ETV Bharat / offbeat

చేపలు నీటిలో ఊపిరాడక చనిపోతాయా? - అడుగున ఏం జరుగుతుంది?

చేపలకు నీళ్లలోనూ ప్రమాదాలెన్నో - వేసవిలో జలచరాలకు మరింత ఇబ్బంది!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 4:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

Fish gills : చేపలు ఒడ్డున పడితే ఊపిరాడక చనిపోతాయని తెలుసు కానీ, నీళ్లలోనూ అవి ఆక్సిజన్ అందని పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఇది విచిత్రంగా అనిపించినా వాస్తవమే అని నిపుణులు చెప్తున్నారు. చాలా సందర్భాల్లో నీళ్లలో ఉన్న చేపలు వందలు, వేలల్లో మృతి చెందడాన్ని ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. అక్వేరియంలో ఈదే చేపలు పలుమార్లు ప్రాణభయంతో నీటి ఉపరితలంపైకి దూసుకువస్తాయి. మనుషుల మాదిరిగా చేపలు ఈత రాకుండా మునిగిపోయే అవకాశాలు లేవు కానీ, అవి శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

కేవలం నీరు మాత్రమే సరిపోదు

చేపలు నీళ్లలో దాగి ఉన్న ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. ప్రవహించే నీటి నుంచి కరిగిన ఆక్సిజన్‌ను మొప్పలు గ్రహించి రక్తప్రవాహంలోకి పంపిస్తాయి. ఈ క్రమంలో నీళ్లలో ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు నీటి అడుగున అలజడి మొదలవుతుంది. దీంతో చేపలు తరచుగా ఆక్సిజన్ కొద్దిగా ఎక్కువగా ఉండే ఉపరితలం వైపు పైకి వస్తాయి. చాలా మంది దీనిని ఆకలి లేదా వింత ప్రవర్తనగా పొరబడతారు. కానీ, ప్రాణ వాయువు కోసం చేపలు చేసే ప్రయత్నం. ఉష్ణోగ్రత పెరిగినపుడు చెరువులు, కలుషితమైన నదుల్లో ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పడిపోతుంది. పై నుంచి చూస్తే నీరు సాధారణంగా కనిపించినప్పటికీ అడుగున చేపలు ఊపిరి పీల్చుకోవడానికి పోరాడుతూ ఉంటాయట.

ఈ అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? - ఏం ఆలోచిస్తున్నారంటే!

మొప్పల నిశ్శబ్ద వైఫల్యం

చేపల మొప్పలు నీళ్లలో ఆక్సిజన్ అందించడానికి రూపొందించిన సున్నితమైన అవయవాలు. నీళ్లు కలుషితమైనపుడు మురుగు పేరుకుపోయినా, రసాయనాలు కలిసినా మొప్పలు దెబ్బతిని ఆక్సిజన్ అందదు. ఇదిలా ఉంటే కొన్ని జాతుల చేపలు నిరంతరం ఈదుతూ ఉండాలి. తద్వారా నీరు వాటి మొప్పల లోపలికి వెళ్లి ఆక్సిజన్ ఫిల్డర్ అవుతుంది. ఈదడం ఆగిపోయిన మరుక్షణంలో శ్వాస తీసుకోవడం వాటికి కష్టమవుతుంది. అందుకే సొరచేపలు ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోలేవు. రోజులో ప్రతి సెకను శుభ్రమైన, ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న నీటిపైనే ఆధారపడి ఉంటుంది.

వెచ్చని నీరు ఎందుకు ప్రమాదకరం?

చల్లని నీటి కంటే వెచ్చని నీటిలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినపుడు, వేడిగాలుల సమయంలో నదులు, సరస్సుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతాయి. చేపలు నీటి అడుగున ఉన్నప్పటికీ నెమ్మదిగా ఊపిరాడక చనిపోతుంటాయి. అందుకే వేసవిలో తరచూ భారీ సంఖ్యలో చేపలు చనిపోవడం తెలిసిందే. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నీటి అడుగున ఉన్న జీవావరణ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రశాంతంగా కనిపించే సరస్సు ఆక్సిజన్ తక్కువైతే అదే ఓ విపత్తుగా మారిపోతుంది.

నీటి బయట ప్రమాద వేగం ఎక్కువ

నీటిలో తెరచుకునే మొప్పలు బయటి వాతావరణంలో వెంటనే ముడుచుకుపోతాయి. అవి ఒకదానికొకటి అతుక్కుపోయి పనిచేయవు. అందుకే చేపలు నీటి బయట త్వరగా ఊపిరాడక చనిపోతాయి. కొన్ని రకాల చేపలు మాత్రమే బయటి వాతావరణంలోనూ ఎక్కువ కాలం జీవిస్తాయి. కొరమేను, క్యాట్ ఫిష్ వంటివి భూమిపై కొన్ని గంటల పాటు బతికే ఉంటాయి.

'నా కారు నా ఇష్టం' అంటే కుదరదు! - అదనపు హంగులుంటే 'ఫైన్' కట్టాల్సిందే!

రైలు ప్రయాణం పెట్టుకున్నారా? - భారీగా రైళ్ల దారి మళ్లింపు, వేళల్లో మార్పులు!