గ్యాస్ సిలిండర్‌పై ఉండే ఈ "నంబర్" ఏంటో తెలుసా?! - పేలుడుకు కారణం కావొచ్చు!
- మీరు గడువు ముగిసిన సిలిండర్ వాడుతున్నారేమో? - ఓసారి చెక్ చేసుకోండిలా!

Published : February 21, 2026 at 10:44 AM IST
LPG Gas Cylinder Expiry Date Check : ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అయితే, ఎక్కడో ఒకచోట అరుదుగా "సిలిండర్ పేలుడు" ఘటనలు చోటు చేసుకుంటాయి. దీనికి వినియోగదారులు చేసే కొన్ని పొరపాట్లే కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా సిలిండర్లకు ఉండే గడువు తేదీని తెలుసుకోవాలని, గ్యాస్ పైపు విషయంలో కొన్ని సూచనలు పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ, గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ఎలా గుర్తించాలి? తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
సిలిండర్ ఎక్స్పైరీ డేట్ గుర్తించండిలా..
నార్మల్‌గా మనలో చాలా మంది సిలిండర్ తీసుకునేటప్పుడు గ్యాస్ లీక్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. లేదంటే దాని బరువునూ తనిఖీ చేస్తారు. కానీ, గడువు తేదీని మాత్రం ఎప్పుడూ చూడరు. ఇకపై సిలిండర్ తీసుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా గడుపు తేదీ కూడా చెక్ చేసి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
సిలిండర్ పైభాగంలో గుండ్రటి హ్యాండిల్‌కు అనుబంధంగా మూడు ప్లేట్స్ ఉంటాయి. వాటిలో ఒక దానికి లోపలి వైపున పత్యేకమైన కోడ్ రాసి ఉంటుంది. అది A, B, C, D అనే వాటిల్లో ఏదో ఒక అక్షరం ఉండి పక్కన సంఖ్య కలిగి ఉంటుంది. అక్కడున్న ఒక్కో ఆంగ్ల అక్షరంతో ఏడాదిలోని మూడు నెలలను సూచిస్తారు. దాని పక్కనున్న సంఖ్య సంవత్సరాన్ని పేర్కొంటుంది. సిలిండర్ మీద A ఉంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అని అర్థం. అదే, B ఉంటే ఏప్రిల్ టూ జూన్, C ఉంటే జులై టూ సెప్టెంబర్, D ఉంటే అక్టోబర్ టూ డిసెంబర్.
ఉదాహరణకు మీరు తీసుకున్న సిలిండర్ మీద "A-27" అని రాసి ఉంటే దాని గడువు తేదీ 2027వ సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్యలో ముగుస్తుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో గడువు ముగిసిన సిలిండర్ ఉంటే వెంటనే డీలర్‌కు కాల్ చేసి రిటర్న్ ఇచ్చేయడం మంచిదని సూచిస్తున్నారు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్చితే రూ.25 వేల బహుమతి - ఈ ప్రభుత్వ స్కీమ్ తెలుసా?
గడువు తేదీ ఎందుకు రాస్తారంటే?
సిలిండర్‌పై రాసిన ఆ తేదీని టెస్టింగ్ డేట్‌గా పేర్కొంటారు. అంటే, A-28 ఉందనుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మూడు నెలల్లో సిలిండర్‌ను టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లో ఒకవేళ సిలిండర్ పాస్ అయినట్లయితే దానిలో మళ్లీ గ్యాస్ రీఫిల్ చేస్తారు. లేకపోతే ఆ సిలిండర్‌ను పక్కన పెట్టేస్తారు.
పైప్ విషయంలో నిర్లక్ష్యం వద్దు :
గ్యాస్ సిలిండర్స్ పేలకుండా ఉండడంలో మనం వాడే పైపులు కూడా కీలకంగా ఉంటాయి. కొంతమంది తక్కువ రేట్‌కు వస్తున్నాయని క్వాలిటీ లేని పైప్స్, రెగ్యులేటర్స్‌ను కొని వాడుతుంటారు. అలాంటి వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందంటున్నారు. క్వాలిటీ తక్కువవి వాడడం వల్ల అవి చాలా త్వరగా క్రాక్స్ ఇస్తాయి. అలా పగుళ్లు వచ్చిన వాటి నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే BIS హాల్‌మార్క్ ఉన్న రెగ్యులేటర్స్, పైప్స్‌ని వాడడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు ఏ రిటైలర్ దగ్గరైతే గ్యాస్ కొంటున్నారో వాళ్ల దగ్గరే వీలైనంత వరకు పైప్స్, రెగ్యులేటర్స్ కొంటే చాలా బెటర్ అంటున్నారు.
అనుమానం వస్తే ఇలా చేయండి :
గ్యాస్ లీక్ అయినట్లు వాసన వస్తుంటే కరెంట్ బోర్డ్ స్విచ్ఛులు ఆన్ లేదా ఆఫ్ చేయకూడదు
అగ్గిపుల్ల వెలిగించడం అస్సలు చేయొద్దు. ఈ పొరపాటు వల్ల ఆ స్విచ్ఛెస్ నుంచి వచ్చే చిన్న స్పార్క్ ఇల్లు మొత్తం పేలిపోవడానికి కారణం కావొచ్చు
గ్యాస్ లీక్ అవుతుందని అనిపించగానే వెంటనే ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ ఓపెన్ చేసి బయటకు వచ్చేయడం ఉత్తమం
8800001915 నెంబర్‌కు Hi పెట్టండి - వాళ్లే చూసుకుంటారు!
మీ బండికి ఈ "క్యూఆర్ కోడ్" అంటించారా? - ఎమర్జెన్సీ మొదలు ఎన్నో అవసరాలు తీరుస్తుంది!

