పిండి మిల్లు దగ్గర నిలబడే పని లేదు - ఈ మెషిన్‌తో ఇంట్లోనే నచ్చిన 'పొడి పిండి' రెడీ!
పండగ పూట గిర్నీల చుట్టూ తిరగడం ఇబ్బందిగా ఉందా? - ఇంట్లోనే పిండి మరతో రుచికరమైన వంటలు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2026 at 3:52 PM IST
Home Flour Mill : ఏదైనా పండుగ వస్తుందంటే చాలు ఇల్లంతా పిండివంటల ఘుమఘుమలతో నిండిపోతుంది. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో చాలా మంది అమ్మలు ఇప్పటినుంచే రకరకాల పిండి వంటలు చేయడానికి సిద్ధమవుతుంటారు. అయితే, మనం ఎలాంటి పిండి వంటకం చేసుకోవాలన్నా ముందుగా కావాల్సింది పిండి. ఫెస్టివల్ టైమ్‌లో పిండి పట్టించడానికి బయట మిల్లుల దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఇకపై అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోనే గ్రైండ్ చేసుకునేలా పిండి మరలు వచ్చేశాయి. మరి, వీటిలో ఏ ధాన్యాలు పట్టుకోవచ్చు? ఇవి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం.
మనం బియ్యం, రాగులు, గోధుమలు, జొన్నలు ఇలా వేటితో పిండి కావాలన్నా అప్పటికప్పుడు పిండిమిల్లు దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లకుండా ఇంట్లో ఉన్న మిక్సీలో వేద్దాం అనుకుంటే అంత మెత్తగా రాదు. అందుకే, ఆ ఇబ్బందులు తీర్చేందుకే ప్రస్తుతం మార్కెట్లోకి 'మల్టీ గ్రెయిన్ మిల్లెట్ మిల్లులు' అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే ఏర్పాటు చేసుకునే ఈ పిండి మరలో అన్ని రకాల ధాన్యాలను సింపుల్‌గా పట్టుకోవచ్చు. కళ్లముందే అవసరమైన పిండిని స్వచ్ఛంగా రెడీ చేసుకోవచ్చు.

ఎండుకారం రెడీ చేసుకోవచ్చు!
ఈ మిల్లులో కేవలం పిండిని మాత్రమే కాకుండా ఎండుకారంను కూడా సిద్ధం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. పైగా ఇది పెద్ద పరిమాణంలోనూ ఉండదు. కాబట్టి, ఈ మల్టీ గ్రెయిన్ పిండిమరను వంటగది గట్టు మీద కూడా పెట్టేసుకోవచ్చు. మరి, నచ్చితే మీరూ కొనుగోలు చేసి, కావాల్సిన పిండిని ఇంట్లోనే సింపుల్‌గా రెడీ చేసుకోండంటున్నారు నిపుణులు. ఇదొక్కటే కాదు మీకు ఉపయోగపడే మరికొన్ని స్మార్ట్ కిచెన్ పరికరాలు ఉన్నాయి. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

సూపర్ మార్కెట్లకు వెళ్తున్నారా? - 'ఫుడ్ లేబుల్స్'తో పదార్థాల క్వాలిటీ తెలుసుకోండిలా!
తాజాగా ఉండేందుకు :
మనలో చాలామందికి కూరగాయల్ని ఒకేసారి కాస్త ఎక్కువ కొని ఫ్రిజ్డ్‌లో స్టోర్ చేయడం అలవాటే. అవి పాడవ్వకుండా ఉండాలంటే సరైన పద్ధతిలో నిల్వ చేయడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అందుకు ఈ కాటన్ జిప్‌లాక్ కూరగాయల సంచులు చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు. ఈ సంచులకు జిప్‌లాక్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి, కూరగాయలు చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. అంతేకాదు, ఏ బ్యాగులో ఏది పెట్టామన్న తికమక లేకుండా దానిపై కూరగాయల స్టిక్కర్ కూడా ఉంటుంది. కూరగాయలతో పాటు పండ్లు, ఆకుకూరలు వంటివి కూడా ఈ జిప్‌లాక్ సంచుల్లో నిల్వ చేసుకోవచ్చని చెబుతున్నారు.

అగ్గిపుల్ల లాంటి లైటర్ :
నార్మల్‌గా మనందరం స్టవ్ వెలిగించడానికి లైటర్ వాడుతుంటాం. అయితే, ఇక్కడ చెప్పబోయే లైటర్ మనం రెగ్యులర్‌గా వాడే దానితో పోల్చితే దాస్త డిఫరెంట్ లుకింగ్‌తో ఆకట్టుకుంటుంది. చూడ్డానికి అగ్గిపుల్లలా కనిపించే దీనితో సాధారణంగా స్టవ్ వెలిగించే దానికన్నా అదనపు ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటంటారా ఇంధనం అయిపోతే దీన్ని మళ్లీ నింపుకోవచ్చు. అందుకోసం ఈ లైటర్ అడుగుభాగాన రీఫిల్ వాల్వ్ కూడా ఉంటుంది. ఖర్చు ఆదా అవుతుంది. దీనిలో ఓ పారదర్శక కిటికీ లాంటి నిర్మాణం కూడా ఉంటుంది. దాని ద్వారా ఎంత గ్యాస్ మిగిలి ఉందో కూడా గమనించి, వెంటనే ఇంధనం ఫిల్ చేసుకోవచ్చంటున్నారు. అలాగే, మంట ఎంత రావాలన్నదాన్నీ నియంత్రించేలా ఇందులో స్లైడర్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
మీరు కొనే 'వస్తువు' అసలైనదేనా? - ఈ ప్రభుత్వ గుర్తులతో ఈజీగా కనిపెట్టండిలా!
ఇంట్లో కుండీల్లో స్ట్రాబెర్రీ కోసేద్దామా? - దక్షిణం వైపు బాల్కనీల్లో వేగంగా పెరిగే ఛాన్స్!

