ETV Bharat / offbeat

ఇంట్లో ఆమెకు బౌన్సర్లు - వారు ఆపగలరా?

- కూతురు ఫోన్​ వినియోగం తగ్గించడానికి బాడీగార్డులను ఏర్పాటు చేసిన తండ్రి - ఇలాంటి ఏర్పాట్లతో మొబైల్ వాడకం తగ్గుతుందా?

Father hires bouncers to Daughter
Father hires bouncers to Daughter (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : June 3, 2026 at 10:18 AM IST

2 Min Read
Choose ETV Bharat

Father hires bouncers to Daughter : సినిమా నటులు, స్పోర్ట్స్​ స్టార్లు, పొలిటికల్ లీడర్స్.. ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే ఇలాంటి వారి చుట్టూ బౌన్సర్లు ఉండడం మనకు తెలిసిందే. అభిమానం పేరుతో వారి మీద పడకుండా లేదా ఎవరైనా దాడులు చేయకుండా అడ్డుకోవడం బౌన్సర్ల డ్యూటీ. కానీ, ఇంట్లో ఉండే తన కూతురి చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేశాడో తండ్రి! ఆమెను ఎవరూ టచ్​ చేయకుండా చూడడానికి కాదు.. ఆమే మొబైల్​ను టచ్​ చేయకుండా ఉండడానికి!

అవును, సోషల్​ మీడియాకు అడిక్ట్​ అయిన తన 16 ఏళ్ల కూతురు ఫోన్​ ఎక్కువగా యూజ్ చేస్తోందని ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు! గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఈ వింత చోటు చేసుకుంది. మొత్తం నలుగురిని నియమించారు. వీరు రెండు షిఫ్టుల్లో డ్యూటీ చేస్తుంటారు. షిఫ్టుకు ఇద్దరు మారుతుంటారు. అమ్మాయి ఫోన్లో ఎంతసేపు ఉన్నది? ఎక్కడికి వెళ్తోంది? ఎవరెవరితో మాట్లాడుతోంది? ఈ డేటా మొత్తం పేరెంట్స్​కు ఇవ్వడమే బౌన్సర్ల విధి. ఇందుకోసం నెలకు రూ.65 వేలు ఖర్చు చేస్తున్నారు ఆ తండ్రి! ఇదే తరహాలో సూరత్‌లోనూ 17 ఏళ్ల అబ్బాయి కోసం బాడీగార్డులను ఏర్పాటు చేశాడు మరో తండ్రి.

అడ్డుకోగలరా?

"మనిషిని ఆపగలం.. మనసును ఆపగలమా?" అంటారు పెద్దలు. పిల్లలు ఒక చేయకూడని పని చేయడానికి ప్రధాన కారణం మనసు. ముందుగా పేరెంట్స్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. బ్రెయిన్ దానికి అడిక్ట్ అయిపోయిందని గుర్తించాలి. మెల్లగా అందులోనుంచి బయటకు ఎలా తేవాలో ఆలోచించాలి. అంతే తప్ప, వ్యక్తులను చుట్టూ నిలబెట్టి ఆ పని చేయకుండా చూడడమనేది సరైన చర్య కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇది శాశ్వత పరిష్కారం కాదని, ఈ చర్య టీనేజ్​ పిల్లలలో మరింత మొండితనాన్ని, మానసిక ఒత్తిడిని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా ఇతర పనులు చేయాలని సూచిస్తున్నారు.

కౌన్సెలింగ్ :

మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగితే.. చైల్డ్ కౌన్సెలర్ లేదా సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. వారు పరిస్థితి తీవ్రతను గుర్తించి కౌన్సెలింగ్ చేస్తారు. మరింత ఇబ్బందిగా ఉంటే.. ప్రత్యేకంగా థెరపీ సెషన్లు ఏర్పాటు చేస్తారు.

ఫ్యామిలీ పాత్రే ఎక్కువ :

  • నిపుణుల సెషన్స్​తోపాటు కుటుంబ సభ్యుల సపోర్టు చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. పిల్లల్లో భయం కలిగించకుండా, మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల జరిగే నష్టాలను స్నేహపూర్వకంగా వివరించాలి.
  • ఈ పరిస్థితి కారణమేంటో ముందుగా తెలుసుకోవాలి. ఒంటరితనం, మానసిక ఆందోళన, స్నేహితుల ప్రెషర్స్​ వల్ల ఫోన్‌కు అలవాటు పడ్డారా? అనేది గుర్తించాలి.
  • వారికి తెలియకుండానే దృష్టిని మళ్లించడానికి స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ వంటి క్లాసుల్లో చేర్పించాలి.
  • కుటుంబ సభ్యులంతా కలిసి ఉండే సమయం తప్పకుండా పెట్టుకోవాలి. ఆ సమయంలో పిల్లలకు నచ్చిన పనులను పెద్దలు ప్లాన్ చేయాలి. బోర్డ్ గేమ్స్ ఆడటం వంటివి అలవాటు చేయాలి.
  • పిల్లలకు తల్లిదండ్రులే రోల్ మోడల్స్ అని గుర్తించాలి. పెద్దవారినే అనుసరిస్తుంటారు కాబట్టి.. పిల్లల ముందు పేరెంట్స్​ ఎక్కువ సమయం ఫోన్లలో గడపకుండా ఉండాలి.
  • ఇలా ఒక ప్లాన్​ ప్రకారం వారిని దారికి తేవాలి తప్ప, ఇలా బలవంతం చేయడం వల్ల ఉపయోగం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలా ఫోన్​కు అడిక్ట్​ అయితే, ఈ పద్ధతుల్లో వారిని సెట్​ చేసేందుకు ప్రయత్నం చేయండి.