ETV Bharat / offbeat

కమ్మని "గోంగూర పండుమిర్చి" రోటి పచ్చడి - సువాసనకే మౌత్ వాటరింగ్​ అయిపోద్ది!

- చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు - ఈ సూపర్ టేస్ట్ చట్నీని అందరూ ఆస్వాదిస్తారు

Gongura Pandu Mirchi pachadi
Gongura Pandu Mirchi pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 19, 2026 at 10:07 AM IST

2 Min Read
Choose ETV Bharat

Gongura Pandu Mirchi pachadi : పండు మిర్చి పచ్చడిని అమితంగా ఇష్టపడేవారు ఎంతో మంది ఉంటారు. ఇక గోంగూర గురించి చెప్పాల్సిన పనేలేదు. ఈ ఆంధ్రామాతను ఆరగించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ రెండింటినీ కలిపి "అంతకు మించి" అనే పచ్చడిని ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. మరి, దీన్ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అందులో ఉండే పోషకాలేంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

గోంగూరలోని పోషకాలు ఇవే :

  • విటమిన్ A : కంటి చూపును మెరుగుపరుస్తుంది
  • విటమిన్ C : రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • విటమిన్ B : జీవక్రియకు సహాయపడుతుంది
  • విటమిన్ B9 (ఫోలిక్ యాసిడ్): గర్భిణులకు చాలా అవసరం

ఖనిజాలు :

  • ఐరన్ : రక్తహీనతను నివారిస్తుంది
  • కాల్షియం : ఎముకలను బలంగా చేస్తుంది
  • పొటాషియం : రక్తపోటును నియంత్రిస్తుంది
  • మెగ్నీషియం : నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది
  • ఫైబర్ : జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
  • యాంటీఆక్సిడెంట్లు : శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి

పండు మిర్చీలో ఉండే పోషకాలు :

  • విటమిన్ C : రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • విటమిన్ A : కంటి చూపును మెరుగుపరుస్తుంది
  • విటమిన్ B6: మెదడు పనితీరుకు సహాయపడుతుంది
  • ఖనిజాలు :
  • పొటాషియం : రక్తపోటును నియంత్రిస్తుంది
  • ఇనుము : రక్తహీనతను నివారిస్తుంది
  • క్యాప్సైసిన్: నొప్పిని తగ్గిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది
  • ఫైబర్: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • యాంటీఆక్సిడెంట్లు: శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి

నోరూరించే "గోంగూర నువ్వుల పచ్చడి" - టేస్ట్ అద్భుతం, 20 రోజులు నిల్వ!

గోంగూర - పండు మిర్చి పచ్చడి ఇలా చేద్దాం :

కావాల్సిన పదార్థాలు :

  • గోంగూర - 2 పెద్ద కట్టలు
  • పండు మిరప కాయలు - 1/4 కేజీ

పోపు కోసం :

  • ఆయిల్ - 4 స్పూన్లు
  • మినప్పప్పు - 1/2 స్పూన్
  • సెనగపప్పు - 1/2 స్పూన్
  • నువ్వు పప్పు - 1/2 స్పూన్
  • జీలకర్ర - కాస్త
  • మెంతులు - చాలా తక్కువగా
  • ధనియాలు - 1/4 స్పూన్
  • ఆవాలు - 1/4 స్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • ఉప్పు - తగినంత

తయారీ విధానం :

  • ముందుగా స్టౌపైన గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల్ ఆయిల్ వేయండి
  • వేడెక్కిన తర్వాత పోపు కోసం తీసుకున్న ఐటమ్స్ అన్నీ అందులో వేసేయండి
  • చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని బయటకు తీసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మెత్తగా దంచుకోవాలి
  • ఇప్పుడు గోంగూర ఆకులు కోసి, నీళ్ళలో శుభ్రంగా కడగాలి
  • ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా పూర్తిగా పొడిగా మారేంత వరకూ ఉంచాలి.
  • ఇప్పుడు స్టౌపైన మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్​ వేయాలి. అందులో గోంగూరను వేసుకొని చక్కగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పండు మిరప కాయలను సైతం అందులో వేసి, కాస్త వేయించాలి.
  • ఇప్పుడు వాటిని రోట్లో వేసుకొని చక్కగా దంచుకోవాలి. పొడి చేసుకున్న పోపుల పొడిని కూడా ఇందులో వేసుకొని చక్కగా నూరుకోవాలి.
  • అంతేనండీ. ఎంతగానో నోరూరించే గోంగూర-పండు మిర్చి పచ్చడి సిద్ధమైపోతుంది.
  • పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీని సువాసనకే నోట్లో నీళ్లు ఊరుతాయంటే నమ్మాల్సిందే.
  • రెగ్యులర్​ గోంగూర పచ్చడి కాకుండా, ఈ సారి ఇలా ప్రిపేర్ చేయండి.

చూస్తేనే తినాలనిపించే "ఉసిరికాయ కొబ్బరి పచ్చడి" - అన్నంతోపాటు టిఫెన్స్​లోకి సూపర్ టేస్ట్!