గోంగూరతో పప్పు, పచ్చడే కాదు ఇలా "గారెలు" చేసుకోండి - నూనె తక్కువ, రుచి ఎక్కువ!
గోంగూరతో సింపుల్‌గా చేసుకునే రెసిపీ గారెలు - ఇలా చేశారంటే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 17, 2025 at 9:47 AM IST
Sorrel Leaves Garelu Recipe : గోంగూర పేరు చెబితేనే చాలా మంది నోట్లో నీళ్లూరుతాయి. దీనితో పచ్చడి, పప్పు ఇలా ఏది చేసినా ఆ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అలాగని ఎప్పుడూ ఒకే రకరమైన వంటలు తినాలంటే బోర్ అనిపిస్తుంది. అందుకే మీకోసం ఇవాళ ఓ మంచి రెసిపీని తీసుకొచ్చాం. అదే నోరూరించే కమ్మని గోంగూర గారెలు. ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని పాటిస్తూ చేశారంటే క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. చాలా తక్కువ పదార్థాలతో వీటిని రెడీ చేసుకోవచ్చు.
ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతాయి. అంతేకాక ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటాయి! బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి వారికి సర్ప్రైజ్ ఇవ్వండి. బిగినర్స్ కూడా దీనిని సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
సాయంత్రం వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి! - సింపుల్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- మినపప్పు - పావు కిలో (250 గ్రాములు)
- అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
- గోంగూర - 1 కట్ట
- కసూరి మెంతి - 1 టీ స్పూన్
- ఉప్పు - తగినంచతా
- పచ్చిమిర్చి - 8
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా కట్ట గోంగూరను తీసుకొని ఆకులను తుంచి పెట్టుకోవాలి. అలాగే ఎనిమిది పచ్చిమిర్చిని తరిగి తీసుకోవాలి.
- మరోవైపు గిన్నెలో పావు కిలో మినపప్పు, సరిపడా నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. రెండు గంటల తర్వాత మిక్సీజార్‌లో నానబెట్టిన మినపప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి.
- అదేవిధంగా మిక్సీజార్‌లో గోంగూర ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న మినప్పిండి, గోంగూర పేస్ట్ వేసి కలపాలి. అలాగే ఒక టీ స్పూన్ కసూరిమెంతి, ఒక టీ స్పూన్ అల్లంతురుము, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి పిండిని బాగా మిక్స్ చేయాలి.

- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయికి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె బాగా వేడైన తర్వాత చేతికి కొద్దిగా తడి అంటించి పిండిని చేతితో తీసుకొని గారెలా మాదిరిగా ఒత్తుకొని కడాయికి సరిపడా వేయాలి.
- అనంతరం గారెలను ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత రెండు వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
- ఇక అంతే కరకరలాడే గోంగూర గారెలు తయారైనట్లే!

- ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేశారంటే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాక వారికి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది!
- మీరు గోంగూర గారెలను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే గోంగూర, మినపప్పుతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
చిక్కటి గ్రేవితో "మీల్ మేకర్ కర్రీ"- నాన్‌వెజ్‌ని మించిన టేస్ట్ కోసం ఇలా చేయండి!
రాయలసీమ స్టైల్ "చామదుంప కారం పులుసు" - నోటికి కొత్త రుచినిచ్చే ఈ రెసిపీ ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

