ETV Bharat / offbeat

"వర్షం" సినిమా చూస్తారా?

- వానలు ఎలా కురుస్తాయో మీకు తెలుసా? - "హైడ్రోలాజికల్ సైకిల్" పూర్తివివరణ చాలా ఈజీగా అర్థం చేసుకోండి!

Rain
Rain (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2026 at 2:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

"వర్షం ఎలా కురుస్తుంది?"

"ఇంకెలా? దేవుడు కురిపిస్తాడు!" ఇప్పటికీ చాలా మంది దీన్నే నమ్ముతారు

"వర్షం ఎలా కురుస్తుంది?"

"మేఘాల ద్వారా.." కొందరికి ఇంతవరకే తెలుసు

"వర్షం ఎలా కురుస్తుంది?"

"Hydrological Cycle ద్వారా" చాలా తక్కువ మందికే ఇది తెలుసు. మరి మీకు తెలుసా?

"లేదు" అంటే.. ఈ వర్షం సినిమా చూసేయండి!

సామాన్యలకు సరిగా అర్థం కాని పరిశోధనలు, సైంటిఫిక్​ పదాలతో కాకుండా.. చాలా సింపుల్​గా ఈ హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా తెలుసుకుందాం.

సూర్యుడి వేడి కారణంగా సముద్రాలు, నదులు, చెరువుల్లోని నీరు వేడెక్కి, ఆవిరిగా మారుతుంది. చెట్లు, మొక్కలు కూడా తమ ఆకుల ద్వారా అదనపు వాటర్​ను ఆవిరి రూపంలో గాల్లోకి రిలీజ్ చేస్తాయి. దీన్నే 'ట్రాన్స్‌పిరేషన్' అంటారు.

మేఘాలు
మేఘాలు (Getty Images)

ఈ నీటి ఆవిరి చాలా తేలికగా ఉంటుంది. తేలికైన వస్తువులు గాల్లో తేలిపోతాయి కదా. అలా నీటి ఆవిరి కూడా పైకి వెళ్తూ పోతుంది. నేల మీద ఉన్న గాలి ఆవిరిని పైకి నెడుతూ ఉంటుంది. అలా ఆవిరి ఎంత దూరం వెళ్తుంది అనేదానికి ప్రత్యేకమైన కొలతలు​ ఏమీ ఉండవు.

భూమ్మీద నుంచి పైకి వెళ్తున్నకొద్దీ వాతావరణం చల్లగా మారిపోతూ ఉంటుంది. ఆ చల్లదనం పెరిగేకొద్దీ ఆవిరి అనేది నీటి బిందువులుగా మారుతూ ఉంటుంది. మనం ఫ్రిజ్​లో వాటర్​ పెడితే చల్లదనానికి గడ్డకడతుంది కదా.. ఇదే విధంగా ఆవిరి గడ్డకడుతూ వెళ్తుంది.

ఎవరెస్ట్​ ఎక్కడమంటే.. చావుకు ఎదురెళ్లడమే! - ఎందుకంత డేంజర్?

గాలిలో దుమ్ము, ధూళీ కూడా ఉంటుంది కదా? ఆ ధూళి కణాలు ఈ నీటి బిందువులకు అతుక్కుపోతాయి. అవే మనకు కనిపించే మేఘాలు అన్నమాట!

ఇప్పుడు ఈ మేఘాల నుంచి వర్షం ఎలా పడుతుందో చూద్దాం. ఉదాహరణకు మనం నీళ్లలో వేలు ముంచి, గోడ మీద ఒక నీటి బిందువును ఉంచామనుకోండి. అది తొణుకుతూ ఉంటుంది. దాన్ని ఆనుకునేంత దగ్గరగా మరొక నీటి బిందువును పెట్టామనుకోండి ఏమవుతుంది? మెల్లగా అవి రెండూ కలిసి ఒకటే పెద్ద బిందువుగా మారుతాయి. ఈ సమయంలో ఇంకో బిందువును కూడా యాడ్ చేస్తే? బరువు ఎక్కువై ఆ పెద్ద నీటి చుక్కగా మారిపోయి కిందకు జారిపోతుంది.

మేఘాలలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. గడ్డకట్టిన అతి చిన్నచిన్న నీటి కణాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతుంటాయి. అలా నీటి బిందువులు బరువెక్కుతుంటాయి. ఆ బరువెక్కిన నీటి బిందువులను భూమి గురుత్వాకర్షణ శక్తి కిందకు లాగుతూ ఉంటుంది. అలా మేఘాలు చాలా చాలా నెమ్మదిగా కిందపడుతూనే ఉంటాయి. కానీ గాలి వాటిని పైకి నెడుతూ ఉంటుంది. ఈ విధంగా గ్రావిటీ, ఎయిర్​ ప్రెజర్ మధ్య నడుస్తున్న ఒత్తిడి కారణంగానే.. మేఘాల రూపంలో నీటి బిందువులు ఆకాశంలో తేలియాడుతూ ఉంటాయి. గాలి తీవ్రతను బట్టి అటూ ఇటూ ప్రయాణిస్తుంటాయి. ఇదంతా నిత్యం జరిగే ప్రక్రియ.

ఈ క్రమంలో ఎప్పుడైతే నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలుస్తూ మరింతగా బరువు పెరుగుతాయో.. వాటి బరువు ఎక్కువై, గాలి పైకి నెట్టలేని పరిస్థితి ఏర్పడుతుందో.. అప్పుడు గురుత్వాకర్షణ శక్తి గెలిచి ఆ బిందువులు నేలమీదకు పడిపోవడం మొదలవుతుంది. అదే వర్షం!

చిన్న సారీ చెబితే రూ.5 వేలు! - పెద్ద సారీ చెబితే రూ.15 వేలు!!