ETV Bharat / offbeat

ట్రెయిన్ రిజర్వేషన్ టికెట్ వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు - ఎలా సాధ్యమంటే!

రైల్వే రిజర్వేషన్ టికెట్​లో పేరు మార్చుకోవచ్చు - ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా?

name_change_in_railway_ticket
name_change_in_railway_ticket (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 10:38 AM IST

2 Min Read
Choose ETV Bharat

Name Change in Railway Reservation Ticket : ముందస్తు రిజర్వేషన్ టికెట్‌ను మరొకరి పేరిట బదిలీ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఎన్నాళ్లుగానే ఎదురు చూస్తున్న ఈ మార్పుపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముందుగా బుక్ చేసుకున్న టికెట్ లో మార్పులు చేయాలంటే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అనే వివరాలు తెలుసుకుందాం.

ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? - ఈ ఆప్షన్ ఎంచుకుంటే బెర్త్ ఖాయం!

సిటీ బస్సుల్లో మాదిరిగా అప్పటికప్పుడు రైళ్లలో ప్రయాణించాలంటే కష్ట సాధ్యమే. ఎందుకంటే, సుదూర ప్రయాణాలు సాగించే రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ విధానం ఉంటుంది. గతంలో ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే వీలుండగా, ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యం, రైల్వే శాఖ ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో 60రోజులకు కుదించారు.

మూడు నెలల ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవడం వల్ల చాలా వరకు క్యాన్సిల్ అవుతున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. టికెట్ మార్పునకు అవకాశం లేకపోడం, క్యాన్సిలేషన్ చేసుకున్న వారికి డబ్బు సగానికి పైగా తిరిగి రాకపోవడం సమస్యగా ఉండేది. అదీగాక కొత్తగా బుక్ చేసుకునే వారికి టికెట్ దొరక్క రైళ్లు ఖాళీగా ప్రయాణించేవి. ఈ నేపథ్యంలో టికెట్ మార్పునకు అవకాశం కల్పించడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు.

అయితే, పూర్తి స్థాయిలో ఇలాంటి అవకాశాన్ని కల్పించడం వల్ల చాలా మంది దీనిని వ్యాపారంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. పండుగలు, ఇతర సెలవు రోజుల్లో టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకునే బ్లాక్ లో విక్రయించి సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి. దీంతో ఇది మరింత ఇబ్బంది కరం కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ మార్చుకోవడంపై రైల్వే శాఖ కొన్ని షరతులు విధించింది.

టికెట్​ను తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు, కుమార్తె, కుమారుడు లేదా దంపతుల మధ్య మాత్రమే మార్పిడికి అవకాశం కల్పించారు. దీనిని అధికారులతో ధ్రువీకరించిన తర్వాత మాత్రమే టికెట్ మార్పిడికి అవకాశం ఉంటుంది.

మీరు టికెట్ రిజర్వ్ చేసుకుని ప్రయాణించలేకపోతే రిజర్వేషన్ కార్యాలయం చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్​ను సంప్రదించాలి. షెడ్యూల్ ప్రకారం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందే దరఖాస్తును సమర్పించాలి. అలా మీకు రిజర్వ్ చేసిన టిక్కెట్​ను మరొకరికి ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు.

సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ టికెట్‌లో పేరు మార్పును అనుమతించే అధికారాన్ని కలిగి ఉన్నారు.

ఈ అవకాశం ప్రయాణికులకు మాత్రమే కాకుండా విధుల్లో భాగంగా ప్రయాణించే ఉద్యోగులకు అందుబాటులో ఉంది. వైజ్ఞానిక ప్రదర్శనకు వెళ్తున్న విద్యార్థుల సమూహం, శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల బృందం, పెళ్లి బృందాలు గ్రూపుగా బుక్ చేసుకున్న టిక్కెట్లలో 10శాతం వరకు మార్చుకునే అవకాశం ఉంది. రైలు బయల్దేరడానికి ముందుగా అధికారులను సంప్రదించాలి. అయితే, వృద్ధులు, దివ్యాంగుల కోటాలో రిజర్వ్ చేసుకున్న టికెట్ల మార్పిడికి అనుమతించరు.

మలయాళీల "కేరళం" - అనేక రాష్ట్రాలు పేరు మార్చుకున్నాయని తెలుసా?

ఏటీఎం కార్డుపై రూ.20లక్షలు! - ఉచితంగా బీమా​ ఉందని మీకు తెలుసా?