పచ్చిమిర్చి పేస్ట్‌తో "ఆంధ్రా చిల్లీ చికెన్ కర్రీ" - నోటికి సరికొత్త రుచిని ఇస్తుంది!
రొటిన్కి భిన్నంగా చికెన్ రెసిపీ - ఇలా చేస్తే వన్స్‌మోర్ అనాల్సిందే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 11:59 AM IST
Andhra Chilli Chicken Curry : చికెన్ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరుతుంది. ఇక వీటితో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఓకేలా కాకుండా ఈసారి ఆంధ్రా చిల్లీ చికెన్ కర్రీ చేశారంటే ఇళ్లంతా ఘుమఘుమలాడాల్సిందే. ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?
కాల్చిన టమోటాలు పచ్చిమిర్చితో "రసం" చేసుకోండి - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - అర కిలో (500 గ్రాములు)
- నిమ్మరసం - ఒక టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పచ్చిమిర్చి - 18
- అల్లం ముక్కలు - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 15
- కొత్తిమీర - కొంచెం
- పుదీనా - కొద్దిగా
- జీడిపప్పు - 6
- ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టీ స్పూన్
- బిర్యానీ ఆకులు - 2
- దాల్చినచెక్క - 1
- యాలకులు - 3
- లవంగాలు - 5
- ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
- పసుపు - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా గిన్నెలో అర కిలో చికెన్ వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి గంటపాటు పక్కనుంచాలి. అలాగే కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయలు, 18 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇంకోవైపు మిక్సీజార్‌లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం, 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, ఆరు జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

- మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అలాగే రెండు బిర్యానీ ఆకులు, ఒక దాల్చినచెక్క, మూడు యాలకులు, ఐదు లవంగాలు, కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- ఆనియన్స్ వేగాక పావు టీ స్పూన్ పసుపు, చికెన్ ముక్కలు వేసి మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.

- మూడు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. అలాగే గ్రైండ్ చేసిన పచ్చిమిర్చిపుదీనా పేస్ట్ వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలపాలి.
- ఆ తర్వాత మూతపెట్టి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు, మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసి మూతపెట్టి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

- పదిహేను నిమిషాల అనంతరం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే ఘుమఘుమలాడే ఆంధ్రా చిల్లీ చికెన్ కర్రీ మీ ముందుంటుంది!
రాగిపిండితో మృదువైన "ఇడ్లీలు" - పిండి రుబ్బకుండానే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు!
కరకరలాడే "బెల్లం కొమ్ములు" - స్వీట్ షాప్ స్టైల్లో సింపుల్‌గా చేసుకోవచ్చు!

