"టమోటా పచ్చడి" ఫ్యాన్స్కి పండగే - పచ్చిమిర్చితో అద్భుతమైన చట్నీ మీకోసం!
పచ్చిమిర్చి టమోటా పచ్చడి - ఈ పద్ధతిలో ఓ సారి ట్రై చేసి చూడండి!
green_chilli_tomato_chutney (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 10:58 AM IST
Green Chilli Tomato Chutney : పచ్చిమిర్చితో తయారు చేసే టమోటా చట్నీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ చట్నీ వేడి వేడి అన్నంతో పాటు బ్రేక్ఫాస్ట్ లోకి కూడా చక్కని కాంబినేషన్. ఇంట్లో టమోటాలు, పచ్చిమిర్చి రెడీగా ఉంటే ఇలాంటి రెసిపీ మీరు ట్రై చేసి తీరాల్సిందే.
టమోటాలు ఎండబెట్టకుండానే - అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి!
కావల్సిన పదార్థాలు :
- టమోటాలు - అర కేజీ
- చింతపండు - కొద్దిగా
- పచ్చిమిర్చి - 15
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- మెంతులు - అర స్పూన్
- ఆవాలు - 1 స్పూన్
- మినప్పప్పు - 1 స్పూన్
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- నువ్వులు - 1 టేబుల్ స్పూన్
- లేదా పల్లీలు - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - అర స్పూన్
- వెల్లుల్లి - 6
పోపు కోసం :
- నూనె - 1 స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- పచ్చి పప్పు - 1 స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- ఇంగువ - కొద్దిగా
తయారీ విధానం :
- అర కేజీ టమోటాలు శుభ్రం చేసుకుని పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండును శుభ్రం చేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. అదే విధంగా కారానికి సరిపడా పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. పావు టీ స్పూన్ మెంతులు, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు వేసుకుని వేయించాలి. మినప్పప్పు రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు లేదా పల్లీలు వేసుకోవాలి.
- వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని రంగు మారే వరకు వేయించాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవడం వల్ల నూనెలో వేగినపుడు చిట్లకుండా ఉంటాయి. ఇపుడు వాటిని ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇపుడు అదే ప్యాన్లో కొత్తిమీర వేయించి పక్కకు తీసుకోవాలి.
- ఇపుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని కట్ చేసిన టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపి మూతపెట్టుకుని మీడియం ప్లేమ్లో టమోటాలో మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు వేయించిన పప్పులు, పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే జీలకర్ర, వెల్లుల్లి పాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన కొత్తిమీర, చింతపండు, టమోటా ముక్కలు కూడా వేసుకుని రోటి పచ్చడి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
- అంతే! ఈ చట్నీలోకి పోపు కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది.
- పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని ఆవాలు, జీలక్రర్ర, పచ్చి పప్పు, కరివేపాకు వేసుకుని చిటపటలాడించాలి. ఆ తర్వాత ఇంగువ వేసుకుని కలిపి చట్నీలో కలిపేస్తే సరిపోతుంది.
పాలకూరతో ఇలా ట్రై చేయండి - తక్కువ రైస్, ఎక్కువ కర్రీ తినేయొచ్చు!
నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్గా చేసేయొచ్చు!

