ETV Bharat / offbeat

హోటల్ స్టైల్ "టమోటా ఉప్మా" - ఇలా చేస్తే వద్దన్నవారే ఇష్టంగా తింటారు!

ఉప్మా ఓసారి ఇలా ట్రై చేయండి - ఒక్కసారి తింటే రుచి మరచిపోరంతే!

Tomato Upma
Tomato Upma (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 5:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hotel Style Tomato Upma : ఉప్మాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చాలా మందికి ఇదంటే అస్సలు నచ్చదు. అలాంటి వారందరికీ ఓసారి ఈ స్టెప్స్ పాటిస్తూ హోటల్ స్టైల్లో టమోటా ఉప్మా చేసి పెట్టారంటే వద్దన్నవారే ఇష్టంగా తింటారు. కొత్తగా చేసే వారు కూడా ఈ రెసిపీని చాలా సింపుల్​గా తయారు చేయొచ్చు. మరీ దీనిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

పసందైన "బాదం లడ్డూలు" - కమ్మగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

Tomato Upma
బొంబాయి రవ్వ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - 4 కప్పులు
  • పల్లీలు - 8 టేబుల్ స్పూన్లు
  • టమోటాలు - 12
  • ఆయిల్ - సరిపడా
  • జీడిపప్పు - 8 టీ స్పూన్లు
  • శనగపప్పు - 4 టీ స్పూన్లు
  • ఆవాలు - 2 టీ స్పూన్లు
  • ఉల్లిపాయలు - 4
  • మినపప్పు - 4 టీ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 8
  • అల్లం తరుగు - 2 టీ స్పూన్లు
  • కరివేపాకు - కొంచెం
  • పసుపు - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - 4 టీ స్పూన్లు
  • కొత్తిమీర - కొంచెం
Tomato Upma
టమోటాలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా 12 టమోటాలు, నాలుగు ఉల్లిపాయలు, ఎనిమిది పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్​ చేసి పాన్​లో 8 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మూడు నిమిషాల పాటు వేయించాలి.
Tomato Upma
పచ్చిమిర్చి (Getty Images)
  • పల్లీలు దోరగా వేగాక ఎనిమిది టీ స్పూన్ల ఆయిల్, ఎనిమిది టీ స్పూన్ల జీడిపప్పు యాడ్ చేసి కలుపుతూ వేగనివ్వాలి. ఇందులోనే రెండు కప్పుల బొంబాయి రవ్వు వేసి మరో మూడు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇదే పాన్​లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు టీ స్పూన్ల శనగపప్పు, నాలుగు టీ స్పూన్ల మినపప్పు, రెండు టీ స్పూన్ల ఆవాలు వేసి వేయించాలి.
Tomato Upma
జీడిపప్పు (Getty Images)
  • ఈ మిశ్రమం వేగాక తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి మగ్గించాలి. ఆనియన్స్ వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రెండు టీ స్పూన్ల అల్లం తరుగు వేసి బాగా ఫ్రై చేయాలి.
  • అనంతరం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి మధ్యమధ్యలో కలుపుతూ మూడు నిమిషాల పాటు వేయించాలి. టమోటా ముక్కలు మగ్గి సాఫ్ట్​గా అయ్యాక ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేయాలి.
Tomato Upma
కరివేపాకు (Getty Images)
  • ఆ తర్వాత ఈ మిశ్రమంలో 12 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మరిగించాలి. ఈ మిశ్రమం మరుగుతున్నప్పుడు వేయించిన రవ్వ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి.
  • ఇందులోనే నాలుగు టీ స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే హోటల్ స్టైల్​ టమోటా ఉప్మా మీ ముందుంటుంది!

కరకరలాడుతూ నోరూరించే "బీరకాయ గారెలు" - అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేస్తారు!

కమ్మని "బొప్పాయి కూర" - ఒక్కసారి తింటే మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది!