ETV Bharat / offbeat

'వావ్' అనిపించే "ఉలవల కారం పొడి" - ఇడ్లీ, దోసెలతో పాటు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

ఉలవలతో కారం పొడి ఇలా ట్రైచేయండి - ఎప్పుడంటే అపుడు టేస్ట్ చేయొచ్చు!

ulavala_karam-podi
ulavala_karam-podi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 2:17 PM IST

2 Min Read
Choose ETV Bharat

ULAVALA KARAM PODI : టిఫిన్లు, వేడి వేడి అన్నంలోకి కారం పొడి వేసుకుని కాస్త నెయ్యి కలిపి తింటుంటే ఎంతో కమ్మగా ఉంటాయి. ఇడ్లీ, దోసెల్లాంటి వాటిల్లోకి ఇవి చాలా బాగుంటాయి. అయితే, ఎప్పుడూ ఒకే రకమైన కారం పొడి కాకుండా ఓ సారిలా ఉలవల కారం పొడి ట్రై చేసి చూడండి. ఉలవల టేస్ట్ మిస్సవుతున్నాం అనుకునే వారు ఈ టేస్ట్ కు ఫిదా అయిపోతారు.

నోరూరించే "వంకాయ, బంగాళాదుంప ఫ్రై" - చపాతీ, అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది!

ulavala_karam-podi
ulavala_karam-podi (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • మినపగుండ్లు - అర కప్పు
  • పచ్చి శనగపప్పు - అర కప్పు
  • ఉలవలు - అర కప్పు
  • ఎండు మిర్చి - 15 (ఘాటుకు సరిపడా)
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • చింతపండు - కొద్దిగా
  • బెల్లం - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - అర స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 6 నుంచి 8
ulavala_karam-podi
ulavala_karam-podi (Getty images)

ఈ స్టెప్స్ ఫాలో చేయండి :

  • స్టెప్ 1 : ముందుగా ప్యాన్​లో పప్పులు వేయించి తీసుకోవాలి.
  • స్టెప్ 2 : కారానికి సరిపడా ఎండు మిర్చి కూడా వేయించాలి.
  • స్టెప్ 3 : అన్నింటినీ కలిపి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేయాలి.
ulavala_karam-podi
ulavala_karam-podi (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​పై ప్యాన్ పెట్టుకుని అర కప్పు మినపగుండ్లు, లేదా మినప్పప్పు సన్నటి మంటపై వేయించాలి. వేయించిన పప్పు ప్లేట్​లోకి తీసుకుని అదే ప్యాన్​పై శనగపప్పు కూడా సన్నటి మంటపై వేయించి తీసుకోవాలి. ఇపుడు ఉలవలు కూడా వేసుకుని సన్నటి మంటపై మాడిపోకుండా వేయించాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేయించి చల్లార్చి మిక్సీలోకి తీసుకోవాలి.
ulavala_karam-podi
ulavala_karam-podi (Getty images)
  • కొద్దిగా చింతపండు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేశాక ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మినప్పప్పు, శనగపప్పు, ఉలవలు కూడా వేసుకోవాలి. మొత్తం ఒకే సారి కాకుండా పల్స్ ఇస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ ఇస్తూ మరో సారి గ్రైండ్ చేయాలి.
ulavala_karam-podi
ulavala_karam-podi (Getty images)
  • ఇలా రెడీ చేసుకున్న ఈ పొడి గిన్నెలోకి తీసుకోవాలి. వేడి తగ్గిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ కారం పొడితోపాటు కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. 'ఉలవచారు టేస్ట్ మిస్సవుతున్నాం' అనుకునే వాళ్ల ఓ సారి ఇలా ఉలవల కారం పొడి చేసి పెట్టుకుంటే ఆ లోటు తీరినట్టే!

అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!

జొన్నపిండితో "ఇడ్లీలు" - సూపర్​ సాఫ్ట్​గా ఉంటాయి - ఇన్​స్టంట్​గా చేసుకోవచ్చు!