిపి, మెత్తగా ఉడికించి మాష్ చేసుకున్న పప్పు, పసుపు, టేస్ట్​కి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి మరోసారి బాగా కలిపి మరిగించుకోవాలి.
  • ఆ మిశ్రమం బాగా మరిగి బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుంటే చాలు. అంతే, ఉసిరికాయలతో నోరూరించే "కమ్మని రసం" రెసిపీ రెడీ అవుతుంది!
Usirikaya Rasam Recipe
మిరియాలు (Getty Images)

పిల్లల బాక్స్​లోకి ఇలా "ఉసిరి పులిహోర" చేసి పెట్టండి - కమ్మగా, కడుపునిండా తినేస్తారు!