ETV Bharat / offbeat

'రాయలసీమ, దక్షిణ కోస్తా' ప్రజలకు గుడ్ న్యూస్ - మరో రెండు ఎక్స్​ప్రెస్ రైళ్లు రెగ్యులర్!

విజయవాడ, రేణిగుంట జంక్షన్ల మీదుగా ప్రయాణం - స్టేషన్లు, కొత్త వేళలు ప్రకటించిన 'SCR'

వీక్లీ ఎక్స్​ప్రెస్ రైళ్లు
weekly_express_trains (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 12:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

Special Trains : రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రజలు, రైల్వే ప్రయాణికులకు ఇదొక గుడ్ న్యూస్. విజయవాడ, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్లే ట్రైన్ నంబర్ 15302/15301 లాల్ కువాన్ - కేఎస్​ఆర్ బెంగళూరు సిటీ - లాల్ కువాన్ ఎక్స్​ప్రెస్, రాయచూర్ రేణిగుంట మీదుగా తిరుచురాపల్లి వెళ్లే ట్రైన్ నంబర్ 19418/19420 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి - అహ్మదాబాద్ వీక్లీ ఎక్స్​ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రెండు రైళ్లు సెప్టెంబర్ నుంచి 'రెగ్యులర్ సేవలు' అందించనున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

  1. ట్రైన్ నంబర్ 15302/15301 లాల్ కువాన్ - కేఎస్​ఆర్ బెంగళూరు సిటీ - లాల్ కువాన్ ఎక్స్​ప్రెస్
  2. ట్రైన్ నంబర్ 19419/19420 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి - అహ్మదాబాద్ ఎక్స్​ప్రెస్

"అనకాపల్లి-సోలాపూర్ వీక్లీ ఎక్స్​ప్రెస్ ఇక రెగ్యులర్" - రైలు వేళలు, ఆగే స్టేషన్ల వివరాలివే!

  • ట్రైన్ నంబర్ 15302 సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ రైలు సెప్టెంబర్ 26, అక్టోబర్ 3, 10 తేదీల్లో అందుబాటులో ఉండదు.
  • ట్రైన్ నంబర్ 15301 సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. ఈ రైలు సెప్టెంబర్ 29, అక్టోబర్ 6, 13 తేదీల్లో అందుబాటులో ఉండదు.

రైళ్ల వేళలు, స్టేషన్ల వివరాలు

ట్రైన్ నంబర్ 15302 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 5.45గంటలకు లాల్ ​కువాన్​ స్టేషన్లో బయల్దేరుతుంది. కిచ్చా స్టేషన్ మీదుగా ప్రయాణించి ఆదివారం సాయంత్రం 7.19గంటలకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్​నగర్ స్టేషన్ చేరుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా ప్రయాణించి సోమవారం అర్ధరాత్రి 1.35గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ఉదయం 8గంటలకు రేణిగుంట జంక్షన్ చేరుతుంది. 10 నిమిషాల విరామం అనంతరం బయల్దేరి సాయంత్రం 5.25గంటలకు బెంగళూరు చేరుతుంది.

ట్రైన్ నంబర్ 15301 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 7.15గంటలకు బెంగళూరులో బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1.40గంటలకు రేణిగుంట చేరుకుని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా ప్రయాణించి రాత్రి 8గంటలకు విజయవాడ జంక్షన్​ చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్​నగర్ మీదుగా ప్రయాణించి గురువారం ఉదయం 9గంటలకు లాల్​కువాన్ స్టేషన్ చేరుతుంది.

ట్రైన్ నంబర్ 19419/19420 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి - అహ్మదాబాద్ వీక్లీ ఎక్స్​ప్రెస్

ట్రైన్ నంబర్ 19419 సెప్టెంబర్ 24న ప్రారంభం కానుంది. ట్రైన్ నంబర్ 19420 సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది.

రైళ్ల వేళలు, స్టేషన్ల వివరాలు

ట్రైన్ నంబర్ 19419 ప్రతి గురువారం ఉదయం 9.20గంటలకు అహ్మదాబాద్​లో బయల్దేరి వడోదర మీదుగా ప్రయాణిస్తూ శుక్రవారం కృష్ణా, రాయచూర్ స్టేషన్లకు చేరుతుంది. మంత్రాలయం, ఆదోని, గుంతకల్, తాడిపత్రి, కడప మీదుగా ఉదయం 11.40గంటలకు రేణిగుంట జంక్షన్ చేరుకుంటుంది. శనివారం తెల్లవారుజామున 3.35గంటలకు తిరుచిరాపల్లి చేరుతుంది.

ట్రైన్ నంబర్ 19420 ప్రతి ఆదివారం ఉదయం 5.45గంటలకు తిరుచిరాపల్లిలో బయల్దేరి సోమవారం రాత్రి 9.15గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.

'రుణమో రామచంద్రా!' - లోన్లు ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారో తెలుసా?

యువత పెళ్లికి భయపడడానికి కారణాలివే! - సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!