ETV Bharat / offbeat

మరమరాలతో కరకరలాడే "గారెలు" - తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే రెడీ!

- ఈవెనింగ్ సూపర్ స్నాక్ రెసిపీ - తక్కువ నూనె, ఎక్కువ రుచి!

Maramarala Garelu Recipe
Maramarala Garelu Recipe (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : November 9, 2025 at 6:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

Maramarala Garelu Recipe : 'మరమరాలు' వీటినే కొన్ని ప్రాంతాల్లో బొంగు పేలాలు, బొరుగులు, మురీలు అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. చాలా మంది వీటితో 'వెల్లుల్లి కారం బొరుగులు, మసాలా మరమరాలు' ప్రిపేర్ చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా ఈసారి వెరైటీగా ఇలా "మరమరాల గారెలు" ట్రై చేయండి.

గారెలనే కొన్ని ప్రాంతాల్లో 'వడలు' అని కూడా అంటుంటారు. వీటిని ఎలాంటి పప్పులు నానబెట్టకుండానే అప్పటికప్పుడు ఇన్​స్టంట్​గా రెడీ చేసుకోవచ్చు. తక్కువ టైమ్​లో తయారయ్యే ఇవి రెగ్యులర్​గా చేసుకునే వాటి కంటే ఎక్స్​ట్రా క్రిస్పీగా, మంచి టేస్టీగా ఉంటాయి. అలాగే, ఈ గారెలు తక్కువ నూనెనూ పీల్చుకుంటాయి! మరి, అందుకు కావాల్సి పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Maramarala Garelu Recipe
మరమరాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మరమరాలు - ఒక పెద్ద కప్పు
  • శనగపిండి - ఒకట్రెండు చెంచాలు
  • బియ్యప్పిండి - రెండు టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయలు - ఒకట్రెండు
  • పచ్చిమిర్చి - మూడు
  • అల్లం తరుగు - ఒక చెంచా
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • పెరుగు - కొద్దిగా
  • జీలకర్ర - ఒక చెంచా
  • ఉప్పు - రుచికి తగినంత
  • వంట సోడా - కొద్దిగా
  • నూనె - వేయించడానికి సరిపడా

పెసరపప్పుతో నోరూరించే "పూరీలు" - తక్కువ నూనెతో చక్కగా పొంగుతాయి!

Maramarala Garelu Recipe
ఉల్లిపాయ తరుగు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ గారెల తయారీకి ముందుగా ఒక గిన్నెలో మరమరాలను తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఓసారి కలిపి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
  • అవి నానేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ తరుగును వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కనుంచాలి. అలాగే, పచ్చిమిర్చి, అల్లం తరుగును సిద్ధం చేసుకోవాలి.
  • మరమరాలు మంచిగా నాని మెత్తగా అయిన తర్వాత వాటర్ గట్టిగా పిండి ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
Maramarala Garelu Recipe
పచ్చిమిర్చి తరుగు (Getty Images)
  • తర్వాత నానిన మరమరాలలో బియ్యప్పిండి, శనగపిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు, సన్నని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తరుగు వేసుకోవాలి.
  • అలాగే, జీలకర్ర, టేస్ట్​కి సరిపడా ఉప్పు, పెరుగు వేసుకుని చేతితో బాగా ప్రెస్ చేస్తూ పదార్థాలన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై చివరగా కొద్దిగా వంటసోడా వేసుకుని మరోసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యేలోపు బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి.
Maramarala Garelu Recipe
బియ్యప్పిండి (Getty Images)
  • తర్వాత చేతికి కాస్త నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మరమరాల మిశ్రమంలో కొద్దిగా తీసుకుని గారె లేదా వడ షేప్​లో వత్తుకోవాలి.
  • నూనె కాగిన తర్వాత మంటను తగ్గించి వత్తుకున్న గారెను కాగుతున్న ఆయిల్​లో నెమ్మదిగా వేసుకోవాలి.
  • ఇలా పాన్​లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా కాసేపు వేగనిచ్చి చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పేసుకుంటూ మంచిగా వేగనివ్వాలి.
  • అవి రెండు వైపులా చక్కగా వేగి మంచి గోల్డెన్ కలర్​లోకి వచ్చాక సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇదే ప్రాసెస్​లో పిండి మొత్తాన్ని రెడీ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, మరమరాలతో కరకరలాడే "గారెలు లేదా వడలు" అప్పటికప్పుడు రెడీ అవుతాయి!
Maramarala Garelu Recipe
మరమరాల గారెలు పిండి (ETV Abhiruchi)

చిట్కాలు :

  • ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు తీసుకునే మరమరాల క్వాంటిటీని బట్టి బియ్యప్పిండి, శనగపిండి తీసుకోవాలి.
  • అలాగే, మరమరాల పిండి కలిపేటప్పుడు అవి మెత్తగా మాష్ అయ్యేలా చూసుకోవాలి.
  • నూనెలో వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్​లోనే వేగనివ్వాలి. అప్పుడే గారెలు లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా, మంచి రుచికరంగా వస్తాయి.
Maramarala Garelu Recipe
బొరుగుల వడలు (ETV Abhiruchi)

టిఫెన్స్​లోకి నిమిషాల్లోనే చేసుకునే "చట్నీ" - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చేస్తుంది!

కరకరలాడే "పాలకూర బజ్జీలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!