ETV Bharat / offbeat

'హౌస్ క్లీనింగ్' పెద్ద టాస్క్ - ముందే ఇలా జాగ్రత్త పడండి!

ఇంట్లోకి దుమ్ము, ధూళి చేరిక - ఈ టిప్స్ పాటిస్తే అడ్డుకట్ట వేయొచ్చు!

హౌస్ క్లీనింగ్
హౌస్ క్లీనింగ్ (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 10, 2026 at 2:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

HOUSE CLEANING TIPS AND TRICKS : ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా దుమ్ము, ధూళి పేరుకుపోతోందా? చిన్నచిన్న తప్పిదాల వల్లే అలా జరుగుతుంది. ఇంట్లో దుమ్మును పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, అది ఎక్కువగా పేరుకుపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటంటే.

తలుపులు, కిటికీలు మూసి ఉన్నా వాటి ఫ్రేమ్స్, గోడల మధ్య ఉండే చిన్న ఖాళీల ద్వారా దుమ్ము లోపలికి వచ్చేస్తుంది. ముందుగా తలుపులు, కిటికీల చుట్టూ ఖాళీలు కనిపిస్తే తగిన వెదర్ స్ట్రిప్పింగ్, సీలెంట్ ఉపయోగించి వాటిని మూసేయాలి. దీనివల్ల దుమ్ముతో పాటు తేమ, చిన్న కీటకాలు లోపలికి రావడాన్ని అడ్డుకోవచ్చు.

చెప్పులు, బూట్ల అడుగు భాగాలకు అంటుకుని మట్టి, ధూళి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బయట, లోపల రెండు డోర్ మ్యాట్లు ఉంచాలి. బయట నుంచి వచ్చిన వెంటనే బూట్లు శుభ్రం చేసుకోవడంతో పాటు వీలైనంత వరకు వాటిని ఇంటిలోపలకు తీసుకురాకుండా చూసుకోవాలి.

  • పెంపుడు జంతువుల ద్వారా దుమ్ము ఇంట్లోకి వస్తుంది. కుక్కలు, పిల్లలు బయట తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు వాటి పాదాల ద్వారా దుమ్ము, మట్టి రావచ్చు. అందుకే బయట నుంచి వచ్చిన తర్వాత వాటి పాదాలను శుభ్రం చేయడంతో పాటు అవి పడుకునే పరుపులు, మ్యాట్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి.
హౌస్ క్లీనింగ్
హౌస్ క్లీనింగ్ (Getty images)
  • ఎప్పుడూ ఫర్నిచర్, అల్మరాలు మాత్రమే కాకుండా సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నిచర్ వెనక, కింది భాగాలను కూడా శుభ్రం చేస్తుండాలి.
  • సోఫా కుషన్లు, మ్యాట్లు, బెడ్ షీట్లు, కార్పెట్లలో ఎక్కువగా దుమ్ము చేరే అవకాశం ఉన్నందున బెడ్ షీట్లను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతకడం, కార్పెట్లు, సోఫాలను వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయడం మంచిది.
  • ఏసీ, ఎయిర్ ఫిల్టర్లలో ఎక్కువగా దుమ్ము పేరుకుపోతే గాలి ప్రవాహంతో దుమ్ముకణాలు తిరిగి ఇంట్లోకి వచ్చేస్తాయి.
  • ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసేటప్పుడు ముందుగా సీలింగ్ ఫ్యాన్లు, లైట్లు, షెల్ప్ క్లీన్ చేయాలి.
  • ఆ తర్వాత టీపాయ్, టీవీ వంటి ఫర్నిచర్ తుడిచి, చివరిగా నేలను తుడవాలి.
హౌస్ క్లీనింగ్
హౌస్ క్లీనింగ్ (Getty images)
  • కిటికీలకు సన్నని 'యాంటీ డస్ట్ నెట్/మెష్' బిగించడం ద్వారా ఇంట్లోకి దుమ్ము రాకుండా అడ్డుకోవచ్చు.
  • రోడ్డు వైపు ఉండే కిటికీలకు మందపాటి తెరలు వాడటం మంచిది.
  • గాలిలో ఉండే సన్నని ధూళి కణాలను తగ్గించడానికి గదిలో ఎయిర్ ప్యూరిఫయర్ ఉపయోగించడం మంచిది.
  • కొన్ని రకాల ఇండోర్ మొక్కలు గాలిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
  • తలుపులకు డోర్ బాటమ్ సీల్స్, సిలికాన్ బ్రష్లను అమర్చడం వల్లిల ఖాళీల నుంచి గాలితో పాటు దుమ్ము ఎక్కు వగా వస్తుంది.
  • ఎయిర్ ప్యూరిఫయర్లు వినియోగించడం మేలు. గాలిలో ఉండే దుమ్ము, పుప్పొడి వంటి కణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు.

మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలా? - ఈ స్మార్ట్ అలవాట్లు ఫాలో అవ్వాల్సిందే!

'సమస్యను పక్కవాళ్లకు చెప్పడం కాదు' - సరైన పరిష్కారం కోసం సూపర్ టిప్స్!