రాత్రిపూట ఈ 'పొరపాట్లు' చేస్తున్నారా? - విడాకులకు కారణం కావొచ్చు జాగ్రత్త!
దాంపత్య బంధం బలపడాలా? - అయితే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 19, 2026 at 3:50 PM IST
Habits to Improve Relationship : నేటి రోజుల్లో చాలా మంది ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో రోజంతా ఆఫీస్ టెన్షన్లు, ఇంటికొచ్చాక కుటుంబ బాధ్యతలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. చివరకు పడకగదిలోకి వచ్చాక కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఎవరి ఫోన్లలో వారు మునిగిపోతున్నారు. ఇదే దంపతుల మధ్య ఉన్న అన్యోన్యతను, అనుబంధాన్ని దెబ్బతీస్తుందంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఈ కాలంలో విడాకులకు కారణం అవుతోన్న అంశాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. మరి, పరిస్థితి ఇక్కడి వరకు రాకూడదంటే రాత్రి నిద్రించే టైమ్‌లో జంటలు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమంటున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇలా చేస్తున్నారా?
- దాంపత్య బంధం బలపడాలంటే రోజూ ఇద్దరూ కలిసి కాస్త సమయం గడపడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలా మందికి డే మొత్తం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల ఆ తీరిక దొరకట్లేదనే చెప్పాలి. పోనీ కనీసం రాత్రి అయినా కాసేపు ప్రేమగా కబుర్లు చెప్పుకొంటారా అంటే అదీ గగనమే! ఇందుకు రోజూ రాత్రి పడుకునే సమయంలో చేసే కొన్ని పొరపాట్లే కారణమని చెబుతున్నారు.
- ఈ కాలపు జంటలలో చాలా మంది పడుకునే టైమ్‌లో సోషల్ మీడియాలో చాటింగ్, ఆఫీస్ పని అంటూ ల్యాప్టాప్స్, మొబైల్స్‌తో ఎక్కువగా గడిపేస్తున్నారు. ఇలాంటి లైఫ్‌స్టైల్‌ను ఫాలో అవ్వడం వల్ల భార్యాభర్తలిద్దరూ కలిసి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకునే ఛాన్స్ లేకుండా పోతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఆయా గ్యాడ్జెట్ల నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్ర నాణ్యతను తగిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి, చిరాగ్గా అనిపించడం, ఎదుటివారిపై ఈ ఫీలింగ్స్ చూపించడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత క్రమంగా దెబ్బతింటుందంటున్నారు.
- జాబ్స్ చేసే భార్యాభర్తల్లో ఎక్కువమంది పని వేళలు కుదరక ఇబ్బంది పడుతుంటారు. ఒకరికి రోజంతా ఆఫీస్ ఉంటే, మరొకరికి నైట్ షిఫ్టులు ఉండవచ్చు. లేదంటే పని పూర్తి చేసుకొని రాత్రుళ్లు ఇంటికి చేరుకునే సరికి లేట్ అవ్చొచ్చు. దీనివల్ల పడుకునే వేళలు, నిద్ర లేచే సమయాల్లోనూ ఇద్దరికీ పొంతన కుదరకపోవచ్చు. ఇదీ దంపతుల మధ్య గ్యాప్ పెరిగేలా చేస్తుందంటున్నారు నిపుణులు.
- ఉద్యోగరీత్యా నిద్రించే వేళలు వేర్వేరుగా ఉంటున్నాయని కొందరు, పిల్లలు ఉన్నారన్న కారణంతో మరికొందరు విడివిడిగా పడుకుంటుంటారు. ఇదే రొటీన్‌గా మారిపోతే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లోపించి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండకపోవచ్చంటున్నారు.
- నైట్ టైమ్‌లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా దాంపత్య బంధంలో సాన్నిహిత్యం దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే బద్ధకం వల్లో, నిర్లక్ష్యం వల్లో ఇది అలవాటుగా మారితే మాత్రం మార్చుకోవాలని చెబుతున్నారు.
- చాలా జంటలకు ఖాళీ టైమ్ దొరికేదే రాత్రిపూట. అప్పుడు కూడా ఎడమొహం-పెడమొహంగా వ్యవహరించడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందంటున్నారు. ఇది ఇద్దరినీ మానసికంగా కూడా విడదీస్తుందంటున్నారు నిపుణులు.
యువత పెళ్లికి భయపడడానికి కారణాలివే! - సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!
బంధాన్ని బలపరిచే అలవాట్లు!
- దాంపత్య బంధాన్ని దెబ్బతీసే ఇలాంటి అలవాట్లను మార్చుకున్నప్పుడే పెరిగిన దూరాన్ని తిరిగి తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- నిద్రకు ఉపక్రమించే టైమ్‌లో గ్యాడ్జెట్లతో సమయాన్ని వృథా చేయకూడదు. ఆ టైమ్‌ను దంపతులిద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి, హాయిగా నవ్వుకోవడానికి కేటాయిస్తే మనసు తేలికపడుతుంది. అలాగే, ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుందని సూచిస్తున్నారు.
- భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ గొడవలు కామన్. కొందరు వాటిని పరిష్కరించుకోకుండా ఆ కోపంతోనే రాత్రిపూట మంచమెక్కేస్తుంటారు. దీనివల్ల కూడా ప్రశాంతత దెబ్బతింటుందంటున్నారు. అందుకే పడుకునే ముందు ఏ చిన్న సమస్యైనా సరే పరిష్కరించుకోవాలంటున్నారు. అప్పుడే తిరిగి కలిసిపోవచ్చంటున్నారు నిపుణులు.
- మన జీవితంలో చిన్న ఆలోచనలే మార్పు తెస్తాయన్నట్లు, చేతల ద్వారా మనం వ్యక్తం చేసే భావాలే మన మనసులోని ప్రేమను భాగస్వామికి తెలిసేలా చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి రాత్రి పడుకునే టైమ్‌లో ప్రేమగా ఓ ముద్దూ, ఓ హగ్గూ ఇవ్వడం వంటివి అలవాటుగా మార్చుకోమంటున్నారు. ఫలితంగా శరీరంలో 'ఆక్సిటోసిన్' అనే లవ్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుందంటున్నారు.
- కొన్ని జంటలు పిల్లల వల్ల కూడా నైట్ టైమ్ ఏకాంతంగా గడపలేకపోతాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే, చిన్నప్పటి నుంచే వాళ్లను వేరే రూమ్‌లో పడుకోబెట్టడం మేలు అంటున్నారు నిపుణులు.
రోడ్డు పక్కన, చెట్ల కింద 'కారు' పార్క్ చేస్తున్నారా? - మీ జేబుకు చిల్లు పడటం ఖాయం!
చిన్నపాటి నిర్లక్ష్యం, జీవితకాల విషాదం! - ప్రయాణాల్లో ఈ 'తప్పులు' అస్సలు చేయకండి!

