ETV Bharat / offbeat

ఇడ్లీ, దోసెల్లోకి ఈ చట్నీ ట్రై చేయండి - 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది!

కారం, పెరుగు చట్నీ - ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు

karam_perugu_chutney
karam_perugu_chutney (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 21, 2026 at 10:02 AM IST

2 Min Read
Choose ETV Bharat

Karam Perugu Chutney : ఇడ్లీ, దోసెల్లోకి చట్నీ అంటే చాలా మంది పల్లీలు, పుట్నాలు లేదా టమోటా, పుదీనా అవసరం అనుకుంటారు. ఇడ్లీలోకి పల్లీ చట్నీతో పాటు టమోటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. టమోటా, కొత్తిమీర, పుదీనా కలిపి చేసే చట్నీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే, టిఫిన్లు తయారు చేయడం ఒక ఎత్తయితే వాటిల్లోకి చట్నీలు చేయడం మరో ఎత్తు. సమయంతో పాటు శ్రమ కూడా అవసరమే. అందుకే మీకు సమయం ఉన్నపుడు ఇలాంటి చట్నీ తయారు చేసి పెట్టుకుంటే చాలు! టిఫిన్ ఏదైనా సరే రెండు, మూడు రోజుల పాటు ఫ్రిజ్​లో పెట్టి వాడుకోవచ్చు. సింపుల్​గా ఎక్కువ పదార్థాలేమీ వాడకుండానే ట్రై చేసి చూడండి.

రవ్వ ఇడ్లీలు బోర్ కొట్టాయా? - రొటీన్​కు భిన్నంగా "క్యారెట్ ఇడ్లీలు" ట్రై చేయండి!

karam_perugu_chutney
karam_perugu_chutney (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • వెల్లుల్లి - 12
  • జీలకర్ర - 1 స్పూన్
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 3 స్పూన్లు
  • పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
karam_perugu_chutney
karam_perugu_chutney (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా వెల్లుల్లి పొట్టు తీసుకుని రోట్లో వేసుకోవాలి. మీకు రోలు అందుబాటులో లేకుండా మిక్సీలో కూడా వేసుకుని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని రుబ్బు కోవాలి. మరీ పేస్ట్ కాకుండా కాస్త కచ్చా పచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి.
  • వేడెక్కగానే కరివేపాకు, దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం వేసుకోవాలి. కారం వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. ఇపుడు మూతపెట్టుకుని ఐదారు నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికించుకోవాలి.
karam_perugu_chutney
karam_perugu_chutney (Getty images)
  • ఇపుడు 3టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత మరో నాలుగు నిమిషాల పాటు వేయించాలి. నీరంతా ఇంకి పోయే వరకు ఉడికించుకోవాలి. అంతే! ఈ చట్నీ ఇడ్లీ, బొండా, దోసె, చపాతీల్లోకి అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి కూడా ఎంతో బాగుంటుంది.
  • ఇదే చట్నీలోకి మీరు నచ్చితే కాసిన్ని వేయించిన పల్లీలకు తోడు, టమోటా ముక్కలు, కొబ్బరి తురుము వేయించి తీసుకుంటే టేస్ట్ మరోలా ఉంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకుని కలిపేస్తే సరిపోతుంది.

"మామిడికాయ నిల్వ పచ్చడి" ఇలా పెట్టండి - ఏడాదైనా ముక్క కరకరలాడుతుంది!

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే "పుదీనా సేమియా ఉప్మా" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!