హరియాణా స్టైల్ గరం గరం "బేసన్ మసాలా రోటీలు" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!
నిమిషాల్లో తయారయ్యే రోటీ రెసిపీ - నోటికి కొత్త రుచినిస్తుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 8, 2026 at 5:17 PM IST
Haryana Masala Roti Making in Telugu : చాలా మంది రోటీలను ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లినప్పుడు వీటిని తప్పక టేస్ట్ చేస్తుంటారు. అదేవిధంగా రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు పన్నీర్ లేదా ఏదైనా నాన్‌వెజ్ కర్రీతో వీటిని ఆర్డర్ చేసి ఆస్వాదిస్తుంటారు. కొందరు ఇంట్లోనే ఇవి ప్రిపేర్ చేస్తారు. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా హరియాణా స్టైల్ బేసన్ మసాలా రోటీ ట్రై చేసి చూడండి? ఈ పద్ధతి పాటిస్తూ చేశారంటే చాలా రుచికరంగా వస్తాయి. మరి ఈ రెసిపీని ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ నూనెతో "దొండకాయ ఫ్రై" - ఇలా చేశారంటే ఇష్టం లేని వాళ్లూ లాగించేస్తారు!

కావాల్సిన పదార్థాలు :
- గోధుమపిండి - ఒక కప్పు
- శనగపిండి - అర కప్పు
- ఆయిల్ - 6 స్పూన్లు
- పచ్చిమిర్చి - 3
- ఉల్లిపాయ - 1
- అల్లం తురుము - ఒక స్పూన్
- ధనియాల పొడి - ఒక స్పూన్
- నెయ్యి - ఒక స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- కారం - అర స్పూన్
- గరంమసాలా - అర స్పూన్
- పసుపు - పావు స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
- వాము - అర స్పూన్

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను తరిగి ఉంచాలి.

- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు శనగపిండి వేసి కలపాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ అల్లం తురుము వేయాలి. అలాగే అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ వాము, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ కారం యాడ్ చేసి మిక్స్ చేయాలి.
- అదేవిధంగా పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేయాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. అనంతరం మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.

- పదిహేను నిమిషాల తర్వాత పిండిని చిన్నచిన్న బాల్స్‌లాగా చేయాలి. ఇప్పుడు ఒక్కొ పిండి ముద్దను తీసుకొని చపాతీ పీటపై ఉంచి కర్రతో రోటీ మాదిరిగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక రోటీని వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రోటీని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు కాల్చి ప్లేట్లో వేయాలి.

- అంతే హరియాణా స్టైల్ బేసన్ మసాలా రోటీ రెడీ అయినట్లే!
- వేడివేడిగా ఈ రోటీలు ఏ చట్నీలోకైనా లేదా ఏ కర్రీలోకైనా అద్దిరిపోతాయి!
అద్దిరిపోయే "నాన్‌వెజ్ స్నాక్" - రుచికరమైన 'కోడిగుడ్డు నల్లకారం వేపుడు'
"తలకాయ కర్రీ సూప్" టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి - సింపుల్ ప్రిపరేషన్!

