ETV Bharat / offbeat

ఇంటర్నెట్​ లేకపోయినా "గూగుల్​ మ్యాప్స్"​​ యూజ్​ చేయొచ్చు! - జస్ట్​ ఈ ట్రిక్​ తెలిస్తే చాలు!

-మీరు రెగ్యులర్​గా గూగుల్​ మ్యాప్స్​ యాజ్​ చేస్తుంటారా? - ఈ విషయం తెలుసుకుంటే యాక్సెస్​ ఈజీ!

How to Use Google Maps without Internet
How to Use Google Maps without Internet (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 4:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

How to Use Google Maps without Internet: స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో గూగుల్‌ మ్యాప్స్‌ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో. షార్ట్​కట్స్​, తెలియని, కొత్త ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో ప్రజలు తమ గమ్య స్థానాలను చేరుకోవడానికి వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. స్మార్ట్​ ఫోన్​ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వీటిని ఉపయోగించే ఉంటారు. అయితే గూగుల్​ మ్యాప్స్​​ యూజ్​ చేయాలంటే ఇంటర్నెట్​ తప్పనిసరి. ఇది లేకపోతే ఈ యాప్​ యూజ్​ చేయడానికి అవ్వదు. కానీ మీకు తెలుసా? యాప్​లోని ఈ సదుపాయం ద్వారా ఫోన్​లో నెట్​ లేకపోయినా మ్యాప్​ యూజ్​ చేసి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

సిగ్నల్స్ సరిగా లేకపోవడం, హఠాత్తుగా నెట్ బ్యాలెన్స్ అయిపోవడం వంటి వల్ల గూగుల్​ మ్యాప్స్​​ వర్క్​ అవ్వదు. మనకు తెలిసిన ప్లేస్​లు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఈ పరిస్థితి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, నెట్ రాకపోయినా యూజర్ సులభంగా గూగుల్ మ్యాప్స్ వాడుకునేందుకు ఈ యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే లొకేషన్ యాక్సెస్ చేసి గమ్యాన్ని చేరుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్‌ను ఇంటర్నెట్ లేనప్పుడు వాడటం చాలా సులభం. అయితే ప్రయాణానికి ముందే ఓ చిన్న పని చేయాలి. అది మీరు వెళ్లే ప్లేస్​ మ్యాప్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా మ్యాప్​ వాడుకోవచ్చు. అదే విధంగా ఓ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రతిసారీ మ్యాప్స్‌లో లొకేషన్ అడ్రస్ నమోదు చేయవలసిన అవసరం లేకుండా.. డైరెక్ట్​గా సేవ్​ చేసుకున్న వాటిని యాక్సెస్​ చేసుకోవచ్చు.

మ్యాప్స్​ను ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి:

  • ముందుగా మీ ఫోన్​లో గూగుల్​ మ్యాప్స్​ యాప్​ ఓపెన్ చేయాలి.
  • హోమ్​ పేజీలో రైట్​ సైడ్​ కార్నర్​లో మీ ప్రొఫైల్​ ఐకాన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు మీకు సర్వీస్​లు కనిపిస్తాయి. అందులో Offline Maps ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అప్పుడు మీకు Select Your Own Map అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే ఓ బాక్స్​ కనిపిస్తుంది.
  • ఆ బాక్స్​ను డ్రాగ్​ చేస్తూ మీరు వెళ్లాల్సిన ఏరియాను సెలెక్ట్​ చేసుకుని Download ఆప్షన్​పై క్లిక్​ చేస్తే మ్యాప్​ డౌన్​లోడ్​ అవుతుంది.

ఆఫ్​లైన్​ మ్యాప్స్​ ఎలా ఉపయోగించాలి: ఒక్కసారి ఈ మ్యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకుంటే నెట్​ లేకపోయినా ఉపయోగించవచ్చు.

  • అందుకోసం మీ ఫోన్​లో గూగుల్​ మ్యాప్​​ ఓపెన్​ చేయాలి.
  • హోమ్​ పేజీలో రైట్​ సైడ్​ కార్నర్​లో మీ ప్రొఫైల్​ ఐకాన్​పై క్లిక్​ చేయాలి.
  • అందులో Offline Maps ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. అప్పుడు మీకు స్క్రీన్​ మీద మీరు డౌన్​లోడ్​ చేసుకున్న మ్యాప్స్​ లిస్ట్​ కనిపిస్తాయి.
  • అందులో మీకు కావాల్సిన మ్యాప్​పై డబుల్​ క్లిక్​ ఇస్తే ఆ రూట్​కు సంబంధించిన మ్యాప్​ ఓపెన్​ అవుతుంది. దాని ద్వారా మీరు వెళ్లాలనుకున్న ప్లేస్​కు వెళ్లొచ్చు.

ఇవి గుర్తించుకోవాలి:

  • ఒకసారి డౌన్‌లోడ్ అయిన తర్వాత, మీకు నెట్ లేకపోయినా ఆ ఏరియాలో రూట్ మ్యాప్ పనిచేస్తుంది. అయితే ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు ట్రాఫిక్ అప్‌డేట్స్ కనిపించవు.
  • డౌన్​లోడ్​ చేసుకున్న మ్యాప్స్​ ఫోన్ మెమరీలో స్టోర్ అవుతాయి. కాబట్టి తగినంత స్పేస్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
  • మీ ప్రయాణం పూర్తైన తర్వాత కావాలనుకుంటే వాటిని డిలీట్​ చేసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్​లో 'జెమిని'- AI మీకు రూట్ డైరెక్షన్స్ ఎలా చెబుతుందో తెలుసా?

వాహనం పార్కింగ్​ చేసి మర్చిపోతున్నారా? - గూగుల్​ మ్యాప్స్​తో మీ వెహికిల్​ను ఇట్టే కనిపెట్టండి