మీ ఫోన్ ఒరిజినల్ or సెకండ్ హ్యాండ్? - ఇలా జస్ట్ ఒక్క నిమిషంలో కనుక్కోండి!
- ఆఫర్లంటూ నకిలీ ఫోన్లతో ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లు - ఫోన్ ఒరిజనల్ లేదా ఫేక్ను ఇలా గుర్తించండి!

Published : May 1, 2026 at 4:05 PM IST
How to Check Phone is Real or Fake: నేటి టెక్నాలజీ యుగంలో చేతిలో మొబైల్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ యూజ్ చేసేవారే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు అందరూ మొబైల్ ఫోన్‌లతోనే గడిపేస్తున్నారు. అయితే, చాలా మంది ఆఫర్లలో ఫోన్ కొనుగోలు చేస్తుంటారు. తక్కువ బడ్జెట్లో వస్తోందని, భారీ డిస్కౌంట్ ఉందని కొనుగోలు చేస్తుంటారు. అయితే తక్కువ ధరకే వచ్చే ఫోన్లలో కొన్ని సెకండ్ హ్యాండ్ కావొచ్చని, లేదా సదరు కంపెనీకి చెందిన ఫోన్ కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. మరి, ఈ విషయం ఎలా తెలుసుకోవాలో నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
టెలికాం శాఖ సంచార్ సాథీ (Sanchar Saathi) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మోసపూరిత కాల్స్/ సందేశాలకు చెక్ పెట్టడంతోపాటు మనం ఉపయోగించే ఫోన్ ఫేక్ లేదా రియల్ అని తెలుసుకోవచ్చు. ముందుగా 2023లో సంచార్ సాథీ పోర్టల్‌ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ యాప్‌ను లాంచ్ చేయడం ద్వారా మరింత సమర్థంగా మోసాలకు చెక్ పెట్టొచ్చని భావించిన కేంద్రం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఈ యాప్ వినియోగించొచ్చు. మరి ఫోన్ రియల్ or ఫేక్ అనేది ఎలా గుర్తించాలంటే..
- ముందుగా ఫోన్లో గూగుల్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి సంచార్ సాథీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరుతో రిజిస్టర్ అవ్వాలి.
- ఆ తర్వాత Citizen Centric Services లో Know Genuineness of Your Mobile Handset ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ ఫోన్ 15 డిజిట్స్ IMEI నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత Submit ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ IMEI కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
- అందులో స్టేటస్, IMEI నెంబర్, ఫోన్ బ్రాండ్ నేమ్, మోడల్ నేమ్, ఎవరు తయారు చేశారు, డివైజ్ టైప్ అనే వివరాలు కనిపిస్తాయి. ఇలా ఉంటే మీ ఫోన్ రియల్ అని గుర్తించవచ్చు.
- ఒకవేళ మీ ఫోన్ ఫేక్ అయితే ఇన్వ్యాలిడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
సంచార్ సాథీ పోర్టల్ ద్వారా :
- మీ ఫోన్ లేదా కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సంచారీ సాథీ పోర్టల్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపించే Citizen Centric Serviceపై క్లిక్ చేసి Know Genuineness of Your Mobile Handset ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ముందుగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అనంతరం మీ మొబైల్ ఎంటర్ చేసి Get OTP ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీ ఎంటర్ చేసి Verified ఆప్షన్‌పై క్లిక్ చేస్తే IMEI నెంబర్ ఎంటర్ చేయడానికి ఓ బాక్స్ కనిపిస్తుంది.
- ఆ బాక్స్‌లో IMEI నెంబర్ ఎంటర్ చేసి Submit ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్ మీద స్టేటస్, IMEI నెంబర్, ఫోన్ బ్రాండ్ నేమ్, మోడల్ నేమ్, ఎవరు తయారు చేశారు, డివైజ్ టైప్ అనే వివరాలు కనిపిస్తాయి. ఇలా ఉంటే మీ ఫోన్ రియల్ అని గుర్తించవచ్చు.
- ఒకవేళ మీ ఫోన్ ఫేక్ అయితే ఇన్వ్యాలిడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
SMS ద్వారా పంపించవచ్చు :
- మీ ఫోన్లో మెసేంజర్ యాప్ ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత KYM <15 digit IMEI number> టైప్ చేసి 14422 నెంబర్‌కు సెండ్ చేయాలి.
- మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఫేక్ అయితే Invalid అని చూపిస్తుంది.
IMEI నెంబర్ ఎలా గుర్తించాలి: ఈ ఐఎంఈఐ నెంబర్‌ను గుర్తించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే,
- మీ కొత్త ఫోన్ కొంటున్నట్లైతే ఫోన్ బాక్స్ మీద IMEI నెంబర్లు ఉంటాయి. వాటి ద్వారా అయిన సెర్చ్ చేయవచ్చు.
- మీ ఫోన్లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి*#06# ఎంటర్ చేస్తే మీ IMEI నెంబర్ డిస్ప్లే అవుతుంది.
- మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో About Phone పై క్లిక్ చేస్తే ఫోన్‌కు సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. అందులోని IMEI నెంబర్‌ను నోట్ చేసుకుని సెర్చ్ చేస్తే సరి.
ఈ ఒక్క యాప్‌తో ఫోన్‌కు భద్రత, సైబర్ నేరాలకు చెక్!
How To Find Lost Mobile : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. టెన్షన్ ఎందుకు.. 'సంచార్ సాథీ' తోడు ఉందిగా!

