ETV Bharat / offbeat

అందరూ మెచ్చే "రాగి సూప్​" - ఈ కొలతలతో చేసుకుంటే సూపర్​ టేస్ట్​!

- నోటికి రుచినీ, బాడీకి శక్తినీ అందించే సూప్ - తయారు చేసుకోవడం చాలా ఈజీ!

Healthy Ragi Soup
Healthy Ragi Soup (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 10, 2026 at 5:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

Healthy Ragi Soup: చాలా మందికి కూల్​ వెదర్​లో హాట్​హాట్​ సూప్​లు తాగడం అలవాటు. దీని కోసం మార్కెట్లో లభించే ఇన్​స్టంట్​ పౌడర్స్​ తెచ్చుకుని సూప్​లాగా చేసుకుని తాగుతుంటారు. కానీ ఆ అవసరం లేకుండా ఇంట్లోనే టేస్టీ అండ్​ హెల్దీ సూప్​ చేసుకోవచ్చు. అది కూడా క్యాల్షియం పుష్కలంగా ఉండే రాగి పిండితో. ఈ సూప్​ టేస్ట్​కు టేస్ట్​.. ఆరోగ్యానికి ఆరోగ్యం. తయారు చేసుకోవడం కూడా సులువే. రకరకాల కూరగాయలతో తయారు చేసుకునే ఈ సూప్​ను కేవలం పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఇష్టంగా తాగుతుంటారు. మరి లేట్​ చేయకుండా కమ్మని రాగి సూప్​ ఎలా చేసుకోవాలో చూసేయండి.

Ragi Soup
Ragi Soup (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • రాగి పిండి - అర కప్పు
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • దాల్చినచెక్క - చిన్నది
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • అల్లం ముక్క - చిన్నది
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయ - 1
  • క్యారెట్​ - 1
  • బీన్స్​ - 3
  • పచ్చి బఠాణీ - 2 టేబుల్​స్పూన్లు
  • మొక్కజొన్న గింజలు - గుప్పెడు
  • మిరియాల పొడి - అర టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం - అర చెక్క
Ragi Soup
Ragi Soup (Getty Images)

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి ఓ చిన్న గిన్నె పెట్టి బీన్స్ ముక్కలు​, పచ్చి బఠాణీ వేసి సరిపడా నీళ్లు పోసి లో టూ మీడియం ఫ్లేమ్​లో 80 శాతం కుక్​ చేసుకోవాలి.
  • అవి ఉడికేలోపు​ ఉల్లిపాయ, క్యారెట్​, పచ్చిమిర్చి, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్​ చేసుకోవాలి. అదే విధంగా అల్లం, వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీసేసి సన్నగా తరిగి పక్కన ఉంచాలి.
Ragi Soup
Ragi Soup (Getty Images)
  • ఓ గిన్నెలోకి రాగి పిండి, కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి.
  • బీన్స్​ ఉడికిన తర్వాత గిన్నెను దింపి నీటిని వడకట్టి పక్కన ఉంచాలి. అదే స్టవ్​ మీద వెడల్పాటి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
  • కాగిన నూనెలో దాల్చినెచక్క, అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి.
  • ఇవన్నీ మంచిగా వేగినాక ఉల్లి, క్యారెట్​ ముక్కలు, ఉడికించిన బీన్స్​, బఠాణీ, స్వీట్​ కార్న్​ వేసి హై ఫ్లేమ్​లో కలుపుతూ వేయించాలి.
Ragi Soup
Ragi Soup (Getty Images)
  • కూరగాయ ముక్కలు కాస్త మగ్గినాక నాలుగు కప్పుల నీరు పోసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మీడియం ఫ్లేమ్​లో మరిగించాలి.
  • వాటర్​ మసులుతున్నప్పుడు మంటను తగ్గించి కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • ఈ విధంగా పిండిని పర్ఫెక్ట్​గా కలుపుకున్నాక లో ఫ్లేమ్​లోనే ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • సూప్​ ఉడికి దగ్గర పడినాక నిమ్మరసం, కొత్తిమీర తరుగు యాడ్​ చేసుకుని కలిపి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈ సూప్​ను వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే రాగి వెజిటేబుల్​ సూప్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Ragi Soup
Ragi Soup (ETV Bharat)

చిట్కాలు:

  • రాగి పిండి తొందరగా ఉడుకుతుంది కాబట్టి బీన్స్​​, బఠాణీలను ముందే ఉడికించి తీసుకుంటే సరిపోతుంది.
  • మీకు నచ్చితే ఈ సూప్​లోకి కొద్దిగా క్యాబేజీ తురుము కూడా యాడ్​ చేసుకోవచ్చు. అదే విధంగా కొత్తిమీర బదులు స్ప్రింగ్​ ఆనియన్స్​ అయినా మిక్స్​ చేసుకోవచ్చు.
  • రాగి పిండి తొందరగా ఉండలు కడుతుంది కాబట్టి కలుపుతూనే ఉడికించాలి.

జొన్న పిండితో టేస్టీ "సూప్​" - పావుగంటలో రెడీ - కూల్​ క్లైమెట్​లో అద్దిరిపోతుంది!

మంచు కురిసే వేళలో మజానిచ్చే "ఎగ్ సూప్" - వేడి వేడిగా సిప్ చేస్తుంటే ఆహాఁ!